తెలంగాణలో కొత్తగా 1,967 పాజిటివ్ కేసులు.. 8 మంది మరణాలు
21-08-202021-08-2020 08:45:34 IST
Updated On 21-08-2020 09:39:52 ISTUpdated On 21-08-20202020-08-21T03:15:34.822Z21-08-2020 2020-08-21T03:15:12.839Z - 2020-08-21T04:09:52.649Z - 21-08-2020

దేశంలో కరోనా ప్రవేశించి ఆరునెలలు అవుతోంది. తెలంగాణలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,967 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొత్తగా 8 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 99,391కు చేరగా, మృతుల సంఖ్య 737కి చేరింది. తాజాగా 1,781 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 76,967కు చేరింది. ఇక ప్రస్తుతం 21,687 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక తాజాగా నమోదైన కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో 473, మేడ్చల్ 170, కరీంనగర్ 86, వరంగల్ అర్బన్ 101, రంగారెడ్డి 202, నల్గొండ 60, నిజామాబాద్ 69, సిద్ధిపేటలలో 49 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 26,767 టెస్ట్ లు చేయగా ఇప్పటి వరకు చేసిన కరోనా టెస్ట్ ల సంఖ్య 8,48,078కి చేరింది. ఇక ఇక్కడ సంతోషం కలిగించే అంశం ఏమిటంటే రికవరీ రేట్ 77.43 గా ఉంది. అలానే డెత్ రేట్ కూడా 0.74శాతంగా ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ పెరగడం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. స్వీయనియంత్రణ పాటించడం, మాస్కు ధరించడం చేయాలి. సాధ్యమయినంత వరకూ బయటకు రాకుండా వుండడం మంచిది. ఒకవేళ ఇంటి నుండి బయటకు వచ్చేవారంతా వేడి నీటిలో ఉప్పు వేసి గానీ, బెటాడిన్ గార్గిల్ ద్రావణాన్ని ఒక మూతకు 2 మూతల నీటితో కలుపుకుని ఉదయం, సాయంత్రం పుక్కిలిస్తే వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతున్నారు. వైరస్ బారిన పడిన వారు కూడా కోవిడ్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

నా రూటే సెపరేటు
23 minutes ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
14 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
15 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
14 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
18 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
19 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
18 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
20 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
21 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
16 hours ago
ఇంకా