newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ‌లో ఇంట‌ర్ ఫ‌లితాలు.. ఫస్టియర్ 60 శాతం.. సెకండియర్ 69 శాతం

18-06-202018-06-2020 15:27:40 IST
Updated On 18-06-2020 18:51:30 ISTUpdated On 18-06-20202020-06-18T09:57:40.802Z18-06-2020 2020-06-18T09:53:02.506Z - 2020-06-18T13:21:30.225Z - 18-06-2020

తెలంగాణ‌లో ఇంట‌ర్ ఫ‌లితాలు.. ఫస్టియర్ 60 శాతం.. సెకండియర్ 69 శాతం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి.  ఇంటర్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, ద్వితీయ సంవ‌త్స‌రంలో 68.86 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి ఇంటర్మీడియెట్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ ఏడాది ఒకేసారి విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.50 లక్షలమంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రెండేళ్ళ ఫలితాలను ఒకేమారు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధపడ్డారు. లాక్ డౌన్ వున్నా త్వరగానే ఫలితాలు విడుదలచేశామని మంత్రి తెలిపారు. ఈ సారి కూడా బాలికలే పై చేయి సాధించారు. బాలికలు మొదటి సంవత్సరంలో 67.4 శాతం పాసవ్వగా బాలురు 52.30 శాతం ఉత్తీర్ణత సాధించారు.సెకండియర్‌లో బాలికలు 75.15, బాలురు 62.10 శాతం ఉత్తీర్ణత సాధించారు.తొలి ఏడాది 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ఫస్ట్, రెండో ఏడాది ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామన్నారు మంత్రి. 

ఈ ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ తో పాటు ఇతర వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. అలాగే తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక యాప్‌లో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు ముందుగా గూగుల్ ప్లేస్టోర్‌లో TSBIE m-Services యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ సైజ్ 4 ఎంబీ లోపే ఉంటుంది. ఇంటర్‌ఫేజ్‌ కూడా సులభంగా ఉంటుంది. ఫలితాలు విడుదలైన వెంటనే ఈ యాప్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఎలాంటి సాంకేతిక ఇబ్బందులకు తావులేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

TSBIE m-Services యాప్ ఓపెన్ చేసిన వెంటనే Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత విద్యా సంవత్సరాన్ని సెలక్ట్‌ చేసుకుని హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం Search బటన్‌ క్లిక్‌ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ఇది. 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   8 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle