తెలంగాణలో 6 రెడ్ జోన్ జిల్లాలు.. 18 ఆరెంజ్.. 9 గ్రీన్ జిల్లాలు
02-05-202002-05-2020 09:28:56 IST
Updated On 02-05-2020 09:59:38 ISTUpdated On 02-05-20202020-05-02T03:58:56.465Z02-05-2020 2020-05-02T03:58:54.168Z - 2020-05-02T04:29:38.960Z - 02-05-2020

తెలంగాణలో రెడ్ జోన్ కేటగిరీ జిల్లాలు గణనీయంగా తగ్గాయి. గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ 9 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించగా తాజాగా 6 జిల్లాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో 18 ఆరెంజ్ జోన్లో, 9 గ్రీన్ జోన్లో ఉన్నాయి. తాజా వర్గీకరణ మే 3 నుంచి అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా 130 జిల్లాలు రెడ్ జోన్లో, 284 జిల్లాలను ఆరెంజ్ జోన్లో, 319 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతకుముందు వారం దేశవ్యాప్తంగా 170 జిల్లాలు రెడ్ జోన్లో, 207 జిల్లాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ జోన్ల వర్గీకరణపై తాజా ఉత్తర్వులను రాష్ట్రాలకు పంపారు. గత వారం కేవలం కేసుల సంఖ్య, కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న కాలాన్నిబట్టి జోన్లను వర్గీకరించారు. అయితే తాజాగా ఆ ప్రాతిపదికను మరింత విస్తృతం చేసినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివ్ కేసుల నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరగడంతో ప్రాతిపదికన విస్తృతం చేసినట్టు తెలిపింది. కేసుల సంఖ్య, డబ్లింగ్ రేటు, టెస్టుల పరిధి, సర్వైలెన్స్ వంటి అంశాల ప్రాతిపదికన జిల్లాలను వర్గీకరించినట్టు తెలిపింది. ఇప్పటివరకు కరోనా కేసులు లేని వాటిని, గడిచిన 21 రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాని జిల్లాలను గ్రీన్ జోన్లోకి పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలిపింది. కొన్ని జిల్లాలు రెడ్ జోన్లోకి చేర్చడాన్ని రాష్ట్రాలు ప్రశ్నించాయని, అయితే ఈ జాబితా చలనశీలత కలిగినదని, ప్రతి వారం ఈ జాబితా మారుతుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ ఆధారంగా, రాష్ట్రస్థాయిలో అదనపు విశ్లేషణ ఆధారంగా, రాష్ట్రాలు మరిన్ని రెడ్ జోన్లను, ఆరెంజ్ జోన్లను నిర్దేశించవచ్చని పేర్కొన్నారు. అయితే కేంద్రం ఇచ్చిన రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జిల్లాల జోనల్ వర్గీకరణలో రాష్ట్రాలు సడలింపు చేయరాదని పేర్కొన్నారు. జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నప్పుడు కార్పొరేషన్లను, జిల్లాలోని మిగిలిన ప్రాంతాన్ని వేర్వేరు యూనిట్లుగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఒక యూనిట్లో 21 రోజులపాటు కేసులు లేనిపక్షంలో ఆ యూనిట్ వరకు జోన్ వర్గీకరణను మార్చవచ్చన్నారు. అందుకు సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. కాగా, కేంద్రం ప్రకటించినట్లుగా ఆయా జిల్లాలను పూర్తిస్థాయిలో రెడ్జోన్లుగా ఉంచాలా లేక అక్కడ కూడా కంటైన్మెంట్ జోన్ల ప్రకారమే నడుచుకోవాలా అన్న దానిపై రాష్ట్ర అధికారులు శనివారం నిర్ణయం తీసుకోనున్నారు. కరీంనగర్ ప్లాన్‌ను అమలు చేయడం వల్లే ఇప్పటివరకు విజయవంతంగా వైరస్‌ను నియంత్రణలోకి తీసుకురాగలిగామని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రకారమే నిర్ణయం తీసుకుంటామంటున్నారు. రెడ్ జోన్లో.. 1. హైదరాబాద్ 2. సూర్యాపేట 3. రంగారెడ్డి . 4. మేడ్చల్ 5. వికారాబాద్ 6. వరంగల్ అర్బన్ గ్రీన్ జోన్లో.. 1. పెద్దపల్లి 2. నాగర్‌కర్నూల్ 3. ములుగు 4. భద్రాద్రి కొత్తగూడెం 5. మహబూబాబాద్ 6. సిద్దిపేట 7. వరంగల్ రూరల్ 8. వనపర్తి 9. యాదాద్రి భువనగిరి ఆరెంజ్ జోన్లో.. 1. నిజామాబాద్ 2. గద్వాల 3. నిర్మల్ 4. నల్లగొండ 5. ఆదిలాబాద్ 6. సంగారెడ్డి 7. కామారెడ్డి 8. ఆసిఫాబాద్ 9. కరీంనగర్ 10. ఖమ్మం 11. మహబూబ్‌నగర్ 12. జగిత్యాల 13. రాజన్న సిరిసిల్ల 14. భూపాల్పల్లి 15. మెదక్ 16. జనగాం 17. నారాయణ్‌పేట్ 18. మంచిర్యాల మరో 47 కంటైన్మెంట్ జోన్ల ఎత్తివేత గ్రేటర్లో ఇప్పటివరకు 151 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయగా, వీటిలో ఇప్పటికే సగానికిపైగా ఎత్తివేశారు. తాజాగా శుక్రవారం మరో 47 కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఆయా జోన్ల పరిధిలో గత 14 రోజుల నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం వల్లే వాటిని కంటైన్మెంట్ పరిధి నుంచి ఎత్తేసినట్లు తెలిపింది. కాగా, కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర బృందం శుక్రవారం పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. అనంతరం ఎర్రమంజిల్, సోమాజిగూడలోని వలస కూలీలు.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీసింది. తర్వాత ఉప్పల్ ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోసెంటర్ను సందర్శించింది.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
5 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
31 minutes ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
7 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
8 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
3 minutes ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
2 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
9 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021
ఇంకా