newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో 2,932 కేసులు ...కరోనా తీవ్రతపై ఆందోళన

28-08-202028-08-2020 09:44:11 IST
Updated On 28-08-2020 10:41:21 ISTUpdated On 28-08-20202020-08-28T04:14:11.752Z28-08-2020 2020-08-28T04:14:05.599Z - 2020-08-28T05:11:21.071Z - 28-08-2020

తెలంగాణలో 2,932 కేసులు ...కరోనా తీవ్రతపై ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహమ్మారి కరోనా వైరస్ తెలంగాణలో అన్ని జిల్లాలు, గ్రామాలకు వ్యాపిస్తోంది. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం మూలంగానే ఇలాంటి దుస్థితి ఏర్నడిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని, గవర్నర్‌ కూడా ప్రభుత్వ వైఫల్యం చెందింది అని చెప్పారన్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరోనా ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క అభిప్రాయం వ్యక్తంచేశారు. 

ఏజెన్సీ పెద్దాసుపత్రులు సమస్యలతో ఉండటం దారుణమన్నారు.గిరిజనులు వైద్యం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోనా సమయంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్లు,నర్స్ ల పోస్టులు భర్తీ చేయాలన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చి ఉచిత వైద్యం అందించాలని వారు డిమాండ్ చేసారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా ప్రజలను గాలికొదిలేసి సీఎం కెసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

మరోవైపు తెలంగాణలో గురువారం 61,863 నమూనాలు పరీక్షించగా 2,932 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,17,415 చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 799కి చేరింది.దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,17,415కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 11 మంది కరోనా వలన చనిపోయారు దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 799కు చేరింది.

కరోనా నుండి 87,675 మంది కోలుకోగా నిన్న ఒక్కరోజే 1580 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 28,941 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 22,097 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. గురువారం నాటికి టెస్ట్ చేసిన మొత్తం శాంపిల్స్ సంఖ్య 12,04,343కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 520 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా 218 కేసులతో నిలిచింది.

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle