తెలంగాణలో 1590 కరోనా కేసులు, ఆంధ్రలో 961 కేసులు.. తగ్గని పోటీ
06-07-202006-07-2020 09:18:32 IST
Updated On 06-07-2020 10:50:40 ISTUpdated On 06-07-20202020-07-06T03:48:32.213Z06-07-2020 2020-07-06T03:48:29.240Z - 2020-07-06T05:20:40.180Z - 06-07-2020

అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలూ కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి గత 10 రోజులుగా పోటీ పడుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఒక్కరోజులోనే కొత్తగా 1,590 మంది కరోనా బారిన పడగా ఆంధ్రప్రదేశ్‌లో ఒకేరోజు 961మంది కరోనా బారినపడ్డారు. అయితే కరోనా పరీక్షల సంఖ్యలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు మధ్య చాలా వ్యత్యాసం చోటుచేసుకోవడం విశేషం. తెలంగాణలో ఆదివారం 5,290 మందికి పరీక్షలు నిర్వహించగా 1590మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కాకపోతే కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించింది. వైద్య పరీక్షల్లో 10 లక్షల మార్క్‌ను దాటింది. ఆదివారం నాటికి 10,17,140 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వివరాల్లోకి వస్తే... తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎంతకీ తగ్గడంలేదు. రోజు రోజుకు కరోనా తీవ్రత పెరుగుతుందే త విజృంభిస్తోంది. దీంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,590 మంది కరోనా బారిన పడ్డారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 5,290 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 3,700 మందికి నెగటివ్ రాగా... 30 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 23,902కు పెరిగింది. ఇందులో 10,904 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 12,703 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా మరో ఏడుగురు కరోనాతో మరణించడంతో ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 295కి చేరింది. ఆదివారం 1,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ అన్ని జిల్లాల్లో 23,902 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 295 మంది కరోనాతో చనిపోయారు. కరోనా సోకి చికిత్స పొంది 1,166మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 15, 703 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. తాజాగా ఆదివారం 1,277 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 125, రంగారెడ్డిలో 82, సూర్యాపేట్‌లో 23, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో 19 చొప్పున కేసులు నమోదయ్యాయి. నల్లగొండలో 14, కరీంనగర్, వనపర్తి జిల్లాల్లో 4 చొప్పున, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో 3 చొప్పున, నిర్మల్, వికారాబాద్, కొత్తగూడెం, జనగామ జిల్లాల్లో 2 చొప్పున, గద్వాల్, సిరిసిల్ల, సిద్దిపేట్, వరంగల్ రూరల్, నారాయణపేట్, పెద్దపల్లి, యాదాద్రి, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి పురుషుల్లోనే అధికంగా కనిపిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 23,898 పాజిటివ్ కేసులను పరిశీలిస్తే అందులో పురుషులు 15,559 మంది (65.1శాతం) ఉన్నారు. మహిళలు 8,339 మంది (34.90 శాతం) ఉన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అధికంగా 13 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపే ఎక్కువగా ఉన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు కూడా వైరస్ బారిన పడుతున్నప్పటికీ, 12 ఏళ్లలోపు వారిలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు.. 961 కొత్త కేసులు కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించింది. వైద్య పరీక్షల్లో 10 లక్షల మార్క్‌ను దాటింది. ఆదివారం నాటికి 10,17,140 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,697కు చేరింది. ఈ మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 391 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 232కు చేరింది. ఈ రోజు మృతి చెందిన వారిలో కర్నూలులో ఐదుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, కృష్ణ, విశాఖపట్నంలో ఒక్కొక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,043 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
36 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
an hour ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
4 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
2 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
5 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
19 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
a day ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
20 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16-04-2021

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
a day ago
ఇంకా