newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో 11 జిల్లాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు అవకాశం

15-04-202015-04-2020 11:05:15 IST
Updated On 17-04-2020 16:14:44 ISTUpdated On 17-04-20202020-04-15T05:35:15.488Z15-04-2020 2020-04-15T05:35:13.420Z - 2020-04-17T10:44:44.088Z - 17-04-2020

తెలంగాణలో 11 జిల్లాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు అవకాశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ తీవ్రత లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి కొన్ని అవసరమైన కార్యకలాపాలను షరతులతో, కఠిన నిబంధనలతో అనుమతిస్తామని ప్రధాని సోమవారం చేసిన ప్రకటన అమలైతే తెలంగాణ అత్యధికంగా ప్రయోజనం పొందే రాష్ట్రం కానుంది. ప్రధాని పేర్కొన్న షరతులను బేరీజు చేసి చూస్తే తెలంగాణలో 11 జిల్లాలు లాక్ డౌన్ నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుందని అంచనా. ఈ పదకొండింటిలోనూ ఐదు జిల్లాలో ఒక్క కోవిడ్-19 పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు కాబట్టి ఈ జిల్లాలను 20వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ నుంచి మినహాయిస్తారని అధికారులు, స్థానికులు భావిస్తున్నారు. 

నారాయణ పేట, వనపర్తి, వరంగల్‌ రూరల్‌, మంచిర్యాల, యాదాద్రి జిల్లాల్లో ఒక్క కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ, లాక్‌డౌన్‌లో భాగంగా ఈ జిల్లాల్లో కూడా కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం.. ప్రధాని పేర్కొన్న 20వ తేదీ గడువు మరో ఐదు రోజుల్లో పూర్తికానుండడంతో ఈ జిల్లాలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయిస్తారని అధికారులు, స్థానికులు భావిస్తున్నారు. 

ఐదు జిల్లాల్లో ఒక్క కేసూ లేకపోగా.. మరో ఆరు జిల్లాల్లో చాలా తక్కువగా కేసులు నమోదయ్యాయి. అవి కూడా తగ్గుముఖం పట్టే దశలో ఉన్నాయి. ఉదాహరణకు.. జనగాంలో ఒకటి, రెండు కేసులు నమోదైనా వైరస్‌ సోకినవారు ఆస్పత్రుల్లో చికిత్స పొంది, పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఆ తర్వాత ఆ జిల్లాలో కొత్త కేసులు నమోదు కావట్లేదు. చాలా మంది క్వారంటైన్‌ సమయం పూర్తయింది. అలాగే.. మహబూబాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు ఉంది.  ములుగు, నాగర్‌కర్నూలు, జగిత్యాల జిల్లాల్లో ప్రస్తుతం రెండేసి కేసులు ఉన్నాయి. 

అవన్నీ కూడా మార్చిలో నమోదైన కేసులే. ఈ ఐదు జిల్లాల్లో ఏప్రిల్‌లో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అంటే.. ఈ జిల్లాల్లో కరోనా వైరస్‌ ప్రభావం ప్రస్తుతానికి లేనట్టుగానే భావించవచ్చు. దీంతో, ఈ 11 జిల్లాలను మినహాయింపు పరిధిలో చేర్చడానికి వీలుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

ఒకవేళ, ఏప్రిల్‌ 20 తర్వాత ఈ 11 జిల్లాలకు మినహాయింపునిచ్చినా.. కార్యకలాపాలను జిల్లా పరిధి వరకే పరిమితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో.. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. మినహాయింపు ప్రకటించేటప్పుడు ఇలాంటివాటన్నింటినీ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటారని.. అందులో భాగంగా ఆయా జిల్లాల్లోకి రాకపోకలను కట్టడి చేసే అవకాశం ఉందని అంచనా. 

దీని వల్ల.. ఆయా జిల్లాల వారు బయటకు వెళ్లడానికి, ఇతరులు లోపలికి రావడానికి అవకాశం ఉండదు. వైరస్‌ ముప్పు తగ్గుతుంది. అదే సమయంలో జిల్లాలో అంతర్గతంగా ఆర్థిక కార్యకలాపాలు, వ్యవసాయ పనులు పూర్తిస్థాయిలో ఊపందుకోవడానికి అవకాశం ఉంటుంది. జిల్లా పరిధిలో ఉండే చిన్న చిన్న ఫ్యాక్టరీలు, ఇతర వ్యాపారాలు కూడా తిరిగి ప్రారంభమయ్యి.. ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ విషయానికొస్తే.. నగరంలో మొత్తం ముప్పై సర్కిళ్లు ఉండగా అందులో ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ సర్కిళ్లలో మాత్రమే కరోనా కేసులు నమోదు కాలేదు. మిగతా 28 సర్కిళ్లలోనూ కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులున్నాయి. చుట్టూ అన్ని సర్కిళ్లలో వైరస్‌ సోకినవారు ఉన్న నేపథ్యంలో.. ఈ రెండు సర్కిళ్లకు మాత్రమే మినహాయింపు ప్రకటించకపోవచ్చు. ఒకవేళ ప్రకటించినా.. రాకపోకలను నియంత్రించడం చాలా కష్టమే. కాగా..  తెలంగాణలో లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 30 దాకా పొడిగించిన సంగతి తెలిసిందే. 

లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా వ్యాపార కార్యక్రమాలు నిలిచిపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. వ్యవసాయ, ఔషధ రంగాలు మినహా మరే రంగానికీ మినహాయింపులు లేకపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం గణనీయంగా పడిపోయింది. అత్యవసర పనుల కోసం కూడా నిధులు లేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మరికొన్ని రంగాలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు, నిర్మాణ రంగాలకు వెసులుబాటు కల్పించవచ్చని సమాచారం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle