newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో స్పీడ్ తగ్గని కరోనా...1873 పాజిటివ్ కేసులు

31-08-202031-08-2020 10:03:36 IST
Updated On 31-08-2020 11:20:39 ISTUpdated On 31-08-20202020-08-31T04:33:36.443Z31-08-2020 2020-08-31T04:33:21.800Z - 2020-08-31T05:50:39.200Z - 31-08-2020

తెలంగాణలో స్పీడ్ తగ్గని కరోనా...1873 పాజిటివ్ కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా ఆగడం లేదు. కొత్తగా 1873 కరోనా పాజిటివ్ కేసులు... 9 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,24,963. మరణాల సంఖ్య 827. యాక్టివ్ కేసులు 31,299. డిశ్చార్జ్ అయినవారు 92,837 గా వున్నారు. గత మూడు, నాలుగు రోజుల నుంచి నిత్యం రెండు వేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్కోసారి తీవ్రత పెరుగుతూనే వుంది.  యాక్టివ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం కాసింత ఊరట నిస్తోంది

31 వేలమందికి పైగా కరోనా పేషెంట్లు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ సంఖ్య 31 వేలకు చేరుకోవడం.. కరోనా కేసుల పెరుగుదలలో కనిపించిన వేగాన్ని స్పష్టం చేస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల దూకుడు కొనసాగుతోంది. తాజాగా 360 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 1849 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 92,837.

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 31,299. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 76.55 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 73.3 శాతం అని తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా కోవిడ్‌ మరణాల రేటు 1.78 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.66 శాతంగా ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 37,791 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇప్పటివరకు 13,65,582 నమూనాలు పరీక్షించామని బులెటిన్‌లో తెలిపింది. 

కరీంనగర్ లో 180, ఖమ్మంలో 103, రంగారెడ్డిలో 129, సూర్యాపేటలో 65 కేసులు, వరంగల్ అర్బన్ లో 94, భువనగిరిలో 21 కేసులు,మహబూబ్ నగర్ లో 40 కేసులు, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 41 కేసులు నమోదయ్యాయి. కరోనా భయాన్ని జిల్లాల్లోని ప్రైవేటు ఆస్పత్రులు సొమ్ముచేసుకుంటున్నాయి. తామూ చికిత్స చేస్తామంటూ వేలకు వేలు గుంజుతున్నాయి. కరోనా చికిత్స చేసేందుకు జిల్లా కేంద్రంలోని ఒక్క ప్రైవేటు ఆస్పత్రికి మాత్రమే అనుమతి ఉండగా..మరో 10 ఆస్పత్రుల్లో అనధికారికంగా కోవిడ్‌కు చికిత్స అందిస్తున్నారు. 

వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటిజెన్‌ రాపిడ్‌ టెస్టుల ద్వారా కరోనా పరీక్షలు చేసుకుని, చికిత్స కోసం అధికారికంగా సెలవులు తీసుకుంటున్నారు. ఇక వ్యాపారస్తులు, ఇతరులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి, గంటల తరబడి క్యూలో నిలబడి, కోవిడ్‌ పరీక్షలు చేసుకునే ఓపిక లేని వారు, పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచాలనుకునే వారు ప్రైవేటుకు వెళ్తున్నారు. అయితే ప్రైవేటు ఆస్పత్రికి వెళితే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని అనేకమంది విషయంలో నిజం అవుతున్నా కొందరు ఆ ధోరణిలోనే వున్నారు. మంత్రి ఈటల కూడా ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలని పిలుపునిస్తున్నారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle