newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్ ...తేదీపై గందరగోళం

17-08-202017-08-2020 11:44:38 IST
2020-08-17T06:14:38.263Z17-08-2020 2020-08-17T06:12:55.674Z - - 10-04-2021

తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్ ...తేదీపై గందరగోళం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో స్కూల్స్ రీ ఓపెన్ విషయంలో గందరగోళం నెలకొంది. విద్యార్థులు స్కూళ్లకు రాకపోయినా ప్రభుత్వ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం ఈరోజు నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాల్సి ఉంది. 

నేటి నుండి టీచర్లు స్కూల్స్ కు వెళ్లాల్సి ఉండగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నుండి ఇప్పటివరకు జిల్లా అధికారులకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో టీచర్లు స్కూల్ కి వెళ్లాలా? లేదా? అన్న అంశంపై గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో డిజిటల్ తరగతుల నిర్వహణ కూడా పోస్ట్ పోన్ అయింది. స్కూల్స్ పునఃప్రారంభం విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయడమే ఇప్పటివరకు స్కూల్స్ రీ ఓపెన్ విషయంలో ఉత్తర్వులు రాకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నెలాఖరు దాకా విద్యాసంస్థలు ఏవీ తెరవద్దని, క్లాసులు నిర్వహించకుండా స్కూళ్లను తెరిస్తే కేంద్ర మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు అవుతుందని సీఎస్ ఉన్నతాధికారులతో చెప్పినట్లుగా సమాచారం.ఇటీవల విద్యా శాఖ సమీక్ష సమావేశంలో ఈనెల 17వ తేదీ నుండి విద్యార్థులు రాకున్నా,టీచర్లు స్కూల్ కి వెళ్లాలని, 20వ తేదీ నుండి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. 

ఈ నెల 11వ తేదీన అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దూరదర్శన్, టీ శాట్ ఛానళ్లలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ డిజిటల్ తరగతుల నిర్వహణ కూడా వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె పేర్కొన్నారు.త్వరలోనే డిజిటల్ తరగతులకు సంబంధించిన తేదీలను మరోమారు ప్రకటిస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. మరోమారు ఈ విషయంపై సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు.

నేటి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిజిటల్ తరగతులు, 20వ తేదీ నుండి స్కూల్ విద్యార్థులకు ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు డిజిటల్ తరగతులు , సెప్టెంబర్ 1 నుండి 3 నుండి 5 తరగతుల వారికి డిజిటల్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహించాల్సిన డిజిటల్ తరగతులు తాజాగా విపరీతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వాయిదా పడినట్లు తెలుస్తోంది.

మరోపక్క స్కూల్ రీఓపెనింగ్ విషయంలో కూడా క్లారిటీ లేకపోవడంతో టీచర్లు గందరగోళానికి గురవుతున్నారు.స్కూల్స్ పునః ప్రారంభించాల్సిన నేపథ్యంలో సగం మంది టీచర్లు స్కూల్స్ కి రావాలని సూచించారు. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి త్వరలో ఉత్తర్వులు వస్తాయని, టీచర్లందరినీ అలర్ట్ చేయాలని సూచించారు. 

డిఈవోలు హెడ్మాస్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి టీచర్లు స్కూల్స్ కి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొన్ని చోట్ల ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తాజాగా ప్రభుత్వం ఈ విషయంపై మరో మారు క్లారిటీ ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏది ఏమైనా తాజా పరిస్థితుల నేపథ్యంలో అటు స్కూల్స్, ఇటు డిజిటల్ తరగతులు రెండు వాయిదా పడినట్లుగానే తెలుస్తుంది.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   3 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle