తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!
27-05-202027-05-2020 06:35:15 IST
Updated On 27-05-2020 09:29:09 ISTUpdated On 27-05-20202020-05-27T01:05:15.214Z27-05-2020 2020-05-27T01:05:12.402Z - 2020-05-27T03:59:09.711Z - 27-05-2020

తెలంగాణలో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. ఆ మధ్యనే కాస్త కేసులు తగ్గినట్లు కనిపించినా మళ్ళీ ఇప్పుడు భారీగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 38, రంగారెడ్డి 7, మేడ్చల్ 6 కొత్త కేసులో నమోదు కాగా, మరో 12 మంది వలస కూలీలకు కరోనా సోకింది. విదేశాల నుంచి వారిలో నలుగురికి పాజిటివ్ రాగా, సూర్యాపేట, వికారాబాద్, నల్లగొండ, నారాయణ్ పేట్ జిల్లాల్లో ఒకే కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1991కి చేరింది. కరోనా కారణంగా మంగళవారం రాష్ట్రంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య 57కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 120 మంది కరోనాను జయించి ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లడం చెప్పుకోదగ్గ విషయం. కాగా, రాష్ట్రంలో కొవిడ్ టెస్టుల సంఖ్య చాలా స్వల్పంగా ఉందని ఎప్పటి నుండో వినిపిస్తున్న వాదన. ఒకపక్క వైద్య నిపుణులు, మేధావులు, ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ విషయంపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. చివరికి హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పటికే ఒకేసారి హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. కానీ ప్రభుత్వం మాత్రం టెస్టుల సంఖ్య పెంచినట్లుగా కనిపించడం లేదు. మరోవైపు మంగళవారం హైకోర్టు మరోసారి రాష్ట్రంలో టెస్టుల సంఖ్యపై విచారణ చేపట్టింది. ఈక్రమంలోనే రాష్ట్రంలో చేస్తున్న కొవిడ్ పరీక్షలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సైతం హైకోర్టు కొట్టేసింది. అసలు తెలంగాణలో టెస్టులు భారీ స్థాయిలో ఎందుకు చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలని ఆదేశించింది. కరోనా లక్షణాలు లేకపోయినా వివిధ అనారోగ్య కారణాలతో హైరిస్క్ ఉన్న వారికి సైతం ఎందుకు పరీక్షలు చేయడం లేదన్నది ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని కోరింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకి వలస వచ్చినవారిలో ఎంతమందికి కరోనా పరీక్షలు చేశారో కోర్టుకు వెంటనే తెలియజేయాలని సూచించింది. మార్చి 11 నుంచి ఇప్పటివరకు చేసిన టెస్టుల వివరాలను జూన్ 4 లోగా కోర్టుకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరీక్షలపై కేంద్రం రెండు సార్లు రాసిన లేఖలు సమర్పించాలని, కరోనా రక్షణ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో ఎంత మంది వైద్య సిబ్బందికి ఇచ్చారో తెలపాలని, వివిధ ఆస్పత్రుల్లో మరణించిన వారి మృతదేహాలకూ కరోనా పరీక్షలు జరపాలని కోర్టు ఆదేశించింది. మొత్తంగా ప్రభుత్వాన్ని కరోనా టెస్టుల విషయంలో తీవ్రంగా తప్పుబట్టింది. అయితే, ప్రభుత్వం ఇంత తక్కువగా టెస్టులు చేస్తున్నా కేసుల సంఖ్య భారీగా నమోదవడం రాష్ట్ర ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఇతర రాష్టాల మాదిరిగా తెలంగాణలో కూడా భారీగా టెస్టులు నిర్వహిస్తే కేసుల సంఖ్య ఇంకా భారీగా నమోదయ్యే అవకాశాలు ఉండేదని.. కానీ ఇప్పుడు ఇలా వైరస్ చాపకింద నీరులా వ్యాపించేస్తుందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మరి ప్రభుత్వం హైకోర్టుకు ఏమని సమాధానం ఇస్తుందో.. ఇక ఇప్పటికైనా మేల్కొని పరీక్షల సంఖ్య పెంచుతుందా అన్నది చూడాల్సి ఉంది.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
14 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
21-04-2021

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా