newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో వైన్ సేల్స్ ఫైన్... బీరు అమ్మకాలు డౌన్

08-08-202008-08-2020 08:47:14 IST
Updated On 08-08-2020 08:50:00 ISTUpdated On 08-08-20202020-08-08T03:17:14.145Z08-08-2020 2020-08-08T03:16:58.594Z - 2020-08-08T03:20:00.579Z - 08-08-2020

తెలంగాణలో వైన్ సేల్స్ ఫైన్... బీరు అమ్మకాలు డౌన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో లిక్కర్, బీరు అమ్మకాల్లో తీవ్రమైన వ్యత్యాసం నెలకొంటోంది. వీటిలో బీరు అమ్మకాలు విపరీతంగా పడిపోగా, మద్యం విక్రయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. 

బీరు అమ్మకాల వల్ల తగ్గిన ఆదాయం లిక్కర్ విక్రయాలతో కవర్ అవుతోంది. ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటంటే లాక్ డౌన్‌ సమయంలో బీరు విక్రయాలు పడిపోయినా ఆదాయం విషయంలో మాత్రం గతేడాది కంటే అధికంగా సమకూరింది.2019 జులై నెల కంటే ఈ సారి జులై నెలలో మద్యం అమ్మకాల వల్ల రూ.600 కోట్లు అదనంగా రాష్ట్ర ఖజనాకు చేరినట్లుగా అబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఏపీ సరిహద్దు జిల్లాల్లో మద్యానికి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది.

ఏపీతో సరిహద్దు పంచుకుంటున్న ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లోని మద్యం దుకాణాలకు మరింతగా ఆదాయం సమకూరుతోంది.కరోనా వల్ల విధించాల్సి వచ్చిన లాక్ డౌన్ ప్రభావంతో దేశ వ్యాప్తంగానే కాక, రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు కుంటుపడ్డాయి.ఎక్కువ శాతం వ్యాపార సంస్థలకు రాబడి పూర్తిగా తగ్గిపోవడంతో ఖర్చులు తగ్గించుకొనే చర్యలు చేపట్టాయి. దీంతో భారీగా ఉద్యోగాలకు కోత ఏర్పడింది. 

ఫలితంగా మధ్య, పేద తరగతుల వారికి సగటు ఆదాయం గణనీయంగా తగ్గింది. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ తరుణంలోనూ తెలంగాణలో మద్యం ప్రియులు తాగుడుకు చేస్తున్న ఖర్చు మానలేదు. ఒక్క జులైలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రూ.2,507కోట్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాది జులై నెలలో మద్యం అమ్మకాలతో పోలిస్తే రూ.600 కోట్ల విలువైన అమ్మకాలు ఎక్కువగా జరిగాయని అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో ఎక్కువగా హైదరాబాద్‌లో బీర్ల అమ్మకాలు ఎక్కువగా తగ్గినట్లు అబ్కారీ అధికారులు అంచనా వేశారు. బీర్ల విక్రయాలు తగ్గడానికి కారణాలను విశ్లేషించారు. సాధారణంగా పుట్టిన రోజు లాంటి ఫంక్షన్లకు ఇళ్లలో మద్యం పార్టీలు ఇవ్వడం చాలా చోట్ల పరిపాటిగా వస్తోంది. 

మాంసాహారంతో విందు ఉండే ప్రతిచోట మద్యం ఉంచుతుంటారు. అయితే, ప్రస్తుతం కొవిడ్‌ నిబంధనల కారణంగా ప్రజలు విందులు, వినోదాలకు చాలా దూరంగా ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా విందులు చేసుకోవాలన్నా అవి కేవలం కుటుంబానికే పరిమితమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం వినియోగం బాగా తగ్గింది. దీంతో నలుగురు ఒకేచోట కూర్చొని తాగే అవకాశం లేకుండా పోయింది.

అంతేకాక, చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తుండడం.. ఆయా కారణాల వల్ల బీరు అమ్మకాలు భారీగా తగ్గాయని ఆబ్కారీ శాఖ అంచనాకు వచ్చింది. గత ఏడాది జులైలో 31.48 లక్షల కేసుల లిక్కర్‌, 41.7లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. జులైలో 31.34 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకాలు జరగ్గా, బీరు అమ్మకాలు 22.99 లక్షల పెట్టెలు జరిగాయి. లిక్కర్‌ అమ్మకాలు దాదాపుగా ఒకే రకంగా ఉన్నా బీరు అమ్మకాలు సగానికి తగ్గిపోయాయి.



      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle