newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలు

15-08-202015-08-2020 18:51:45 IST
Updated On 15-08-2020 18:54:19 ISTUpdated On 15-08-20202020-08-15T13:21:45.731Z15-08-2020 2020-08-15T13:21:04.036Z - 2020-08-15T13:24:19.732Z - 15-08-2020

తెలంగాణలో వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణలో ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని అమరవీరుల సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. అనంతరం ప్రగతిభవన్‌కు చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Imageఅంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారి చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులున్నారు.

ఆయా జిల్లాల్లో మంత్రులు జెండావిష్కరణ చేసి ప్రసంగించగా, వివిధ శాఖల అధికారులు, పోలీస్‌ సిబ్బంది హాజరయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా తక్కువ మంది అతిథులు ఈ వేడుకలకు హాజరు కాగా, వర్షం కారణంగా వేడకలు ఆలస్యంగా ముగిశాయి. సంగారెడ్డి కలెక్టరేట్‌లో హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. వరంగల్‌ కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జెండా ఆవిష్కరించి వందనం చేశారు.సూర్యాపేట కలెక్టరేట్‌ కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ రాష్ట్ర, దేశ పౌరులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 

తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యాలయ ఆవరణలో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జెండా ఆవిష్కరించారు. మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ జెండా ఎగుర వేసి వందనం చేశారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ జెండా ఆవిష్కరించగా, నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో హాజరై జెండా ఎగురవేశారు. 

రాష్ర్ట రాజ‌ధాని హైదరాబాద్ లోని మూడు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలోని ఆయా ప్ర‌ధాన కార్యాల‌యాల్లో వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. పేట్ల బురుజ్‌లోని సిటి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార్ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. సైబ‌రాబాద్‌లో డీసీపీ సి. అన‌సూయ(ఉమెన్ అండ్ చిల్డ్ర‌న్ సేఫ్టీ వింగ్‌) క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో జాతీయ‌జెండాను ఎగుర‌వేశారు.రాచ‌కొండ క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ నేరేడ్‌మెట్‌లోని క‌మిష‌న‌రేట్ భ‌వ‌నంలో జెండాను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్‌ సుధీర్‌బాబు, అడిష‌న‌ల్ డీసీపీ శిల్ప‌వ‌లి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   25 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   18 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle