newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో వర్షాలు.. శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరుగులు

25-07-202025-07-2020 11:16:05 IST
2020-07-25T05:46:05.107Z25-07-2020 2020-07-25T05:43:06.294Z - - 15-04-2021

తెలంగాణలో వర్షాలు.. శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరుగులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శ్రీశైలం జలాశయానికి జులై 15 నుంచి ప్రారంభమైన వరద కొనసాగుతోంది. వరద వచ్చే సమయానికి 811 అడుగుల స్థాయిలో 38 టీఎంసీల నీరు ఉండగా.. ప్రస్తుతం అది 81 టీఎంసీలకు చేరింది. పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగడంతో ఇది శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. 

శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 850 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. శుక్రవారం సాయంత్రానికి 80.90 టీఎంసీలుగా నమోదయ్యింది. ఎగువ నుంచి జూరాలకు 60 వేల క్యూసెక్కులు ప్రవాహం వస్తుండగా, గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కులు, విద్యుత్తు ఉత్పత్తి ద్వారా 35 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల జలాశయం నుంచి 11 వేలు, హంద్రీ నది నుంచి 5 వేలు, ఇతరత్రా కలిపి మొత్తంగా 75 వేల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. ఎడమ గట్టు విద్యుత్తు ఉత్పత్తి యూనిట్ నుంచి 38,140 క్యూసెక్కులు నాగార్జుసాగర్‌లోకి వదులుతున్నారు.ఆలమట్టి, నారాయణపూర్‌ జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహం తగ్గింది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత వరదతో కలిపి గోదావరిలో 7.81 మీటర్ల మేర నీటిమట్టం నమోదవుతుండగా 1.60 లక్షల క్యూసెక్కులు లక్ష్మీ బ్యారేజీకి చేరుతోంది. 

బ్యారేజీ 63 గేట్లు ఎత్తి 1,27,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నామని’ అధికారులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రానికి బ్యారేజీలో నీటి నిల్వ 12.79 టీఎంసీలకు చేరినట్టు చెప్పారు.తెలంగాణలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 

అత్యధికంగా జగ్గాసాగర్‌ (మెట్‌పల్లి)లో 10.1, కోరుట్లలో 9.1, బచ్చోడు (ఖమ్మం)- 8.9, సిరిసినగండ్ల (నాగర్‌కర్నూలు)-7.9, నల్గొండలో 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రోజుల్లో కర్నాటక, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు పడితే శ్రీశైలం జలాశయం మరింతగా నిండుతుందని జలవనరుల శాఖ అధికారులు అంటున్నారు. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle