newssting
BITING NEWS :
ఎన్డీయేతో బంధం తెంచుకున్న అకాలీదళ్. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ నిర్ణయం. ఈ బిల్లుల ప్రభావం రైతులు, దళితులు, రైతు కూలీల అందరిపై పడిందని తెలిపిన అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటన. శనివారం పార్టీ నిర్వహించిన మూడు గంటల ఎమర్జెన్సీ కోర్ కమిటీ సమావేశం అనంతరం నిర్ణయం. 23 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెగతెంపులు చేసుకున్న అకాలీదళ్ * బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌పై కర్ణాటకలోని తుమకూరు కోర్టులో కేసు దాఖలు. కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేయడాన్ని తప్పుబడుతూ తుమకూరు జేఎంఎఫ్సీ కోర్టులో రమేశ్‌ నాయక్‌ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు * అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎల్‌యూ వైస్‌ చాన్సలర్‌గా వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ పి.శ్రీకృష్ణదేవరావు నియామకం. ప్రస్తుత వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయడంతో శ్రీకృష్ణదేవరావు నియామకం. దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీకృష్ణదేవరావు న్యాయ విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు యూజీసీ నియమించిన నిపుణుల కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా కూడా పనిచేశారు * శివసేన నేత, లోక్ సభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఓ స్టార్ హోటల్ లో రహస్యంగా భేటీ అయినట్టు గుప్పుమన్న వార్తలు. ఓ లగ్జరీ హోటల్‌ లో సుమారు గంటన్నర పాటు వీరిమధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ సమావేశం వార్తలు. ఈ సమావేశం నిజమేనని, దీని వెనుక రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేసిన బీజేపీ * అమెరికాలోని హిందూఆధ్యాత్మిక గురువు స్వామి ప్రత్యాగ్‌బోధానంద కన్నుమూత. పెన్సిల్వేనియాలో అర్ష విద్యా గురుకులానికి ఉపాధ్యక్షులుగా ఉన్న ప్రత్యాగ్‌బోధానంద వయసు 69 సంవత్సరాలు. గురుకులం 34వ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈనెల 20తేదీన తుదిశ్వాస విడిచినట్టు తెలిపిన ఆయన శిష్యులు. ప్రత్యాగ్‌బోధానంద పార్థివదేహాన్ని భారత్‌కు తరలింపుకు ప్రయత్నాలు * పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో కొనసాగుతున్న రైల్‌ రోకో ఆందోళన. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిర్వహిస్తున్న రైల్‌ రోకో. తొలుత కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత మద్దతు ప్రకటించిన వివిధ సంఘాలు * బాలీవుడ్‌ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం. దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఎదుట శనివారం హాజరు. వేర్వేరుగా ఐదు గంటలకు పైగా కొనసాగిన విచారణ. నటీమణుల వాగ్మూలాన్ని రికార్డు చేసిన ఎన్సీబీ * ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రలలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అక్కడక్కడా నిలిచిన రాకపోకలు. పలుచోట్ల నీటమునిగిన పంట పొలాలు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగామలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు * అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పరిస్థితులను గాడిలో పెట్టేందుకు అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్ల తెరిచేందుకు అనుమతినిస్తున్నామని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షోలు నిర్వహించేందుకు కూడా అనుమతినిస్తున్నామని ట్వీట్ * నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన రౌడీషీటర్ దారుణ హత్య మరువక ముందే చోటు చేసుకున్న మరో ఘటన. చిల్లకూరు మండలం కలవకకొండలో చేజర్ల సుబ్రహ్మణ్యం(38) అనే వ్యక్తి దారుణ హత్య. ఆదివారం ఉదయం అతి కిరాతకంగా చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు * సంగారెడ్డిలో వాగు దాటుతున్న వ్యక్తి వరద నీటిలో గల్లంతు. భారీ వర్షాలకు వాగు దాటుతున్న ముగ్గరు వ్యక్తులు గల్లంతవ్వగా ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు చేర్చిన స్థానికులు. కంగ్టి మండలం జంగి బికి చెందిన 55 ఏళ్ల మంగలి మారుతి కాకి వాగు వరద ఉధృతిలో గల్లంతు. మారుతి ఆచూకీ కోసం మండల రెవెన్యూ అధికారుల గాలింపు చర్యలు.

తెలంగాణలో లిక్కర్ అమ్మకాలపై కీలక నిర్ణయం... 29వరకూ లాక్ డౌన్

05-05-202005-05-2020 21:29:50 IST
Updated On 06-05-2020 09:15:16 ISTUpdated On 06-05-20202020-05-05T15:59:50.676Z05-05-2020 2020-05-05T12:24:58.763Z - 2020-05-06T03:45:16.537Z - 06-05-2020

తెలంగాణలో లిక్కర్ అమ్మకాలపై కీలక నిర్ణయం... 29వరకూ లాక్ డౌన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఈనెల 7వ తేదీవరకూ వున్న లాక్ డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీయార్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లాక్ డౌన్ ఈనెలాఖరు వరకూ పొడిగించనున్నారు.నాలుగు జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాల్లో కొన్ని సడలింపులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడుగంటల పాటు కేబినెట్ భేటీ జరిగింది. ఈమధ్యకాలంలో ఇంత సేపు కేబినెట్ భేటీ జరగలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 29 వరకూ లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయించారు. 

లిక్కర్ షాపులు ఆరవ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. మద్యం షాపులు తెరుస్తాం. 15 షాపులు కంటైన్మెంట్ జోన్లలో తెరవం. బార్లు, పబ్ లు తెరవడానికి కుదరదు. శ్లాబ్ పెంచుతాం. మద్యం ధరలు 16 శాతం పెంచుతాం. రెడ్ జోన్స్ లో 15 షాపుల మినహా వైన్స్ షాప్స్ ఓపెన్ చేస్తాం. ఉదయం 10 గంటలకు ప్రారంభం. భౌతిక దూరం పాటించాలి. గంటలోపలే మూసేస్తాం. నో మాస్క్... నో లిక్కర్. 

కరోనా పాజిటివ్ కేసులు 1096, 11 కొత్త కేసులు, 439 ట్రీట్మెంట్ లో వున్నారని సీఎం కేసీయార్ చెప్పారు. 628మంది డిశ్చార్జ్ చేశారు. కరీంనగర్ లో కంటైన్మెంట్ జోన్ ప్రారంభించాం. దేశంలో మొదటిది ఇదే. కరీంనగర్ విషయంలో మనం దేశానికి ఆదర్శం అయ్యామన్నారు. పకడ్బందీ చర్యలు చేపట్టాం. 3.37 మరణాల రేటు 2.64 రేటులో వున్నాం. కరీంనగర్లో ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకున్నామన్నారు. అందుకు కారణం అయిన అధికారులను, మంత్రులను కేసీయార్ అభినందించారు. 

కరోనా వైరస్ కారణంగా ఖజానాలు ఖాళీ అయ్యాయి. రెండవ విడత లాక్ డౌన్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. వలస కార్మికులు,హాస్టల్ విద్యార్ధుల విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. గత రెండునెలలుగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే హైదరాబాద్ మహానగరం ఆదాయం లేక వెలవెలబోతోంది. ఒకవైపు కరోనా కేసులు, లాక్ డౌన్ నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే మద్యం, రోడ్ టాక్స్, పెట్రో అమ్మకాలను అనుమతించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొమ్మిది జిల్లాలు గ్రీన్ జోన్ లోనూ, మరో 18 జిల్లాలు ఆరెంజ్ జోన్ లోనూ ఉన్నందున ఆయా జిల్లాల్లో మామూలు కార్యకలాపాలు జరిగేలా మే 7వ తేదీ నుంచి ఆంక్షలను సడలించడమే మంచిదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది.

సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలను పాటిస్తూ.. మద్యం అమ్మకాలు సాగించేందుకే సర్కారు అవకాశం ఇవ్వనుంది పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల్లో మద్యం విక్రయాలు సాగుతున్నందున.. రాష్ట్రంలోనూ మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వొచ్చని అంటున్నారు. అయితే రేట్లు భారీగా పెంచి అమ్మవచ్చని అంటున్నారు. తక్కువలో తక్కువ పాతిక శాతం అయినా రేట్లు పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అమ్మకాలు మొదలు పెట్టని పక్షంలో పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాఃణలోకి అక్రమంగా మద్యం స్మగ్లింగ్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.అంతేకాక మందు కోసమే ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు మందుబాబులు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలా చేయడం కంటే మందు షాపులు తెరవడమే మంచిదని కేసీయార్ భావించారు. 

జినోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ సంస్థ ప్రతినిధులతో మాట్లాడానన్నారు. శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి ఆగస్టులోనే వ్యాక్సిన్ రావచ్చని చెప్పారన్నారు. తెలంగాణ నుంచే వ్యాక్సిన్ వస్తే ఆ ఘనత మనకే దక్కుతుందన్నారు. స్వీయ నియంత్రణ పాటించాలి. అమెరికాలో మరణాలు పెరిగిపోయాయి. తక్కువ నష్టంతో లాక్ డౌన్, భౌతిక దూరం పాటిస్తున్నామన్నారు. షుగర్, గుండెజబ్బులున్నవారికి కోటి మాస్కులు, 3 నెలల పాటు మందులు ప్రభుత్వమే సమకూరుస్తున్నామన్నారు. ఆరు జిల్లాలు రెడ్ జోన్, 9 గ్రీన్ జోన్లు, 18 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో వున్నాయి. 

కేంద్రం సడలింపులు వుంటాయి. మరికొన్ని జిల్లాలు గ్రీన్ జోన్ లోకి పోతాయి. 35 కంటైన్మెంట్ వున్నాయి. 19 హైదరాబాద్ లోనే వున్నాయి. కేసులు హైదరాబాద్ లోనే వున్నాయని,మనం చాలా కఠినంగా వ్యవహరించాలన్నారు. హైదరాబాద్ సేఫ్ కాపాడుకోవాలి. అత్యధిక జనసాంద్రత ఉండడం వల్లే ఎక్కువ కేసులు వస్తున్నాయి. రాత్రి కర్ఫ్యూ వుంటుంది. రాత్రి 6 గంటల వరకే పనులు ముగించుకోవాలి. ముంబై పరిస్థితి రావద్దు. 

ఎలక్ట్రికల్, హార్డ్ వేర్, సిమెంట్, స్టీల్స్, వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, భవన నిర్మాణాలు అనుమతిస్తారు. మే 15 వరకూ రెడ్ జోన్లలో ఏవీ ఓపెన్ చేయం. మే15 సమీక్ష చేస్తాను. గ్రీన్, ఆరెంజ్ జోన్ సడలింపులు ఇస్తున్నాం. గ్రామాల్లో అన్ని షాపులు తెరుస్తాం. మునిసిపల్ ఏరియాల్లో 50 శాతం షాపులు తెరవాలి. 10 గంటలనుంచి 6 గంటల వరకూ పనిచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి 6 గంటల వరకూ కర్ఫ్యూ వుంటుంది. స్టాంప్స్ శాఖ వందశాతం పనిచేస్తుంది. కరోనా నిబంధనలు పాటించాలి. రిజిస్ట్రేషన్లు, ఇసుక మైనింగ్, ఆర్టీయే ఆఫీసులు పనిచేస్తాయి.

పదవ తరగతి పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తాం. 2500 సెంటర్లను పెంచుతాం. పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేస్తాం. కోర్టులో పర్మిషన్ ఇస్తుంది. పిల్లలు టెన్షన్లో వున్నారు. ఆర్టీసీ బస్సులు నడుపుతాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తాం. ఇంటర్ పరీక్షల స్పాట్ వ్యాల్యూయేషన్ మే 6వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. మే నెలాఖరు వరకూ పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు సీఎం కేసీయార్. యువన్యాయవాదులకు రూ.22 కోట్లు మంజూరు చేశాం. 15 కోట్లు విడుదలచేశాం. అవసరమయినవారికి సాయం చేస్తాం. వలసకూలీలు మా బిడ్డలే. ఆదుకుంటామన్నారు. 7.50లక్షలమందికి సాయం చేశాం. ఇంకా చేస్తామన్నారు.

చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు..  కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు.. కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

   12 hours ago


గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

   13 hours ago


ఏపీకి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాలో కొత్త పుంత‌లు

ఏపీకి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాలో కొత్త పుంత‌లు

   14 hours ago


యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన 'రవికిషన్'

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన 'రవికిషన్'

   14 hours ago


బీజేపీలో పురందేశ్వ‌రికి కీల‌క ప‌ద‌వి... సామాజిక స‌మీక‌ర‌ణే ఎజెండా

బీజేపీలో పురందేశ్వ‌రికి కీల‌క ప‌ద‌వి... సామాజిక స‌మీక‌ర‌ణే ఎజెండా

   15 hours ago


అంబటి భూకబ్జా లీకులు.. సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా?

అంబటి భూకబ్జా లీకులు.. సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా?

   15 hours ago


ఎన్‌డీఏకు అకాలీదళ్‌ గుడ్‌బై.. రైతు వ్యతిరేక బిల్లులపై విభేదం

ఎన్‌డీఏకు అకాలీదళ్‌ గుడ్‌బై.. రైతు వ్యతిరేక బిల్లులపై విభేదం

   16 hours ago


డీకే అరుణకి జాతీయ పదవి.. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్?

డీకే అరుణకి జాతీయ పదవి.. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్?

   16 hours ago


ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పంటనష్టం

ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పంటనష్టం

   18 hours ago


తెలంగాణలో ఆడపిల్లను లక్ష్మిలా కొలుస్తున్నారు.. మంత్రి హరీష్ రావు

తెలంగాణలో ఆడపిల్లను లక్ష్మిలా కొలుస్తున్నారు.. మంత్రి హరీష్ రావు

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle