newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో లాక్ డౌన్.. పట్టించుకోని జనం

23-03-202023-03-2020 11:44:07 IST
Updated On 23-03-2020 11:44:18 ISTUpdated On 23-03-20202020-03-23T06:14:07.386Z23-03-2020 2020-03-23T06:13:40.955Z - 2020-03-23T06:14:18.652Z - 23-03-2020

తెలంగాణలో లాక్ డౌన్.. పట్టించుకోని జనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈనెలాఖరు వరకూ లాక్ డౌన్ ప్రకటించింది. అంటు వ్యాధుల చట్టం-1897 లోని సెక్షన్‌ 2,3,4 ప్రకారం..  కరోనా (కోవిడ్‌-19)  వ్యాధి నియంత్రణ, నివారణకు కఠినమైన నిబంధనలు అమలు చేస్తారు. గాలి ద్వారా, లేదా మనిషి నుంచి మనిషికి వ్యాధి సోకకుండా నియంత్రించేందుకు అత్యవసరం మినహా సకల వ్యవస్థలను దిగ్బంధించే ప్రయత్నం చేస్తారు. దీన్నే లాక్‌డౌన్‌గా పిలుస్తున్నారు. శాంతి భద్రతలు, న్యాయవిధులు నిర్వహించే అధికారులు. జిల్లా కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌లు. పోలీసులు, వైద్య, ఆరోగ్యం, స్థానిక సంస్థలు, ఫైర్‌, విద్యుత్‌, తాగునీరు, బ్యాంకులు, ఏటీఎమ్‌లు, ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా పాత్రికేయులకు ఈ లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ అన్నివర్గాల వారు యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. 

కరోనా వ్యాప్తి నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టింది. కానీ జనంలో మాత్రం అంతగా మార్పు కనిపించడంలేదు. హైదరాబాద్‌లో ఆటోలు, ప్రైవేటు వాహనాలు అడ్డూఅదుపు లేకుండా తిరుగుతున్నాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం ఒక్కరోజు మాత్రం ప్రజలు స్వీయ నిర్బంధాన్ని పాటించారు. భారతీయ రైల్వేతో పాటు తెలంగాణ ఆర్టీసీని కూడా మూసివేయడంతో ప్రైవేటు వాహనాలు సొమ్ముచేసుకునేందుకు ఇదే సమయంగా భావించి ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు.

ప్రజా రవాణాను నిలిపివేయాలి. టాక్సీలు, ఆటోలు తిరగనివ్వరు. వాటిని కూడా బంద్‌ చేస్తారు. అయితే అత్యవసర రవాణాకు మినహాయింపు ఉంటుంది. అంటే, ఆస్పత్రులకు వెళ్లడానికి, ఆస్పత్రుల నుంచి ఇళ్లకు రావడానికి వీలు కల్పిస్తారు. అంబులెన్స్‌లు తిరుగుతాయి.  నిత్యావసరం కేటగిరీలో రాని దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు, వర్క్‌షాపులు, గోడౌన్లను మూసివేయాలి.కానీ అవేం అమలు కావడం లేదు. 

ఒక్కో వాహనంలో ఐదునుంచి ఆరుగుర్ని ఎక్కించుకుని వెళ్తున్నారు. పలుచోట్ల పోలీసులు నియంత్రించినప్పటికీ.. పూర్తి స్తాయిలో మాత్రం అదుపుచేయలేకపోవడంతో ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపిస్తుందేమోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ప్రభుత్వం, వైద్యులు హెచ్చరించినా.. పాటించాల్సిన జాగ్రత్తలను గాలికొదిలేశారు. సామాజిక దూరం పాటించాలని ఓవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. షాపింగ్‌మాల్స్‌, నిత్యావసర దుకాణాల వద్ద పెద్ద ఎత్తున గుంపులుగా నిలుచుని ఉన్న ఘటనలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల మద్యం దుకాణాలు కూడా తెరిచి.. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 వరకు వాహనాలు బయటకు రావద్దని చెబుతున్నా తెలంగాణలోని వివిధ చెక్ పోస్టుల వద్ద వాహనాలు కనిపిస్తున్నాయి.  తెలంగాణ నుంచి విజయవాడ వైపు పెద్ద ఎత్తున వెళ్తున్న ప్రైవేటు లారీలు, కార్లను మాత్రం పక్కనే ఉన్న మైదానంలో టోల్‌ సిబ్బంది పార్క్‌ చేయిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చి 31 వరకు ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీచేస్తున్నారు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   26 minutes ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   an hour ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   2 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   5 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16-04-2021


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle