newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో లాక్ డౌన్ తొలగిస్తారా.. పొడగిస్తారా?

03-05-202003-05-2020 06:23:58 IST
Updated On 03-05-2020 09:11:41 ISTUpdated On 03-05-20202020-05-03T00:53:58.650Z03-05-2020 2020-05-03T00:53:53.113Z - 2020-05-03T03:41:41.975Z - 03-05-2020

తెలంగాణలో లాక్ డౌన్ తొలగిస్తారా.. పొడగిస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రం లాక్ డౌన్ మరోసారి పొడగించేసింది. మే 3 నుండి మరో రెండు వారాలు పొడగించి మే 17 వరకు అంతా లాక్ డౌన్ ప్రకటించేసింది. కానీ ఎప్పటిలానే రాష్ట్రాల ప్రభుత్వాలకు సడలింపులలో అధికారాలు ఇచ్చింది. కేంద్రమే సడలింపులతో ఓ జాబితాను విడుదల చేయగా అవసరమైతే రాష్ట్రాలు అందులో మార్పులు, చేర్పులు కూడా చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏపీ ఇప్పటికే కేంద్రాన్ని ఫాలో అయిపోతున్న సంగతి తెలిసిందే.

ఇక మరో తెలుగు రాష్ట్రంలో పరిస్థితి ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడ లాక్ డౌన్ తొలగిస్తారా? పొడగిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. రెండోసారి కేంద్రం లాక్ డౌన్ పొడిగిస్తూ మే 3 వరకు ప్రకటించినా కేసీఆర్ దానికి మరో నాలుగు రోజులు కలిపి మే 7 వరకు తెలంగాణలో లాక్ డౌన్ పొడిగించారు. ఆ తరవాత పరిస్థితి ఏంటన్నది ఆ తేదీకి ఒకటి, రెండు రోజులు ముందుగానే ప్రకటించనున్నారు.

ముందుగా ఈనెల 5 న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వైరస్ పరిస్థితిపై సుదీర్ఘ చర్చ జరపనున్నారట. ఇందుకోసం అధికారులు ఇప్పటికే సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ అందించే వివరాల ఆధారంగానే మే 7 తర్వాత నిర్ణయాలు ఉండే అవకాశం ఉందంటున్నారు.

కారణాలేమైనా కానీ కరోనా చర్యలపై సీఎం కేసీఆర్ కేంద్రం నిర్ణయాలను సమర్థిస్తూనే రాష్ట్రంలో మాత్రం అయన స్వయంగా నిర్ణయాలను తీసుకుంటున్నారు. కేంద్రం రెండో విడత లాక్ డౌన్ లో ఇచ్చిన సడలింపులను కేసీఆర్ తెలంగాణలో అమలు చేయకపోగా ముందుగానే పొడగింపు కూడా చేశారు. ఇక ఇప్పుడు జోన్ల వారీ కేంద్ర నివేదికలో కూడా కేసీఆర్ మార్పులు చేసే అవకాశం ఉందంటున్నారు.

కేంద్రం ప్రకటించిన రెడ్ జోన్లలో మే 7 తర్వాత కూడా కఠినంగానే ఉండే అవకాశాలు ఉండగా ఆరెంజ్ జోన్ల విషయంలో మాత్రం కేంద్రాన్ని మించి రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా మే 8 నుండి ఆరెంజ్ జోన్లలోని కొన్ని జిల్లాలను గ్రీన్ జోన్లలో కలిపేసేందుకు కూడా సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది.

తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా ఫ్రీ రాష్ట్రంగా చూడాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ మే 7 తర్వాత మరో మూడు వారాలు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉండగా అవి కేవలం హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రెడ్ జోన్లలోనే అమల్లో ఉండే అవకాశం ఉందని.. దశల వారీగా ఆరెంజ్ జోన్లను గ్రీన్ జోన్లలోకి మారుస్తూ లాక్ డౌన్ తొలగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మే 7 తర్వాత గ్రీన్ జోన్లలో పూర్తిస్థాయిలో సాధారణ జీవనానికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉండగా రెడ్ జోన్లను మాత్రం మే నెల మొత్తం కఠినంగా  ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు అటు కేంద్రం నిర్ణయాలను అమలు చేస్తున్నట్లుగానే సీఎం కేసీఆర్ తమ సొంత పరిపాలన ముద్ర వేసుకుంటున్నారు. ఇకపై లాక్ డౌన్ 3.0 లో కూడా అదే మార్క్ ఉండనుందని తెలుస్తుంది.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle