newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో లక్షా 6వేల కేసులు.. కొత్తగా 1842 కేసులు

24-08-202024-08-2020 10:38:34 IST
Updated On 24-08-2020 14:00:59 ISTUpdated On 24-08-20202020-08-24T05:08:34.292Z24-08-2020 2020-08-24T05:03:38.029Z - 2020-08-24T08:30:59.300Z - 24-08-2020

తెలంగాణలో లక్షా 6వేల కేసులు.. కొత్తగా 1842 కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకి 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో గతంలో కేసుల తీవ్రత తగ్గినా మళ్లీ కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,842 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 6 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,06,091కి చేరింది. మృతుల సంఖ్య 761కి పెరిగింది. 

మరోవైపు నిన్న 1,825 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 82,411కి చేరింది. ప్రస్తుతం 22,919 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 373, నిజామాబాద్‌ జిల్లాలో 158, కరీంనగర్‌ జిల్లాలో 134, సూర్యాపేట జిల్లాలో 113, రంగారెడ్డి జిల్లాలో 109 కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో రికవరీ రేటు 77.67 శాతంగా ఉందని తెలిపింది. గత 24 గంటల్లో 36,282 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని, దాంతో మొత్తం పరీక్షల సంఖ్య 9,68,121 కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

తెలంగాణలో వ్యాధి నిర్దారణ పరీక్షలు పెరుగుతూనే వున్నాయి. లక్షణాలున్నవారు సమీపంలోని బస్తీ దవాఖానాల్లో సమాచారం ఇస్తే పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. లక్షణాలున్న టెస్టులు చేయించుకోకుండా బయట తిరిగితే మిగిలినవారికి వ్యాధి సోకే అవకాశం ఉంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle