newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో రోడ్డెక్కిన బస్సులు.. హైదరాబాద్‌లో ఆంక్షలు

19-05-202019-05-2020 10:55:23 IST
Updated On 19-05-2020 14:04:58 ISTUpdated On 19-05-20202020-05-19T05:25:23.874Z19-05-2020 2020-05-19T05:25:17.348Z - 2020-05-19T08:34:58.391Z - 19-05-2020

తెలంగాణలో రోడ్డెక్కిన బస్సులు.. హైదరాబాద్‌లో ఆంక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి వల్ల గత 55 రోజులకు పైగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బస్సులు నేటి నుంచి రోడ్డు పైకి వచ్చాయి .లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ ఆర్టీసీ బస్సులు నడుపుకొనేం దుకు ప్రభుత్వం అనుమతినివ్వటంతో ఆర్టీసీ అధికారులు చకచకా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి ఒక్కరు మాక్స్ లు,శానిటైజర్లు వాడాలని ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసా డిపో లో 88 బస్సు లకు గాను మొత్తం 85 బస్సు లు ప్రారంభమయ్యాయి.

బస్సులు మహారాష్ట్ర సరిహద్దు వరకే నడుతామని, హైదరాబాద్ లోని జూబ్లిబస్టాండ్ వరకు, అన్ని జిల్లాలకు బస్సులు నడుపుతున్నామని డిపో మేనేజర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.. ఉమ్మడి నిజామాబాద్ రీజినల్ పరిధిలో 6 డిపోలు ఉన్నాయి. వాటిలో 650 బస్సులు ఉన్నాయి, ఉదయం 40కి పైగా బస్సులను నడిపామని, ప్రయాణికులను బట్టి మరింత బస్సులను పెంచే అవకాశం ఉందని ఆర్టీసీ ఆర్ ఎం సోలమన్ తెలిపారు.

ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి వైరస్ బారిన పడకుండా వారికి సైనిటైజర్లను అందజేయడం జరిగిందని తెలిపారు.. అలాగే బస్సు సీట్లకు మించి, ప్రయాణికులను ఎక్కించ వద్దని, స్టాండింగ్ ప్రయాణం అనుమతులు లేవని పేర్కొన్నారు.. జిల్లా నుండి అన్ని  జిల్లాలకు బస్సులను పంపడం జరుగుతుందని, రెడ్ జోన్ ప్రాంతాలను మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగిందని, ఇతర రాష్ట్రాలకు బస్సులను నడపడం లేదని తెలిపారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులు నడుపుతామన్నారు. 

ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. భద్రాచలం నుంచి ప్రారంభమైన ఆర్టీసీ బస్సుల్లో సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. శానిటైజర్ల ద్వారా చేతులు శుభ్రం చేసుకోవాలని,  బస్సు ఎక్కేముందు ప్రయాణీకులకు శానిటైజర్లతో చేతులు  శుభ్రం చేసుకొని బస్సు ఎక్కాలంటున్నారు  బస్సు సిబ్బంది. ఇటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళలేదు. ఉదయం 4 గంటల నుంచి డిపోకు చేరుకున్న  ఆర్ టి సి కార్మికులు తమ డిపోనుంచి అన్ని బస్సులు హైదరాబాద్ వరకూ తిరిగేవి కావడం, రెడ్ జోన్ వుండడంతో వెనుతిరిగారు. దీంతో బస్సులన్నీ డిపోలలోనే ఉండిపోయాయి. ఇటు ఇతర ప్రాంతాలకు వెళ్లేవి మాత్రం తిరుగుతున్నాయి. 

హైదరాబాద్‌ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నందున నగరంలో బస్సులు తిప్పడంలేదు.  ఈ క్రమంలో సిటీ సర్వీసులు డిపోలకే పరిమితం అయ్యాయి. అదే కోవలో జిల్లా సర్వీసులను కూడా సిటీలోకి అనుమతించొద్దని ప్రభుత్వం ఆదేశించింది. 

  • నల్లగొండ – విజయవాడ హైవే మీదుగా వచ్చే బస్సులను హయత్‌నగర్‌ వద్దే నిలిపి వేస్తున్నారురు. వాటిని దిల్‌సుఖ్‌నగర్‌ వరకు అనుమతించాలన్న విన్నపాన్ని ప్రభుత్వం తిరస్కరించింది.
  • ఇటువరంగల్‌ వైపు నుంచి వచ్చే బస్సులు ఉప్పల్‌ క్రాస్ రోడ్డువరకే అనుమతిస్తున్నారు. 
  • దేవరకొండ వైపు నుంచి వచ్చేవి ఇబ్రహీంపట్నం వరకే నడుస్తాయి. వికారాబాద్‌ వైపు నుంచి వచ్చేవి ‘అప్పా’ జంక్షన్‌ వరకే అనుమతి 
  •  
  • కరీంనగర్, సిద్దిపేట వైపు నుంచి వచ్చేవి జూబ్లీ బస్టేషన్‌ వరకే అనుమతి 
  • ఇమ్లీబన్‌ బస్టాండులోకి బస్సులను అనుమతించరు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్, మినీ బస్సులన్నింటినీ నడుపుతారు. రాష్ట్రం లోపలే అన్ని జిల్లాలకు ఈ బస్సులు తిరుగుతాయి. ప్రస్తుత పరిస్థితిలో ప్రయాణికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని బస్సు ఎక్కాలని, నిలబడేందుకు మాత్రం అనుమతించమని పేర్కొంటున్నారు.

హయత్ నగర్ డిపోనుంచి బస్సులు ప్రారంభమయ్యాయి. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న నల్గొండ,మిర్యాలగూడ,సూర్యాపేట,నార్కట్ పల్లి మరియు ఖమ్మం నుండి వచ్చిన ఆర్ టి సి బస్ లు హాయత్ నగర్ బస్ స్టాప్ వరకూ రాకపోకలు సాగిస్తున్నాయి. బస్ లలో భౌతిక దూరం పాటిస్తూ ముగ్గురు కూర్చునే సీట్ లలో ఇద్దరు మరియు ఇద్దరు కూర్చునే సీట్ లలో ఒక్కరిని కూర్చోబెట్టి బస్సులని పంపిస్తున్నారు. ప్రయాణికులు తక్కువగా ఉండటంతో బస్ లు చాలా సేపు బస్ స్టాప్ లో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   3 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle