newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో రోజుకి రెండు వేల మార్క్ దాటిన కేసులు

23-08-202023-08-2020 09:14:01 IST
Updated On 23-08-2020 13:02:06 ISTUpdated On 23-08-20202020-08-23T03:44:01.567Z23-08-2020 2020-08-23T03:43:48.011Z - 2020-08-23T07:32:06.327Z - 23-08-2020

తెలంగాణలో రోజుకి రెండు వేల మార్క్ దాటిన కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మరోసారి కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. మళ్ళీ వరుసగా రెండోరోజు రెండు వేల మార్క్ దాటాయి పాజిటివ్ కేసులు. ఇవ్వాళ కొత్తగా 2384 కేసులు పాజిటివ్ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 11 మరణాలు చోటుచేసుకోగా మొత్తం మరణాల సంఖ్య 755కి చేరింది. కొత్తగా 1851 రికవరీ అయినట్లు వైద్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 80 586కి రికవరీ అయి ఇంటికి వెళ్లారు. 

ఇవాళ్టి కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,04,249కి చేరింది. మృతుల సంఖ్య 755కి పెరిగింది. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 80,585కి చేరింది. ప్రస్తుతం 22,908 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్క రోజే 1,851 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఒక్క రోజే 40,666 టెస్టులు చేయగా 2,474 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9,31,839 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 472, రంగారెడ్డిలో 131, జగిత్యాల లో 105 కేసులు నమోదయ్యాయి.. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది ప్రస్తుతం రికవరీ రేట్ 72.72గా ఉంది. దేశంలో 70.76గా రికవరీ రేట్. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.72 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 1.87 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

మరోవైపు కోవిడ్ లక్షణాలే లేకుండా వచ్చి తగ్గిపోయిన వ్యక్తులు లేదా స్వల్ప లక్షణాలతో జయించిన వ్యక్తుల శరీరంలో కోవిడ్ యాంటీ బాడీస్ గుర్తించలేకపోయినా, ఆ వైరస్ రకాన్ని గుర్తుపెట్టుకొని మళ్లీ వస్తే ఎదుర్కొనే బలమైన టిసెల్స్ ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. చిన్నప్పుడు మనం వేయించుకున్న టీకాలే ఇందుకు దోహదం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   8 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   13 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle