newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

14-08-202014-08-2020 09:29:23 IST
Updated On 14-08-2020 09:39:33 ISTUpdated On 14-08-20202020-08-14T03:59:23.480Z14-08-2020 2020-08-14T03:56:21.982Z - 2020-08-14T04:09:33.708Z - 14-08-2020

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. 

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్ తోపాటు మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి భూమి పూజ చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు రావు అనే అనుమానాలతో ఆరేళ్ల క్రితం రాష్ట్రం ఆవిర్భించిందని, అయితే, రైల్వే కోచ్ లు మాత్రమే కాదు, హెలికాప్టర్ విడి భాగాలు కూడా రాష్ట్రంలోనే తయారవుతున్నాయని తెలిపారు.

మెట్రో రైళ్లను ఇంతవరకు కొరియా నుంచి తెచ్చుకుంటున్నామని, ఇకమీదట తెలంగాణలోనే తయారుకాబోతున్నాయని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ స్వయం సమృద్ధి సాధించిన రాష్ట్రం కావాలని ఆకాంక్షించారు. మేధా సంస్థ దేశాన్ని ఆకర్షించే విధంగా అభివృద్ధి చెందినందుకు తెలంగాణ పౌరుడిగా గర్వపడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించే రైళ్లు అందుబాటులోకి వస్తే పౌరుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని మంత్రి వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీ తీసుకొచ్చామని కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ వివరించారు. కాగా, 100 ఎకరాల్లో 800 కోట్ల వ్యయంతో ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు.

https://www.photojoiner.net/image/NmzhUfHi

ఈ ఫ్యాక్టరీ జిల్లాకే కాక తెలంగాణకే తలమానికం కానుందని తెలిపారు. అనంతరం శంకర్‌పల్లి మండలంలోని మొకీల చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను మంత్రి కేటీఆర్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ ఛైర్మన్ అనితా రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle