తెలంగాణలో రైతురాజ్యం .. కేసీయార్ బతికున్నంతకాలం రైతుబంధు
06-05-202006-05-2020 08:08:52 IST
Updated On 06-05-2020 10:11:51 ISTUpdated On 06-05-20202020-05-06T02:38:52.586Z06-05-2020 2020-05-06T02:38:46.268Z - 2020-05-06T04:41:51.622Z - 06-05-2020

’’నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో రైతు పండించిన పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వం కొన్న దాఖలాలు లేవు. రైతులను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది.దేశ చరిత్రలో ఇన్ని పంటలు కొంటున్న ఏకైక ప్రభుత్వం మాదే. 2500 మద్దతు ధర ఇస్తామని చెప్పిన ఛత్తీస్ గడ్ కాంగ్రెస్ ప్రభుత్వం 800 కు కొంటుంది. పక్క రాష్ట్రాల్లో మాట తప్పిన కాంగ్రెస్, ఇక్కడ దీక్షలు చేయడం సిగ్గు చేటు. *బతుకమ్మ చీరలు ఇస్తే తగలబెట్టి చీరల రాజకీయాలు చేస్తారు’’ ఇదీ విపక్షాలపై తెలంగాణ సీఎం కేసీయార్ మాటల దాడి. కేబినెట్ భేటీ అనంతరం సుదీర్ఘసమయం మీడియాతో మాట్లాడారు. రైతుబంధు అందరికీ ఇస్తామని,కేసీఆర్ బ్రతికినన్ని రోజులు రైతుబంధు యథాతథంగా కొనసాగుతుందన్నారు. రైతు బంధు నిధులు విడుదల చేస్తామన్నారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ, తమిళనాడు మాత్రమే. రైతులకు 24గంటలు ఉచిత కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. పేదలకు, రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు పరుస్తామన్నారు కేసీయార్, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు పండించాలి. ఎందుకంటే ప్రతి ఏడాది ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనలేదు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొంటున్నాం. రైతులు కూడా ఆలోచించుకోవాలన్నారు. ఏ అంశాన్ని ఎత్తుకోవాలో అనే తెలివి కూడా ప్రతిపక్షాలకు లేదని, తాను కూడా రైతునే అన్నారు. ప్రతిపక్షాలు తెలివితక్కువ పని చేస్తున్నాయి. దానికి సిగ్గు పడుతున్నానన్నారు. కాంగ్రెస్ ఎప్పుడైనా వందశాతం ధాన్యాన్ని కొన్నదా..ప్రతిపక్షాలు జోకర్ గాళ్లలాగా, బఫున్ గాళ్లలాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేసీయార్. తెలంగాణ సమయంలో రైతుల పరిస్థితి చూసి చాలా గ్రామాల్లో ఏడ్చాను. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. రైతులు సంపన్నులయ్యేవరకూ రైతులకు అండగా వుంటాను. దేశం ఆకలి తీర్చే శక్తి రైతులకే వుంది. ఇంత పెద్ద దేశంలో వ్యవసాయానికి ఇబ్బందులు వస్తే మనల్ని ఎవరూ ఆదుకోలేరు. మనమే ప్రపంచానికి మార్గదర్శకులం. అందుకే లాక్ డౌన్ వల్ల వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, విత్తనాల సరఫరా, వ్యవసాయానికి సంబంధించిన అన్ని వ్యవహారాలకు అనుమతి వుంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ వుంటుంది. రైతులు ఇబ్బందులు పడకూడదన్నారు కేసీయార్. ఎట్టి పరిస్థితుల్లో ఆహారరంగంలో దేశం సాధించుకున్న స్వావలంబనను కోల్పోవద్దు. కరోనా కంటే పెద్ద ప్రమాదంలో పడతాం. వ్యవసాయరంగ పనులు యథాతథంగా కొనసాగుతాయన్నారు. పెస్టిసైడ్స్, సీడ్స్ షాపులు తెరిచి ఉంటాయి. నిత్యావసర షాపులు ఓపెన్‌గా ఉంటాయి. దాంతోపాటు సిమెంటు, స్టీలు, హార్డ్‌వేర్, గృహాలకు సంబంధించిన ఎలక్ట్రికల్ షాపులు కూడా తెరిచి ఉంటాయి. ఎలాంటి మత ప్రార్థనలకు, రాజకీయపార్టీల మీటింగ్‌లకు, ర్యాలీలకు అనుమతించేదిలేదన్నారు కేసీయార్. రూ.25వేలు లోపు రైతు రుణ మాఫీ తాను బతికున్నంత వరకు రైతు బంధుపథకం యథాతథంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అర్హులైన అందరికీ వందశాతం రైతు బంధు అందిస్తామన్నారు. ‘‘ రైతులకు ఎరువులు, విత్తనాలు, పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయి. రూ. 25 వేలలోపు ఉన్న వారికి రేపే రుణమాఫీ చేస్తాం. వర్షాకాలం పంటల సాగుకు 7,500 కోట్ల సిద్ధంగా ఉన్నాయి.రైతులను ధనవంతులను చేసే వరకూ.. తమ పెట్టుబడిని వారే సంపాదించుకునే వరకు ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుంది. పనికిమాలిన ప్రతిపక్షాల మాటలను రైతులు వింటే నష్టపోతారు. కందులు, శనగలు, సన్ ఫ్లవర్, మిక్క జొన్న, వరి ధాన్యం పంట ఉత్పత్తులను 100శాతం కొనుగోలు చేశాం.

ఏపీలో స్కూల్స్ బంద్
2 minutes ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
6 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
an hour ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
8 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
8 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
34 minutes ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
2 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
10 hours ago
ఇంకా