newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో రైతుబజార్లలోనూ సామాజిక దూరం

29-03-202029-03-2020 08:45:50 IST
2020-03-29T03:15:50.148Z29-03-2020 2020-03-29T03:15:47.365Z - - 16-04-2021

తెలంగాణలో రైతుబజార్లలోనూ సామాజిక దూరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మరిన్ని ముమ్మర చర్యలు చేపట్టింది. చాలా చోట్ల ప్రజలు నిత్యావసరాలు, కూరగాయల కొనుగోళ్ల కోసం గుంపులుగుంపులుగా వస్తున్న దృష్ట్యా, దీన్ని నిరోధించడానికి రైతుబజార్‌లను విశాల ప్రదేశాలకు, ఖాళీ ప్రదేశాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో ఖాళీగా ఉన్న క్రీడా మైదానాలు, బస్టాండ్లు, కళాశాల, పాఠశాలల ప్రాంగణాల్లో కూరగాయల విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. 

ఇప్పటికే హైదరాబాద్‌ చింతలబస్తీ లోని మార్కెట్‌ను పక్కనే ఉన్న రాంలీలా మైదానంలోకి తరలించారు. సంగారెడ్డిలో సైతం కలెక్టరేట్‌ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో కూరగాయల అమ్మకాలు చేపట్టగా, కరీంనగర్‌ బస్టాండును మార్కెట్‌గా మార్చేశారు. చాలా చోట్ల ఇదేమాదిరి రైతుబజార్లను తరలించి కొనుగోలుదారుల మధ్య సామాజిక దూరం ఉండేలా మార్కింగ్‌ చేస్తున్నారు. 

ఇక ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన రైతుబజార్‌లను జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసేలా చర్యలు మొదలు పెట్టారు. దీనిద్వారా ఎక్కడివారికి అక్కడే నిత్యావసరాలు అందుబాటులోకి తేవడంతోపాటూ గుంపులను నివారించే చర్యలు తీసుకుంటున్నారు.  

కాగా లాక్‌డౌన్‌ పేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్‌ బుకింగ్‌లకు డిమాండ్‌ పెరగడంతో ఆయిల్‌ కం పెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వినియోగదారులు ఒకటికి మించి ఎక్కువ గ్యాస్‌ బుకింగ్‌లు చేయకుండా పలు ఆంక్షలు విధించాయి. ఒక బుకింగ్‌ జరిగాక, రెండో బుకింగ్‌కు కనీసం 14 రోజుల గ్యాప్‌ ఉండేలా ఆంక్షలు తెచ్చాయి. ఈ మేరకు హెచ్‌పీ, భారత్‌గ్యాస్, ఇండేన్‌ గ్యాస్‌లు నిర్ణయం తీసుకున్నాయి. 

గతంలో కేవలం ఒక్క రోజు తేడాతో రెండో బుకింగ్‌కు సైతం సిలిండర్‌ సరఫరా చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్‌ పెరుగుతుండటం, వినియోగదారులు రెండుమూడు సిలిండర్‌లను బుక్‌ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు ఫలితాలనిస్తాయని ఆయిల్‌ కంపెనీలు చెబుతున్నాయి. మరోపక్క కేంద్రం ఉజ్వల పథకం కింది లబ్ధిదారులకు వచ్చే మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్‌ అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనూ బుకింగ్‌లు పెరగడంతో కంపెనీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   20 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle