newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో రికార్డ్ బ్రేక్.. ఒకే రోజు 60 వేల పరీక్షలు.. పెరిగిన కేసులు

28-08-202028-08-2020 10:58:29 IST
2020-08-28T05:28:29.618Z28-08-2020 2020-08-28T05:28:23.109Z - - 12-04-2021

తెలంగాణలో రికార్డ్ బ్రేక్.. ఒకే రోజు 60 వేల పరీక్షలు.. పెరిగిన కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా పరీక్షల సంఖ్య పెరిగితే దానికి అనుగుణంగా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతాయనడానికి తెలంగాణనే తాజా ఉదాహరణ.  రాష్ట్రంలో ఒకే రోజు 60,386 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,795 పాజిటివ్‌ కేసులు వచ్చాయని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులిటెన్‌లో వెల్లడించారు. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. తాజాగా కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 788కి చేరింది. 

కరోనా బారి నుంచి తాజాగా 872 మంది కోలుకోగా, ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 86,095కి చేరిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27,600 యాక్టివ్‌ కేసులున్నాయి. అందులో ఇళ్లు, ఇతరత్రా ఐసోలేషన్‌లలో చికిత్స పొందుతున్నవారు 20,866 మంది ఉన్నారు. ఇక తెలంగాణలో ఇప్పటివరకు 11,42,480 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఇక కేసుల విషయానికి వస్తే.. జీహెచ్ఎంసి పరిధిలో 449, భద్రాద్రి కొత్త గూడెంలో 72, జగిత్యాలలో 89, కరీంనగర్ లో 136, ఖమ్మంలో 152, మంచిర్యాలలో 106, మహబూబాబాద్ జిల్లాలో 102, నల్గొండలో 164, నిజామాబాద్ లో 112, పెద్దపల్లిలో 77, రంగారెడ్డి జిల్లాలో 268, సిద్ధిపేట జిల్లాలో 113, సూర్యాపేటలో 86, వరంగల్ అర్బన్ లో 132 కేసులు నమోదయ్యాయి.

ఇంతకాలం హైదరాబాద్‌లో గరిష్టంగా ప్రతాపం చూపించిన వైరస్‌.. ఇప్పుడు తెలంగాణ  జిల్లాల్లోనూ విజృంభిస్తోంది. వారం రోజుల్లోనే చాలా జిల్లాల్లో రెట్టింపు కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. కొన్ని జిల్లాల్లో మూడు, నాలుగింతలు కూడా రికార్డయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులెటిన్‌ మేరకు.. ఈ నెల 20న జీహెచ్‌ఎంసీ పరిధిలో 473 కేసులుండగా, 26న 449 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ గత వారం రోజులుగా కేసుల సంఖ్య దాదాపు నిలకడగానే కొనసాగుతోంది. 

కానీ జిల్లాల్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 20న 21 కేసులు నమోదు కాగా, 26న ఏకంగా 72 కేసులు రికార్డయ్యాయి. అంటే మూడింతలకు మించిన కేసులన్న మాట. భూపాలపల్లి జిల్లాలో 20న 12 కేసులు నమోదు కాగా, 26న 26 కేసులు.. అంటే రెట్టింపునకు మించి నమోదయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల వరకు కంటైన్మెంట్‌ జోన్లున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. పల్లెల్లోనూ వైరస్‌ వ్యాప్తి చెందడంతో గ్రామాల్లో అలజడి నెలకొంది. వచ్చే నెలాఖరుకు దాదాపు 3 వేల గ్రామాల్లోకి వైరస్‌ ప్రవేశించే అవకాశముందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle