newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

తెలంగాణలో రాజ్య సభ సందడి.. పెద్దలసభలో అడుగుపెట్టేదెవరు?

26-02-202026-02-2020 09:07:29 IST
2020-02-26T03:37:29.540Z26-02-2020 2020-02-26T03:37:12.146Z - - 31-05-2020

తెలంగాణలో  రాజ్య సభ సందడి.. పెద్దలసభలో అడుగుపెట్టేదెవరు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. అయితే ఈసారి ప్రజలు ఓటేసేది కాదు. రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల విడుదల అయింది.  నోటిఫికేషన్‌ మార్చి 6న రానుంది. నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. 

ఏప్రిల్‌లో ముగియనున్న రాజ్యసభ సీట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు రెడీ అయింది. మొత్తం 17 రాష్టాల నుంచి 55 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్మెంట్ కానున్నారు. అందులో ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు  ఎన్నికలు జరుగనున్నాయి. రాజ్యసభలో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్.ఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డి, కేశవరావు, తోట సీతారామలక్ష్మి, తెలంగాణ  నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్ రావు స్థానంలో కొత్తగా ఎన్నికలు జరుగుతాయి. 

తెలంగాణలో రాజ్యసభ స్థానాలకు పోటీ విపరీతంగా వుంది. తెలంగాణలో రెండు సీట్లే ఖాళీ అవుతున్నా పోటీలో అనేకమంది సీనియర్లున్నారు. ఈ రెండింటలో సీఎం కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. రేసులో ఉన్న వారిలో ఎవరికైనా అవకాశమిస్తారా లేక, పార్లమెంట్​ ఎలక్షన్ల నాటి తరహాలో కొత్త ముఖాలు, రాజకీయాలతో సంబంధాలు లేని వారిని ఎంపికచేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీలో టీఆర్ఎస్ కు ఉన్న సంఖ్యాబలం మేరకు ఎన్నికలు జరిగే రెండు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ పత్రాలపై 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌కు ఆరుగురే ఎమ్మెల్యేలు ఉండటంతో నామినేషన్​ కూడా వేయలేదు. ఇక ఎన్నిక జరిగే రెండు సీట్లు కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందినవి కావు. ఒకటి కాంగ్రెస్, మరొకటి బీజేపీ సిట్టింగ్​ స్థానాలు. 

రాజ్యసభ సీటు కోసం మాజీ స్పీకర్లు కేఆర్ సురేశ్​ రెడ్డి, మధుసూదనాచారి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వర్​రావు, నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, బస్వరాజు సారయ్య.. మాజీ ఎంపీలు కవిత, వినోద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మందా జగన్నాధం, సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న కేకే పదవీకాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు వరుసగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయనకు అవకాశం రాకపోవచ్చని అంటున్నారు. అయితే ఆయన మాత్రం ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. 

కేసీఆర్​ బంధువు, మాజీ ఎంపీ వినోద్ కూడా రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి చెందిన సంతోష్ కుమార్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రెండో సీటును వెలమ కులానికి, బంధువుకు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. అగ్రవర్ణాలకు కాకుండా ఎస్సీ సామాజిక వర్గం వారికి అవకాశం ఇవ్వవచ్చని అంటున్నారు.  అయితే టీఆర్ఎస్​ ఎస్టీలకు రాజ్యసభ సీటు ఇవ్వలేదని, ఈసారి తమకు ఆ ఛాన్స్ రావచ్చని  ఎస్టీ వర్గానికి చెందిన మాజీ ఎంపీ సీతారాం నాయక్, రిటైర్ట్ ఐఏఎస్ రామచంద్ర నాయక్ ఆశలు పెట్టుకున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సురేష్ రెడ్డిలో ఒకరికి ఛాన్స్ రావచ్చనే ప్రచారం తెలంగాణ భవన్లో వినిపిస్తోంది. 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   2 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   7 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   10 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   10 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   10 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   12 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   13 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   13 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   13 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle