newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో మూడో కరోనా కేసు

16-03-202016-03-2020 15:49:52 IST
Updated On 16-03-2020 15:53:11 ISTUpdated On 16-03-20202020-03-16T10:19:52.602Z16-03-2020 2020-03-16T10:19:50.327Z - 2020-03-16T10:23:11.274Z - 16-03-2020

తెలంగాణలో మూడో కరోనా కేసు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణను కరోనా వణికిస్తూనే వుంది. తాజాగా మూడో కరోనా కేసు నమోదు కావడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయింది. నెదర్లాండ్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. అతనికి కరోనా సోకిందని నిర్ధారించింది పుణే ల్యాబ్‌. ఇద్దరి శాంపుల్స్ పంపితే రెండింటిలో ఒకటి నెగెటివ్‌ వచ్చింది. బాధితుడు రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తపేట వాసవి కాలనీకి చెందినవారిగా గుర్తించారు.

ఇప్పటికే ఆయనతో 12 మంది అతి సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఆయన గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. బాధితుడు కుటుంబసభ్యులు ఎంత మంది.. ఎక్కడెక్కడ.. ఎంత మందితో తిరిగాడు.. ఏయే ప్రాంతాలు సందర్శించాడు? లక్షణాలు బయట పడ్డాక చికిత్స కోసం స్థానికంగా ఏ ఆస్పత్రుల్లో చూపించాడనే అంశాలను పరిశీలిస్తున్నారు. 

మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు 107కి చేరాయి. మహారాష్ట్రలో 31కేసులు, కేరళలో 22 కేసులు నమోదయినట్టు కేంద్రం వెల్లడించింది. ఇటలీ నుంచి వచ్చిన ఓ వైద్య విద్యార్థినికి ఇప్పటికే కరోనా పాజిటివ్‌ రాగా, ఆమె గాంధీలో చికిత్స పొందుతోంది.

సౌదీ నుంచి వచ్చిన యువతి నమూనాల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలానికి చెందిన ఓ విద్యార్థికి కోవిడ్‌ సోకిందన్న అనుమానంతో శనివారం అతడి నమూనాలు గాంధీకి పంపి పరీక్షలు చేయగా.. నెగెటివ్‌ వచ్చింది శనివారం నాటికి ఆ సంఖ్య 84 మాత్రమే కేసులుంటే ఒక్క రోజులోనే అదనంగా 23 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 13 రాష్ట్రాల్లోకి కోవిడ్‌ ప్రవేశించింది. వివిధ రాష్ట్రాల్లో సరైన సమయంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోంది. 

హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, రోగులు వాడిన దుస్తులను తగలబెడుతున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల్లో దిగి బస్సులు, రైళ్ళు, ఓడల ద్వారా రాష్ట్రానికి వచ్చేవారిని గుర్తించేందుకు ఇతర రాష్ట్రాల సాయం కోరింది వైద్యశాఖ. మరోవైపు కోవిడ్‌తో మరణించిన వారి మృతదేహాల ఖననంపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేయనుంది. మన దేశంలో రెండు మరణాలు చోటు చేసుకోవడంతో, మున్ముందు వాటి సంఖ్య పెరిగే అవకాశముందన్న అభిప్రాయంతో కేంద్రం మృతదేహాల ఖననాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అలాగే కేరళలో కోవిడ్ కారణంగా మరణించిన వారి అంత్యక్రియల్లో 15మందికి మించి పాల్గొనకూడదనే నిబంధన విధించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle