newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

22-01-202022-01-2020 15:47:01 IST
Updated On 22-01-2020 15:46:58 ISTUpdated On 22-01-20202020-01-22T10:17:01.805Z22-01-2020 2020-01-22T09:49:28.594Z - 2020-01-22T10:16:58.101Z - 22-01-2020

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మళ్లీ ఎన్నికల వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలోని 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లు, 120 మున్సిపాలిటీల్లో 2,727 కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్లలో ఒక డివిజన్‌, మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవం కాగా 324 డివిజన్లు, 2,647 వార్డులకు అధికారులు పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు.

https://www.photojoiner.net/image/t9lMwTHJ

ఫలితాలు ఈనెల 25న వెల్లడిస్తారు. ఒక్క కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మాత్రం జనవరి 25 న జరుగుతాయి. అక్కడి తుది ఫలితాలు జనవరి 27 న ప్రకటిస్తారు. ఈసారి మునిసిపల్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిఘా వున్నా మునిసిపాలిటీలలో మద్యం, డబ్బు ప్రధాన పాత్ర పోషించాయి.

ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్ -కాంగ్రెస్-బీజేపీ మధ్యే వుంది. ఎన్నికల్లో గెలుపుఓటములు సహజమే అయినా భవిష్యత్తులో వచ్చే పదవులకు కొలమానం కావడంతో టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇజ్జత్ కా సవాల్ గా వీటిని స్వీకరించారు.

పలువురు ప్రముఖులు, సామాన్యులతో పాటు అధికారులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నల్లగొండ జిల్లాలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్కా సుమన్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ నేత లక్ష్మీనారాయణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ డీఎస్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, అధికారులు ఓటేశారు. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మహాన్యూస్ యూట్యూబ్ ఛానెల్ని సబ్ స్కైబ్ చేసుకోండి. అందుకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.youtube.com/user/mahaanews/videos


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle