newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో మాటల యుద్ధం.. టీఆర్ఎస్ Vs బీజేపీ

23-06-202023-06-2020 11:39:48 IST
Updated On 23-06-2020 11:48:58 ISTUpdated On 23-06-20202020-06-23T06:09:48.342Z23-06-2020 2020-06-23T06:05:22.318Z - 2020-06-23T06:18:58.376Z - 23-06-2020

తెలంగాణలో మాటల యుద్ధం.. టీఆర్ఎస్ Vs బీజేపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కేసులు, విపక్షాల మాటలతో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతుంటే ప్రభుత్వం సమర్థంగా పనిచేయడం లేదని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కరోనా కోసం కేంద్రం ఇఛ్చిన కోట్లాది రూపాయల నిధులపై శ్వేతపత్రం విడుదలచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. గవర్నరే స్వయంగా గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి వెళతారు గానీ సీఎం కేసీయార్ కి గాంధీ ఆస్పత్రిని సందర్శించే తీరిక లేదా అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ మెడికల్ సర్వీసెస్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం అని. టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలపై  బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మన సీఎం పారసీటమాల్ ముఖ్యమంత్రి అనీ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారన్నారు.

డాక్టర్లు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నా తెలంగాణలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరాం. పీపీఈ కిట్లు, మాస్కులు కూడా లేవని డాక్టర్లు ధర్నాలు చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు జోకర్ల లాగా మారారు. హెల్త్ బులెటిన్ కూడా ఇష్టం వచ్చినట్లు విడుదల చేస్తున్నారన్నారు బండి సంజయ్. 

మరోవైపు బీజేపీ నేతల విమర్శలపై రాష్ట్ర మంత్రులు కౌంటరిస్తున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం ఇప్పటివరకు కేవలం రూ.214 కోట్లు మాత్రమే నిధులు ఇచ్చి చేతులు దులుపుకుందని ఈటల విమర్శించారు. టెస్టులు తక్కువ చేస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు వారి ప్రభుత్వం చేసిన ఘనకార్యాన్ని తెలుసుకోవాలన్నారు. రోజుకి 3,500 నుంచి 4 వేల పరీక్షలు చేయగల సామర్థ్యమున్న రోస్‌ కంపెనీకి చెందిన కొబోస్‌–8800 మెషీన్లను దేశంలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్‌ చేసిందని, మూడు మెషీన్లను కొనుగోలు చేయగా.. భారత్‌కు వచ్చిన మొదటి మెషీన్‌ను డైవర్ట్‌ చేసి కోల్‌కతాకు పంపిన కేంద్ర వైఖరిని మంత్రి తప్పుపట్టారు.

వారు చేస్తున్న తప్పులు పక్కనపెట్టి పరీక్షలు తక్కువ చేస్తున్నారంటూ విమర్శలు చేయడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ల్యాబ్‌ల్లో ఇప్పటివరకు 2,290 పరీక్షలను ప్రతిరోజు చేస్తుండగా.. వారం రోజుల్లో మరో 4,310 పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకొని రోజుకు 6 వేల 6 వందలు పరీక్షలు చేయనున్నామని ఈటల ప్రకటించారు. 

కరోనాపై యుద్ధమంటూ కేంద్రం మాటలకే పరిమితమైందని, చప్పట్లు కొట్టమంటూ, దీపాలు పెట్టమంటూ సుద్దులు చెప్పి పైసలివ్వకుండా చేతులు దులుపుకుందని మండిపడ్డారు. కోవిడ్‌–19 నియంత్రణ కోసం కమిట్మెంట్‌తో పనిచేస్తుంటే కొందరు నాయకులు ధర్నాల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టెస్టులు చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఆయన్ను టార్గెట్ చేశారు. కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతి అవుతుందా ? అని ఆయన మండిపడ్డారు. దేశానికి వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన నడ్డాయే.. వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ఏకతాటిపై నిలిచి కష్టపడుతున్న వేళ, బీజేపీ నేతలు ఇటువంటి అల్పమైన రాజకీయాలకు పాల్పడటం భావ్యం కాదు. వైద్యుల మనస్తైర్యం దెబ్బతినకూడదు, ప్రజలకు వైద్య వ్యవస్థపై నమ్మకం సడలకూడదు. ఏ పార్టీ నాయకులైనా ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితిని గ్రహించాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle