తెలంగాణలో మళ్లీ కరోనా ఉధృతి... కొత్తగా 2,474 పాజిటివ్ కేసులు
22-08-202022-08-2020 10:58:04 IST
Updated On 22-08-2020 11:05:02 ISTUpdated On 22-08-20202020-08-22T05:28:04.185Z22-08-2020 2020-08-22T05:27:13.806Z - 2020-08-22T05:35:02.835Z - 22-08-2020

వాతావరణంలో మార్పులు, అన్ లాక్ ప్రక్రియలో భాగంగా కర్ఫ్యూ ఎత్తివేయడంతో రోడ్లమీద వాహనాల రాకపోకలు పెరిగాయి. అర్థరాత్రులు కూడా జనం రోడ్లమీద కనబడుతున్నారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ అధికమవుతోంది. కొత్తగా 2,474 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది. తాజాగా ఏడుగురు కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 744 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1,01,865 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 78,735 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ 477, రంగారెడ్డి 201, నిజామాబాద్లో 153 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం 22,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి.15 వేలమందికి పైగా హోం/ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో వున్నారు. ఇదిలా వుంటే ప్రైవేటు ఆస్పత్రులపై విమర్శలు వస్తున్నా వాటి సంఖ్య పెరుగుతూనే వుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు అనుమతులు ఇవ్వాలని, ఆ మేరకు దరఖాస్తులు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా చికిత్స చేస్తామనే ఆసుపత్రులు దరఖాస్తు చేసుకుంటున్నాయి. అనంతరం ప్రభుత్వం వాటికి అనుమతులు ఇస్తోంది. జూలై 28 నాటికి ప్రైవేట్లో కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పడకల సంఖ్య రెట్టింపు ఉండేది. అయితే తాజాగా ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య 167కి చేరుకోగా, వీటిల్లో మొత్తం కరోనా పడకల సంఖ్య 9,048కు పెరిగింది. మరోవైపు ప్రస్తుతం 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే కరోనా చికిత్సలు చేస్తున్నారు. వీటిల్లో 7,952 కరోనా పడకలు ఉన్నాయి. భారీగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం వాటికి అనుమతులివ్వడం చర్చనీయాంశంగా మారింది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
13 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
13 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
16 hours ago
ఇంకా