newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

తెలంగాణలో మరో 983 మందికి కరోనా.. 14,400 పాజిటివ్ కేసులు

29-06-202029-06-2020 12:31:14 IST
Updated On 29-06-2020 14:16:47 ISTUpdated On 29-06-20202020-06-29T07:01:14.692Z29-06-2020 2020-06-29T07:01:08.033Z - 2020-06-29T08:46:47.290Z - 29-06-2020

తెలంగాణలో మరో 983 మందికి కరోనా.. 14,400 పాజిటివ్ కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 983 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇందులో 9వేల మంది వివిధ ఆస్పత్రులు, హోంఐసోలేషన్‌లలో చికిత్స పొందుతుం డగా.. 5,172 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆదివారం నలుగురు మృతి చెందగా.. ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి సంఖ్య 247కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 816 ఉండగా.. రంగారెడ్డిలో 47, మంచి ర్యాలలో 33, మేడ్చల్‌లో 29, వరంగల్‌ రూరల్‌లో 19, వరంగల్‌ అర్బన్‌లో 12, కొత్తగూడెంలో 5, కరీంనగర్, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 3 చొప్పున, ఆదిలాబాద్, గద్వాల జిల్లాల్లో 2 చొప్పున, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, జనగామ, మెదక్, సూర్యాపేట, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు ఉన్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3,227 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 30% మందికి పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 82,458 మందికి పరీక్షలు నిర్వహించగా 17.48%మందికి పాజిటివ్‌ వచ్చింది.

బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో  ఈనెల 24న అక్కడి ఐసోలేషన్‌ వార్డు నుంచి 47 మంది శాంపిల్స్‌ సేకరించి వరంగల్‌ ఎంజీఎంకు పంపించగా, ఆదివారం 31 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. వీరిలో బెల్లంపల్లి పట్టణానికి చెందినవారు 30 మంది ఉండగా, మందమర్రికి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. ఓ సింగరేణి కార్మికుడి నుంచి వారందరికీ వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

నారాయణఖేడ్‌ కరోనాతో నారాయణఖేడ్‌ మండలం నిజాంపేట్‌ గ్రామానికి చెందిన 7 నెలల బాలుడు ఆదివారం తెల్లవారుజామున మరణించాడు. పదిరోజుల క్రితం అనారోగ్యానికి గురైన బాలుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈనెల 24న అతడికి పాజిటివ్‌ అని తేలడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ చనిపోయాడు. 

తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన

తెలంగాణలో కేంద్ర బృందం మరోసారి పర్యటించనుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తోంది. మొదట టిమ్స్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తుంది. ఇప్పటికే రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై అంచనా వేయడానికి ఎప్పటికప్పుడు కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి అగర్వాల్ నేతృత్వంలో ఈ బృందం పర్యటిస్తోంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాల అధికారులతో చర్చించనుంది. 

దేశంలో కరోనా ప్రవేశించిన నాటి నుంచి కేంద్రం తమ బృందాలను పంపి రాష్ట్రప్రభుత్వాల అప్రమత్తతతో సమాచారాన్ని సేకరిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల ఆధారంగా సూచనలు, సలహాలు ఇస్తోంది. ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు లాక్ డౌన్ సమయంలో తెలంగాణలో సెంట్రల్ టీమ్ పర్యటించింది. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పరిస్థితులను సమీక్షించింది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత కూడా కరోనా రోగులకు అందుతున్న వైద్యం, వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలపై పరిశీలించింది.

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

   2 hours ago


ఎంసెట్ నిర్వహణపై ఏపీ సర్కార్ మల్లగుల్లాలు

ఎంసెట్ నిర్వహణపై ఏపీ సర్కార్ మల్లగుల్లాలు

   3 hours ago


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే కరోనా కిట్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే కరోనా కిట్

   3 hours ago


సీఎం కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్... హైకోర్టు ఫైర్

సీఎం కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్... హైకోర్టు ఫైర్

   5 hours ago


ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రులివే!

ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రులివే!

   5 hours ago


కరోనా ఎఫెక్ట్... పిల్లలా....అప్పుడే వద్దులే!

కరోనా ఎఫెక్ట్... పిల్లలా....అప్పుడే వద్దులే!

   6 hours ago


కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టనుందా?

కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టనుందా?

   7 hours ago


5 వేల‌కు పైగా ఎన్‌కౌంట‌ర్‌లు..నేర‌స్థుల‌పై యోగీ మార్క్ ట్రీట్‌మెంట్‌

5 వేల‌కు పైగా ఎన్‌కౌంట‌ర్‌లు..నేర‌స్థుల‌పై యోగీ మార్క్ ట్రీట్‌మెంట్‌

   7 hours ago


గ్రేటర్ గజగజ.. కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్

గ్రేటర్ గజగజ.. కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్

   8 hours ago


కోవిడ్ రోగులకు నరకం చూపించిన ఫాతిమా హాస్పిటల్

కోవిడ్ రోగులకు నరకం చూపించిన ఫాతిమా హాస్పిటల్

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle