తెలంగాణలో మరో 94 కరోనా కేసులు.. మరణాల్లోనూ రికార్డే
02-06-202002-06-2020 16:43:04 IST
Updated On 02-06-2020 17:06:11 ISTUpdated On 02-06-20202020-06-02T11:13:04.638Z02-06-2020 2020-06-02T11:13:02.090Z - 2020-06-02T11:36:11.187Z - 02-06-2020

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మరింతగా పాకుతోంది. నిన్నమొన్నటి దాకా పాజిటివ్ కేసులు లేని జిల్లాల్లో కూడా ప్రస్తుతం నమోదవుతున్నాయి. యాదాద్రి భువనగిరి, వనపర్తి వంటి జిల్లాల్లోనూ తొలి పాజిటివ్ కేసు నమోదైంది. అంతేకాదు.. ఇప్పటివరకు సాధారణ ప్రజలే ఈ మహమ్మారి బారిన పడగా.. తాజాగా రాజకీయ నాయకులు, ప్రముఖులకు కూడా సోకుతోంది. సోమవారం బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక రాష్ట్ర పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయమైన డీజీపీ ఆఫీస్ లోనూ ఒకరికి వైరస్ సోకింది. దీంతో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం రాష్ట్రంలో 94 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం పాజిటివ్ అని తేలిన వారిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివారే 79 మంది ఉన్నారు. మిగిలిన కేసుల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మూడు చొప్పున, మెదక్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో రెండు చొప్పున, జనగాం, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,792కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే 2వేలకు చేరువలో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకొని 1491 మంది డిశ్చార్జి కాగా, మరో 1213 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందిన కేసులు 2,358 ఉండగా, వలస కార్మికులు, సౌదీ అరేబియా, సడలింపుల తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా నమోదైన కేసులు 434 ఉన్నాయి. అందులో వలస కార్మికులకు సంబంధించినవి 192, సౌదీ అరేబియా నుంచి వచ్చినవి 212 కేసులు ఉ న్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 88 మంది చనిపోయారు. మొత్తం 1,491 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,213 మంది చికిత్స పొందుతున్నారు. గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లో సిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, భద్రాద్రి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, గద్వాల ఉన్నాయి. లాక్డౌన్ సడలించడంతో కేసుల సంఖ్య పెరుగుతున్నాయనే అభిప్రాయాలు వస్తున్నాయి. గత నెలలతో పోల్చితే మే నెల ప్రారంభం నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. మే 31న అత్యధికంగా 199 కేసులు నమోదయ్యాయి. జూన్, జులై నెలల్లో కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యేకు కరోనా.. హైదరాబాద్‌లో ఓ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. దీంతో ఆయనను సోమవారం జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. దీంతో ఆయన కుటుంబ సభ్యుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. లాక్డౌన్ సమయంలో నిత్యం ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సందర్భంలో ఆయనకు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే, ఉస్మానియా మెడికల్ కాలేజీలో సోమవారం మరో ముగ్గురు వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. రాష్ట్రంలో కరోనా కారక మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సోమవారం మృతి చెందిన ఆరుగురితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 88కి చేరింది. గడచిన నాలుగు రోజుల్లోనే 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుసగా 14 రోజుల్లో 54 మంది చనిపోయారు. సోమవారం నాటి మృతుల్లో ఫలక్‌నుమాకు చెందిన మూడున్నర నెలల పాప కూడా ఉంది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 16 మంది పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు మృతి చెందిన వారిలో 20 మందికి ఎటువంటి ఇతర వ్యాధులు లేవని, కేవలం వైరస్ సోకడంవల్లే మృత్యువాత పడ్డారని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మరణాల రేటు జాతీయ సగటును దాటిపోయింది. ప్రస్తుతం జాతీయ సగటు 2.83 ఉండగా, రాష్ట్రంలో 3.16 శాతంగా నమోదైంది. మే 1 నాటికి 2.68గా ఉన్న మరణాల రేటు సరిగ్గా జూన్ 1 నాటికి 0.48 శాతం పెరిగింది. కేసులు మరింత పెరిగితే.. ఇళ్లలోనే చికిత్స లాక్డౌన్ సడలింపులతో కేసుల సంఖ్య పెరుగుతోందని, మున్ముందు ఇంకా పెరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్న అంశం పై వైద్య ఆరోగ్య శాఖ యం త్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కరోనా రోగుల్లో చాలామంది లక్షణాలు లేని వారే ఉంటున్నారు. కొందరికి మాత్రమే తీవ్రమైన లక్షణాలుంటుండగా, మరికొందరు వెంటిలేటర్లపై ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న వారిలో గత మూడు రోజులుగా ఎలాంటి జ్వరం, దగ్గు వంటి లక్షణాలు లేని వారిని పరీక్షలు చేయకుండానే డిశ్చార్జి చేస్తారు. ఈ మేర కు ఇప్పటికే అలాంటి వారి జాబితా తయారు చేశారు. ఇటీవల కొందరిని అలాగే పంపినట్లు చెబుతున్నాయి. ఇది కూడా కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే చేస్తున్నామని పేర్కొంటున్నాయి. ఇంటికెళ్లాక నిర్ణీత సమయం ప్రకారం వారు హోం క్వారంటైన్లో ఉండాలి. కరోనా రోగులకు చికిత్స చేసే విషయంలో కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రంలోనూ అమలు చేయనున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి, వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారు తమ ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాంటి వారు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యులు సూచించిన మందులు వాడితే సరిపోతుంది. అయితే ఇరుకైన ఇళ్లున్న వారికి ఈ వెసులుబాటు వర్తించదు. మిగతా కుటుంబ సభ్యులతో కలవకుండా ప్రత్యేక గదిలో ఉండటానికి వీలున్న వారికే ఇది వర్తిస్తుంది. ఒకవేళ వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రుల్లోనే ఉంటామని చెబితే.. వారికి అలాగే చికిత్స అందజేస్తారు. అంతేకాదు కరోనా పాజిటివ్ లక్షణాలుండి, తీవ్రత తక్కువ ఉన్న రోగి ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకోవాలంటే, సంబంధిత వైద్యుడి అనుమతి ఉండాలి. అలా ఉంచడం వల్ల వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యుడు నిర్ధారించాలి. ఇంట్లో రోగి సంరక్షణ బాధ్యతలు తీసుకునే వారు తప్పనిసరిగా ప్రొటోకాల్ ప్రకారం హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులు, రోగనిరోధక శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. రోగి మొబైల్లో తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ ఉండాలి. అది ఎల్లప్పుడూ యాక్టివ్‌లో ఉండాలి. వైద్య బృందాలు ఆ వ్యక్తి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయి. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే తక్షణమే ఆసుపత్రికి తరలిస్తారు. రోగి ఇంట్లో ఉన్నప్పుడు ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్ వాడాలి. రోగికి ఏమైనా ఆరోగ్యపరమైన సమస్య వస్తే డాక్టర్లు టెలీ లేదా వీడియో కాల్ ద్వారా సలహాలు ఇస్తారు. రోగనిరోధక శక్తి పెంచుకునే ఆహారాన్ని సూచిస్తారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా