newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో మరో 879 కరోనా కేసులు.. త్వరలో వెయ్యికి చేరువలో..

24-06-202024-06-2020 16:02:29 IST
Updated On 24-06-2020 17:32:11 ISTUpdated On 24-06-20202020-06-24T10:32:29.293Z24-06-2020 2020-06-24T10:32:25.376Z - 2020-06-24T12:02:11.135Z - 24-06-2020

తెలంగాణలో మరో 879 కరోనా కేసులు.. త్వరలో వెయ్యికి చేరువలో..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 879 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,553కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మంగళవారం కరోనా మరో ముగ్గురు మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 220గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 4,224 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 5,109 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా కేసుల్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 652 ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు గరిష్ట స్థాయిలో నమోదు అయ్యాయి. ఈ ఒక్క రోజే 879 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యాయి, ముగ్గురు చనిపోయారు. కాగా ఎప్పటిలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో అతి ఎక్కువ కేసులు (652) నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని మరో 11 జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్‌ఎంసీ తర్వాత మేడ్చెల్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. సోమవారం నాటి కేసులతో పోల్చుకుంటే ఈ రోజు 5 కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి.

రాష్ట్రంలో వరుసగా ఆరో రోజూ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఇన్నాళ్లూ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే వైరస్‌ విజృంభణ కొనసాగగా.. తాజాగా జిల్లాల్లోనూ ప్రతాపం చూపుతోంది. మంగళవారం మరో 879 మంది కొవిడ్‌ బారినపడ్డారు. సోమవారం 872 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో 48 గంటల్లో  1,751 కేసులు నమోదైనట్లయింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో బాధితుల సంఖ్య 9,553కు చేరింది. మంగళవారం వైరస్‌ సోకినవారిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ వారే 652 మంది ఉన్నారు. మేడ్చల్‌ జిల్లాలో 112, రంగారెడ్డిలో 64, వరంగల్‌ రూరల్‌లో 14, కామారెడ్డిలో 10, వరంగల్‌ అర్బన్‌లో 9, జనగాంలో 7, నాగర్‌కర్నూల్‌లో 4, మహబూబాబాద్‌, మంచిర్యాల, సంగారెడ్డిలలో రెండేసి చొప్పున, మెదక్‌లో ఒక కేసు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. 

రాష్ట్రంలో వైర్‌సతో చనిపోయిన వారి సంఖ్య 220కి పెరిగింది. కొత్తగా 219 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4,224కు చేరింది. 5,109 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం వరకు మొత్తం 63,249 మందికి పరీక్షలు చేయగా, 53,696 మందికి నెగెటివ్‌ వచ్చింది. 9,553 మంది వైరస్‌ బారినపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ  పేర్కొంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు భార్య చంద్రకళ (69), కారు డ్రైవర్‌కూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌కు కరోనా నిర్ధారణ అయింది. కళాశాల ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికీ వైరస్‌ సోకింది. 

జనగామ జిల్లాలో మరో ఏడు కేసులు నమోదయ్యాయి. పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయాలని వ్యాపార వాణిజ్య సంస్థల జేఏసీ నిర్ణయించింది. నిర్మల్‌ జిల్లా  ఉమ్రికి చెందిన బాలిక కరోనా లక్షణాలతో మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా  పెద్దమంగళారంకు చెందిన మహిళ (65)కు 19వ తేదీన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పరీక్ష చేయించగా పాజిటివ్‌ అని వచ్చింది. అనుమానంతో కుటుంబసభ్యులు మరుసటి రోజు  మరో ఆస్పత్రిలో చేయించగా నెగిటివ్‌ వచ్చింది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle