newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో మరో 56 కొత్త కేసులు.. 3 జిల్లాలపై ప్రత్యేక దృష్టి

22-04-202022-04-2020 09:16:00 IST
Updated On 22-04-2020 09:54:09 ISTUpdated On 22-04-20202020-04-22T03:46:00.441Z22-04-2020 2020-04-22T03:45:58.625Z - 2020-04-22T04:24:09.234Z - 22-04-2020

తెలంగాణలో మరో 56 కొత్త కేసులు.. 3 జిల్లాలపై ప్రత్యేక దృష్టి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా ఉదృతి తగ్గే సూచనలు తెలంగాణలో కనిపించడం లేదు. సోమవారం ఫర్వాలేదనిపించినప్పటికీ మంగళవారం ఒక్కరోజే కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెయ్యి మార్కును సమీపించాయి. సూర్యాపేటలో అయితే ఒక్క రోజులోనే అత్యధికంగా 26 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆ జిల్లాలో మొత్తం పాజిడివ్ కేసుల సంఖ్య 80కి పెరిగింది.

కరోనా ఉధృతి కొనసాగుతున్న తెలంగాణలో మంగళవారం ఒక్క రోజే కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 928కి చేరింది. ప్రస్తుతం కరోనా బారినపడి 711 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 194 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. 23 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. సూర్యాపేటలో ఒకే రోజు అత్యధికంగా 26 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 80కి చేరింది. ఇక మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 19 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీతో కలిపి 9 జిల్లాల్లో మంగళవారం కేసులు నమోదయ్యాయి.

అత్యధికంగా కేసులు నమోదవుతున్న సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లో రాష్ట్ర ఉన్నత స్థాయి బృందం బుధవారం పర్యటించనుంది. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఈ మూడు జిల్లాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు తదితరులు ఉన్నారు. అయితే ఇప్పటికే మంగళవారం రాత్రే డాక్టర్‌ శ్రీనివాస్‌రావు సూర్యాపేటకు చేరుకున్నారు. మూడు జిల్లాల్లో పరిస్థితిపై ఈ బృందం సమీక్ష చేయనుంది. కేసులు అధికంగా పెరగడానికి గల కారణాలను అధ్యయనం చేయనుంది. పరిస్థితి నియంత్రణకు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ బృందం తెలుసుకోనుంది. అనంతరం ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించనుంది.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారంనాటి 14 కేసులతో పోల్చుకుంటే మంగళవారం కొత్తగా నమోదైన కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మంగళవారం ఒక్కరోజే తెలంగాణలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 928కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 23మంది మృతి చెందారు. ఇప్పటివరకూ 194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం కొత్తగా 8మందిని డిశ్చార్జ్‌ చేశారు.

మంగళవారం తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో సూర్యాపేటలోనే అత్యధికంగా వెలుగుచూడటం గమనార్హం. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 26 మందికి కరోనా పాజిటివ్‌ సోకింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గద్వాల 2, నిజామాబాద్‌ 3, ఆదిలాబాద్‌లో 2, ఖమ్మం, మేడ్చల్‌, వరంగల్‌, రంగారెడ్డిలో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైంది.

జనతా కర్ఫ్యూను కేంద్రం గత నెల 22న దేశవ్యాప్తంగా ప్రకటించింది. అనంతరం మరుసటి రోజు నుంచే తెలంగాణలో లాక్‌డౌన్‌ మొదలైంది. దీంతో నెల రోజులుగా ప్రజలాంతా లాక్‌డౌన్‌లో ఉన్నారు. బస్సులు, రైళ్లు, ఆటోలు సహా పబ్లిక్, ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థ మొత్తం నిలిచిపోయింది. హోటళ్లు, థియేటర్లు, క్లబ్బులు, పబ్బులు, ఫంక్షన్‌ హాళ్లు అన్నీ మూసేశారు. తాజాగా లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించారు. లాక్‌డౌన్‌తో జనాలను ఇంటికే పరిమితం చేసినప్పటికీ కరోనా వ్యాప్తి మాత్రం పూర్తి స్థాయిలో ఆగలేదు.

లాక్ డౌన్ పొడిగించిన తర్వాత జనం బయటకు రావడం పెరిగిపోవడంతో తెలంగాణ పోలీసు విభాగం ఉల్లంఘనులపై కఠిన చర్యలకు మొదలెట్టింది. ఎక్కడికక్కడ జనాలను నిలిపివేయడమే కాకుండా నివాస ప్రాంతాలనుంచి రోడ్డు పాయింట్‌కు వస్తున్న వారిని అడ్డుకునేందుకు అన్ని జిల్లాల్లో భారీ స్తాయిలో బారికేడ్ల నిర్మాణానికి నడుం కట్టారు. ఒక్క మంగళవారమే రాష్ట్రంలో 5 వేల వాహనాలను పట్టుకుని సీజ్ చేశారంటే లాక్ డౌన్ ఉల్లంఘనలు ఏ మేరకు జరుగుతున్నాయో అర్థమవుతుంది.

మంగళవారం నమోదైన కరోనా కేసుల సంఖ్య 

   

జిల్లా పేరు పాజిటివ్‌ కేసులు
1) సూర్యాపేట 26
2) జీహెచ్‌ఎంసీ     19
3) నిజామాబాద్‌        3    
4) గద్వాల               2
5) ఖమ్మం         1
6) మేడ్చల్‌       1
7) వరంగల్‌        1
8) ఆదిలాబాద్‌        2
9) రంగారెడ్డి             1
మొత్తం       56
 

 

 

    


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle