newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో మరో 49 మందికి కరోనా పాజిటివ్‌.. ఒకే రోజు ముగ్గురు మృతి

20-04-202020-04-2020 09:17:43 IST
Updated On 20-04-2020 10:56:20 ISTUpdated On 20-04-20202020-04-20T03:47:43.364Z20-04-2020 2020-04-20T03:47:40.950Z - 2020-04-20T05:26:20.619Z - 20-04-2020

 తెలంగాణలో మరో 49 మందికి కరోనా పాజిటివ్‌.. ఒకే రోజు ముగ్గురు మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంలేదు. ఆదివారం ఒక్కరోజే 49 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవటంతో ప్రభుత్వ, వైద్య అధికారులు తల పట్టుకుంటున్నారు. పైగా ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా మరో ముగ్గురు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 858కి చేరుకోగా, ఇంతవరకు మొత్తం 21 మంది చనిపోయారు.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గకపోగా వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వరకు కరోనా కేసులు, మృతుల వివరాలపై అధికారికంగా ఎలాంటి బులిటెన్‌ విడుదల చేయలేదు. కానీ కానీ రాత్రి 8 గంటలకు తయారైన బులెటిన్‌ బయటకు వెల్లడయింది. బులెటిన్ విడుదల కానందునే ఆదివారం సాయంత్రం నాటికి కొత్తగా మరో 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 858 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. 186 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని, 651 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

తెలంగాణలో ఆదివారం సాయంత్రం వరకు కరోనా వల్ల 21 మృతి చెందారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. వరంగల్‌ రూరల్‌, వనపర్తి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో పాజిటివ్ కేసులు రాలేదని కేసీఆర్‌ వెల్లడించారు. కాగా, కరోనా నుంచి ఇప్పటివరకు 186 మంది కోలుకొని నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరోవైపు ప్రస్తుతం 651 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని రెనివట్లకు చెందిన రెండు నెలల మగశిశువు కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

దేశంలో 8 రోజులకు కేసులు డబుల్‌ అవుతున్నాయని, తెలంగాణలో 10 రోజులకు కేసులు డబుల్ అవుతున్నాయని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మరణాల శాతం దేశంలో 3.22 శాతం ఉంటే తెలంగాణలో 2.44 శాతం ఉందన్నారు. దేశంలో 10 లక్షల మందికి 244 మందిని పరీక్షిస్తే.. తెలంగాణలో 10 లక్షల మందికి 375 మందిని పరీక్షిస్తున్నామని కేసీఆర్‌ అన్నారు. కరోనా చికిత్సకు వాడుతున్న మందులు సరిపడా ఉన్నాయని కేసీఆర్‌ తెలిపారు.

మర్కజ్‌ లింకు కేసులే అధికం: 

రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అగ్రభాగం మర్కజ్‌తో సంబంధం ఉన్నవే. రాష్ట్రంలో ఇప్పటివరకు 809 కేసులు నమోదు కాగా, ఇందులో 664 కేసులు మర్కజ్‌ యాత్రికులు, వారితో సన్నిహితం గా మెలిగిన వారివే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల్లో 82శాతం కేసులివే. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిలో 1,247 మందికి పరీక్షలు నిర్వహించగా 17.76% (232 మందికి) కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారి కుటుంబీకులు, సన్నిహితంగా ఉన్న 2,593 మందికి కూడా పరీక్షలు నిర్వహించగా 18% (432మందికి) పాజిటివ్‌ వచ్చింది. తొలినాళ్లలో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్నా.. మర్కజ్‌ ఘటన తర్వాత తీవ్రత పెరిగి అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విషయానికి వస్తే.. తెలంగాణలో మార్చి 2న అడుగుపెట్టింది. కరోనా వైరస్‌ లక్షణాలతో తొలి కేసు మొదలైంది ఆ రోజునే. అక్కడితో మొదలై పదులు, వందల సంఖ్యలో బాధితులు దీని బారినపడ్డారు. ఏప్రిల్‌ 18 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 809 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన తొలివ్యక్తిని మార్చి 2న గుర్తించారు. ఆ రోజు నుంచి ఈ 48 రోజుల్లో వైరస్‌ వ్యాప్తి ఎన్నో రెట్లు పెరిగింది. మొదటి కేసు నమోదైన తర్వాత రెండో కేసు నమోదుకు 12 రోజులు పట్టింది. మార్చి 14న రెండో కేసు నమోదు కాగా, అక్కడి నుంచి ప్రతి రోజు కేసుల నమోదు క్రమంగా పెరిగింది. అలా 24 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 50కి పెరిగింది. కేసుల సంఖ్య ఒకటి నుంచి యాభై కావడానికి 24 రోజులు పడితే మరో 24రోజుల్లో 800 మార్కు దాటింది. మార్చి 31 నాటికి వంద కేసులు కాగా, ఏప్రిల్‌ 3కి ఈ సంఖ్య రెట్టింపై 233 అయ్యింది. మరో నాలుగు రోజుల్లో 400 దాటి.. ఈనెల 18 నాటికి 809 కేసులు నమోదయ్యాయి.

కరోనా కేసుల నమోదు రాష్ట్రంలో వేగంగా పెరుగుతోంది. తొలి కేసు నమోదైన తర్వాత ఈ ఏడు వారా ల్లో రోజుకు సగటున 17 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చి నెలాఖరుకురాష్ట్రంలో కేసుల సంఖ్య వందకు చేరింది. తొలి 30 రోజుల్లో కేసుల నమోదు సగటున 3.3 చొప్పున ఉంది. ఆ తర్వాత వైరస్‌ వ్యాప్తి పెరగడంతో ఏప్రిల్‌ 1 నుంచి 18వ తేదీ వరకు 700 కేసులు నమోదయ్యాయి. ఇక, ఏప్రిల్‌ విషయానికి వస్తే.. ఈనెల 1 నుంచి 18 వరకు    రోజూ సగటున 39 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈనెల 18 వరకు 12,269 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 809 మందికి పాజిటివ్‌ వచ్చింది. పరీక్షలు చేసిన వాటిలో ఇప్పటివరకు 6.5% మందికి ఫలితాలు పాజిటివ్‌ వచ్చాయి. మొత్తం నమోదైన కేసుల్లో 64 మంది విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారి సన్నిహితులున్నారు. మర్కజ్‌తో సంబంధం ఉన్న కేసులు 664 ఉన్నాయి. ఇందులో మర్కజ్‌ ట్రావెల్‌ కేసులు 232, వాటి కాంటాక్ట్‌ కేసులు 432 ఉన్నాయి. మిగతా కేసులు వైద్య సిబ్బంది, సెకండరీ కాంటాక్ట్, ఇతరులున్నారు. వీరిలో 186 మంది డిశ్చార్జి కాగా, 18 మంది చనిపోయారు. 

రాష్ట్రంలో కరోనా నివారణకోసం సేకరించిన వైద్య సామగ్రి నిల్వల వివరాలు

పీపీఈ కిట్లు: 3.04లక్షలు 

నమూనా సేకరణ కిట్లు: 61,119 

టెస్టింగ్‌ కిట్లు: 21,366 

హెచ్‌సీక్యూలు: 12.35లక్షలు 

వైద్య సిబ్బంది తీసుకున్న హెచ్‌సీక్యూలు: 50,807  

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   10 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   6 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   13 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   16 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle