newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో మరో 14 పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి..మొత్తం కేసులు 872

21-04-202021-04-2020 11:15:36 IST
Updated On 21-04-2020 11:26:44 ISTUpdated On 21-04-20202020-04-21T05:45:36.375Z21-04-2020 2020-04-21T05:45:33.620Z - 2020-04-21T05:56:44.429Z - 21-04-2020

తెలంగాణలో మరో 14 పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి..మొత్తం కేసులు 872
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గలేదు. సోమవారం రాష్ట్రంలో కరోనాకు ఇద్దరు బలయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 23కు చేరింది. కొత్తగా 14 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారి సంఖ్య 872కి చేరింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 12 కేసులు నమోదు కావ డం గమనార్హం. మేడ్చల్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇప్పటివరకు 186 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 663 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.

 ఏప్రిల్‌ ప్రారంభం నుంచి కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సోమవారం మృతి చెందిన వారిలో ఒక మహిళ, ఒక వృద్ధుడు ఉన్నారు. మహిళ 35 ఏళ్ల కేన్సర్‌ రోగి అని, వృద్ధుడి వయసు 72 ఏళ్లు అని, ఆయన శ్వాసకోశ వ్యాధి, ఇతర తీవ్రమైన లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన 6 గంటలకే చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

కరోనా లక్షణాలతో మరణించిన వారికి పరీక్షలు చేయొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల వైద్యాధికారులకు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ప్రజారోగ్య డైరెక్టర్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన వ్యక్తుల నుంచి శాంపిళ్లు సేకరించొద్దని పేర్కొన్నారు. కరోనా లక్షణాలతో చనిపోతే, పాజిటివ్‌గానే పరిగణించాలని సూచించారు. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలకు పాటించిన మార్గదర్శకాలే వీరికీ వర్తింపచేయనున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబసభ్యులను, సన్నిహితులకు పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే, ఆ మరణాన్ని కరోనా మరణాల్లో కలపాలని భావిస్తున్నారు. 

సూర్యాపేట జిల్లాను కరోనా వైరస్‌ చుట్టుముడుతోంది. పట్టణాల నుంచి మండలాలకు, గ్రామాలకు పాకింది. తాజాగా సోమవారం ఒక్కరోజే జిల్లాలో 21 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే రాత్రి పొద్దుపోయే వరకు దీన్ని జిల్లా అధికారులు ధ్రువీకరించలేదు. ఈ నెల 3న మొదటి పాజిటివ్‌ కేసు నమోదు కాగా, సోమవారం నాటికి కేసుల సంఖ్య 75కు చేరుకుంది. సూర్యాపేట డివిజన్‌లోని ఆత్మకూర్, పెన్‌పహాడ్, నాగారం, మద్దిరాల మండలాలకు వైరస్‌ వ్యాపించింది. 

మార్కెట్‌ బజార్‌కు వెళ్లిన వ్యక్తి ద్వారా ఆ కుటుంబంలోని ఆరేళ్ల బాలుడికి వైరస్‌ అంటుకుంది. తాజాగా వచ్చిన రిపోర్టులో ఆ వ్యక్తి గ్రామానికి చెందిన మరో 13 మందికి వైరస్‌ ఉన్నట్లు తేలడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నాలుగేళ్ల బాలుడు, ఆరేళ్లు, నాలుగేళ్ల బాలికలకు, 18 నెలల పాపకు, 8, 12 ఏళ్ల బాలురకు వైరస్‌ సోకినట్లు పరీక్షల్లో తేలినట్లు సమాచారం. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నందు వల్లే పిల్లలకు వైరస్‌ సోకుతున్నట్లు వైద్యాధికారుల పరిశీలనలో తేలింది. 

కరోనా మహమ్మారి గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దగ్గు, తుమ్ములు, జ్వరం లక్షణాలతో బయటపడే ఈ వైరస్‌.. ఇటీవల ఇలాంటి లక్షణాల్లేనివారికి కూడా సోకుతున్నట్లు పరీక్షల్లో తేలింది. పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబసభ్యులు లేదా సన్నిహితంగా మెలిగినవారు పరీక్షలు చేయించుకుంటేనే ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి.

తాజాగా కరోనా బాధితులతో సంబంధం లేని వారికీ వైరస్‌ సంక్రమిస్తున్నట్లు తేలింది. జంటనగరాల్లో ఈ తరహాలో 15 కేసుల వరకు నమోదు కావడంతో ప్రభుత్వానికి వైరస్‌ మూలాలు కనుగొనడం చిక్కుముడిగా మారింది. దీంతో ఈ మాయదారి వైరస్‌ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందిందనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే, మూలాలు లేకుండా కరోనా బారిన పడడంతో ఇంకెంతమందికి ఇలాంటి లక్షణాలున్నాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. 

కాగా, అకస్మాత్తుగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌ను ప్రభుత్వం మార్చేసింది. ఆయనను రాష్ట్ర కరోనా కో–ఆర్డినేటర్‌గా నియమించినట్లు తెలిపింది. ఆ వెంటనే గాంధీ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ రాజారావును నియమించింది. శ్రవణ్‌ను మార్చడంపై తీవ్ర చర్చకు దారితీసింది.

కేసుల తాజా వివరాలు :

  • తెలంగాణలో 23కి చేరిన మరణాలు  
  • మరో 14 పాజిటివ్‌ కేసులు నమోదు 
  • 12 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే
  • మొత్తం 872కు చేరిన కేసుల సంఖ్య 
  • గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మార్పు
ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   21 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle