తెలంగాణలో మద్యం జాతర.. నిబంధనల పాతర
07-05-202007-05-2020 11:22:14 IST
Updated On 07-05-2020 12:16:58 ISTUpdated On 07-05-20202020-05-07T05:52:14.304Z07-05-2020 2020-05-07T05:52:07.157Z - 2020-05-07T06:46:58.958Z - 07-05-2020

వేసవిలో కాలువలకు నీరు విడుదల ఆపేస్తారు.. వర్షాకాలం ఆరంభంలో వాటికి నీటిని విడుదల చేస్తారు. అప్పటికే నెర్రలు చాచిన కాలువల్లోకి నీరు వెల్లువలా వచ్చిపడుతుంది. కట్టలు తెంచుకుంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అలాగే వుంది. 45 రోజుల లాక్డౌన్ తర్వాత లిక్కర్ కోసం మందుబాబుల తెగ తాపత్రయపడ్డారు. రేటెంతయినా ఫర్వాలేదు.. మందు దొరికితే చాలు అన్నట్టుగా వారి మానసిక పరిస్థితి తయారైంది.
రాష్ట్ర వ్యాప్తంగా వైన్‌షాపుల ముందు బారులు తీరిన మద్యం ప్రియులు భారీగా మద్యం కొనేశారు. సాయంత్రం నాలుగు గంటలకు 42 కోట్ల ఆదాయం, 6 గంటల తరువాత 100 కోట్లు దాటినట్లు సమాచారం. రాత్రివేళల్లో డిపోల నుంచి షాపులకు మద్యం సరఫరా అయింది. మండే ఎండను, భారీ క్యూలను సైతం లెక్క చేయకుండా మద్యం కోసం ఎగబడ్డారు. చేతిలో బాటిల్ పడగానే పట్టరాని సంతోషంతో ఇంటికి వెళ్లిపోయి ఎంచక్కా లాగించేసి తమ దాహం తీర్చుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం విక్రయాలే. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం... ఆ జిల్లా... ఈ జిల్లా... ఆ ఊరు... ఈ ఊరు అనే తేడా లేకుండా ఎక్కడ వైన్‌షాపు ఉన్నా ఆ షాపు ముందు భారీ క్యూలే.

All Roads Leads To Wine shops అన్నట్టుగా తయారైంది పరిస్థితి. మద్యం ప్రియులు కొన్నిచోట్ల మీటర్ల దూరం బారులు తీరి భౌతిక దూరం పాటిస్తూ మరీ కొనుక్కున్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.90 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. మద్యం ప్రియులు ఎంతమేరకు తమ డబ్బుల్ని వెచ్చించారో అర్థం చేసుకోవచ్చు. మార్చి 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా మూతపడ్డ వైన్‌షాపుల షట్టర్లు మళ్ళీ తెరుచుకున్నాయి. ఉదయం 10 గంటల నుంచి షాపులు తెరవాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో 8 గంటల నుంచే మందుబాబులు వైన్‌షాపుల దగ్గర చక్కర్లు ప్రారంభించారు.
యువకులు, మధ్య వయస్కులు, వయసు మీద పడ్డవారు, మహిళలు, యువతులు... అంతా లైన్లలోకి వచ్చేశారు. 10 గంటలు కాగానే షాపుల షట్టర్లు లేశాయి. మందుబాబులు తమకు ఇష్టమైన బ్రాండ్ లిక్కర్‌ను కొనుక్కుని తీసుకెళ్లారు. తొలిరోజు కావడంతో మద్యాన్ని భారీగా కొనుగోలు చేశారు. అసలే కేసీయార్ లాక్ డౌన్ ఇబ్బందులనుంచి బయటపడడానికి ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, రేషన్ కార్డులున్నవారికి రూ.1500 అందచేశారు. ఆ డబ్బులు మళ్ళీ రాష్ట్ర ఖజానాకే చేరాయి. ఆ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకున్నట్టయింది.
మందుబాబులు ధరల గురించి పట్టించుకోలేదు. మద్యం దొరికితే చాలు అన్నట్టుగా రెచ్చిపోయారు. చీప్ లిక్కర్‌పై 11 శాతం, ఇతర మద్యంపై 16 శాతం ప్రత్యేక సెస్ విధించింది ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలోని అన్ని రకాల మద్యం ధరలూ పెరిగాయి. ఫుల్‌బాటిల్ చీప్ లిక్కర్‌పై రూ.40, మీడియం బ్రాండ్లపై రూ.80, ప్రీమియం బ్రాండ్లపై రూ.120 చొప్పున పెంచగా.. స్కాచ్, ఫారిన్ బ్రాండ్‌పై రూ.160, బీర్లపై రూ.30 అదనపు భారాన్ని ప్రభుత్వం మోపింది. అయితే పెరిగిన మద్యం ధరలు కొంత గందరగోళానికి కారణమయ్యాయి.
ఉదయం ఒక్కో షాపులో ఒక్కో రేటుకి అమ్మాల్సి వచ్చింది. మధ్యాహ్నానికి కొంత స్పష్టత వచ్చినా ధరల గందరగోళం మాత్రం సాయంత్రం వరకు సాగింది. ప్రీమియం, మీడియం బ్రాండ్లపై రూ.100 నుంచి రూ.300 వరకు పెంచి అమ్మారు. ఎక్సైజ్ శాఖ అంచనా ప్రకారం హైదరాబాద్‌లోనే రూ.50 కోట్ల వరకు విక్రయాలు జరిగి ఉంటాయని అంటున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎంత మద్యం కొనేసి వుంటారో అర్థం చేసుకోవచ్చు. భౌతిక దూరం పాటించాలని, ఎక్కడైనా తేడా వస్తే మళ్లీ మద్యం దుకాణాలు మూసేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో అక్కడక్కడా నిబంధనలు పాటించారు. నో మాస్క్.. నో లిక్కర్ అనడంతో మాస్క్ లేకపోతే మద్యం ఇవ్వరేమో అనే జాగ్రత్త కూడా తీసుకుని ఏదో రకమైన మాస్కు కట్టుకుని క్యూలో నిలబడ్డారు. అయితే సాయంత్రం 6 గంటలకు షాపులు మూసేస్తారన్న సమయంలో అప్పటి వరకు క్యూలో ఉన్న మందుబాబులు మందు దొరుకుతుందో.. లేదో అనే ఆదుర్దాతో భౌతిక దూరాన్ని మర్చిపోయారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది కూడా ఆ సమయంలో చాలా చోట్ల ఏమీ చేయలేకపోయారు.


ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా