newssting
BITING NEWS :
*దిశ ఘటన మరువక ముందే మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి*హైదరాబాద్‌ టీ-20లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన భారత జట్టు *హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. నిందితుల మృతహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలన్న హైకోర్టు... 9న ఉదయం 10.30 గంటలకు విచారణ *కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.*నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది: వైకాపా నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి*చింతపల్లిలో దారుణం.. కుక్కలకు బలయిన శిశువు *కర్నూలు: ఉల్లి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన*ఇవాళ జార్ఖండ్ లో రెండవ విడత పోలింగ్ *దిశ నిందితులు కరుడుగట్టిన నేరస్తులు : సీపీ సజ్జనార్

తెలంగాణలో భారీగా పెరిగిన బస్ పాస్‌, టికెట్ ధరలు

02-12-201902-12-2019 15:17:30 IST
2019-12-02T09:47:30.545Z02-12-2019 2019-12-02T09:47:24.819Z - - 07-12-2019

తెలంగాణలో భారీగా పెరిగిన బస్ పాస్‌, టికెట్ ధరలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
55 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమయిన డిమాండ్ల సాధనకు సమ్మె చేశారు. ప్రధానమయిన ఆర్టీసీ విలీనం డిమాండ్ మరుగునపడేశారు. తర్వాత సమ్మె విరమించారు. ఎంతోమంది కండక్టర్లు, డ్రైవర్లు, ఉద్యోగులు గుండెపోటుతో చనిపోయారు. కొందరు బలిదానాలు చేశారు. కానీ ఫలితం మాత్రం సాధించలేకపోయారు.

చివరాఖరికి సీఎం కేసీఆర్ కి పాలాభిషేకాలు చేశారు. మొత్తానికి దొరగారి మనసు కరిగింది. ఉద్యోగులు కనీవినీ ఎరుగని రీతిలో వరాలు కురిపించారు. కానీ సమ్మె కారణంగా నష్టపోయింది మాత్రం సామాన్య ప్రయాణికులు. 55 రోజుల పాటు ఆర్టీసీ సమ్మెతో డబుల్ ఛార్జీలిచ్చి, జేబులకు చిల్లులు చేసుకుని మరీ ప్రయాణాలు సాగించారు. ఇప్పుడు బస్ ఛార్జీలు పెంచేశారు కేసీఆర్. దీంతో పాటు విద్యార్దులు సామాన్యులు ఎక్కువగా తిరిగే బస్ పాస్ లు భారం అవుతున్నాయి. 

సీఎం కేసీయార్ ఛార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంగళవారం నుంచి ఇవి అమలుకానున్నాయి.  అన్ని రకాలు బస్‌పాసుల ఛార్జీలు భారీగా పెంచేసింది ఆర్టీసీ. సిటీ ఆర్డీనరీ పాస్‌ ఛార్జీ రూ.770 నుంచి రూ.950కి పెరిగింది. మెట్రోపాస్‌ ఛార్జీ రూ 880 నుంచి రూ.1070కి పెంచింది. మెట్రో డీలక్స్‌ పాస్‌ ఛార్జీ రూ.990 నుంచి రూ.1180కి పెంచేశారు. స్టూడెంట్‌ బస్‌పాస్‌ రూ.390 నుంచి రూ.495కి పెంచారు. 

నగరంలో 9.17 లక్షల విద్యార్థి పాస్‌లు ఉన్నాయి. వాటిలో నెలవారీ రూ.130తో కొనే జనరల్‌ పాస్‌లు 2.76 లక్షలుండగా రూ. 390తో 3 నెలలకోసారి కొనే పాసులు 6.41 లక్షలున్నాయి. సాధారణ ప్రయాణికుల పాసులు 17.56 లక్షలున్నాయి. వీటిలో రూ.770తో కొనే జనరల్‌ పాసులు 3.29 లక్షలుంటే రూ. 880తో కొనే మెట్రో పాసులు 14.27 లక్షలున్నాయి. భారీగా పాసులు ఉండటంతో ఆర్టీసీ ఆదాయం పడిపోతోందని అధికారులు చెబుతున్నారు. 

బస్సులను బట్టి పెరిగే ఛార్జీలు

*పల్లె వెలుగు కనీస చార్జీ రూ.5 నుంచి రూ.10కు పెంపు

*సెమీ ఎక్స్‌ప్రెస్‌ కనీస చార్జీ రూ.10గా నిర్దారించిన అధికారులు

* ఎక్స్‌ప్రెస్‌ కనీస చార్జీ రూ.10 నుంచి రూ.15కి పెంపు

*డీలక్స్‌ కనీస చార్జీ రూ.15 నుంచి రూ.20కి పెంపు

* సూపర్‌ లగ్జరీ కనీస చార్జీ రూ.25

*రాజధాని, వజ్ర బస్సుల్లో కనీస చార్జీ రూ.35

* గరుడ ఏసీ లో కనీస చార్జీ రూ.35

*గరుడ ప్లస్ ఏసీలో కనీస చార్జీ రూ.35

* వెన్నెల ఏసీ స్లీపర్ లో కనీస చార్జీ రూ.70

కిలోమీటర్‌కు ఆర్టీసీ వసూలు చేసే రేటు 

*పల్లె వెలుగు - 83 పైసలు

*సెమీ ఎక్స్‌ ప్రెస్‌ - 95 పైసలు

*ఎక్స్‌ప్రెస్‌ - 107 పైసలు 

*డీలక్స్‌ -118 పైసలు 

*సూపర్‌ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ -136 పైసలు 

*రాజధాని ఏసీ, వజ్ర బస్సు - 166 పైసలు 

*గరుడ ఏసీ - 191 పైసలు  

* గరుడ ప్లస్ ఏసీ - 202 పైసలు 

ఆర్టీసీ చార్జీల పెంపును కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తోందని టీపీసీసీ అధ్య క్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆర్టీసీని మెరుగుపరుస్తామని చెప్పి ప్రయాణికులపై భారం మోపడంపై వివిధ పార్టీలు, సామాన్యులు మండిపడుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle