newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జరిగేనా.?

11-09-202011-09-2020 13:32:39 IST
Updated On 11-09-2020 13:34:02 ISTUpdated On 11-09-20202020-09-11T08:02:39.965Z11-09-2020 2020-09-11T08:02:37.235Z - 2020-09-11T08:04:02.173Z - 11-09-2020

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జరిగేనా.?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బతుకమ్మ.. ఈ పండుగ వచ్చిందంటే చాలు. తెలంగాణ ఆడపడుచులంతా నిజమైన సంబురాలు చేసుకుంటారు. బతుకమ్మ సంబురాలు ఆడపిల్లల అందాలకే కొత్త వన్నెను తీసుకొస్తాయి. ఎప్పుడూ ప్యాంటు షర్టులేసుకునే యువతులు కూడా ఈ సంబురాల్లో చీరలు, ఓణీలు కట్టి సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. బతుకమ్మ సంబురాల్లో ఆడపిల్లలు ధరించే రంగురంగుల దుస్తులు పడుచందాలను చూపిస్తాయి.

చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ..అన్ని వయసుల మహిళలంతా కలిసి జరుపుకునే అతిపెద్ద తెలంగాణ పండుగే బతుకమ్మ. తీరొక్క పూలతో చేసిన ఎంగిలిపూల బతుకమ్మలను తయారు చేయడం మొదలు బతుకమ్మ సంబురాలు ప్రారంభమవుతాయి. జానపద గీతాలు పాడుకుంటూ ఆడపిల్లలు కాళ్లకు గజ్జెలు కట్టి చిందులేస్తుంటే..నిజంగా బతుకమ్మే వచ్చి ఆడి పాడుతున్నట్లుంటుంది. అలాంటి బతుకమ్మ సంబురాలపై కూడా కరోనా పంజా విసరనుందా ? అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

2020లో అక్టోబర్ 17 నుంచి 24 వరకూ బతుకమ్మ సంబురాలు జరుగుతాయని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ప్రకటించింది. ఈ మేరకు 17న ఎంగిలి పూల బతుకమ్మలను సిద్ధం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కానీ రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో బతుకమ్మ సంబురాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా ? అని తెలంగాణ ఆడపడుచుల్లో సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ప్రతి ఏటా బతుకమ్మ సంబురాలంటే చాలు..పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా అన్నిప్రాంతాల్లోనూ రంగురంగుల పువ్వులు దర్శనమిచ్చేవి.

పల్లెల్లో అయితే..ఊరంతా ఒకచోటికి చేరి బతుకమ్మలను పేర్చి పూజలు చేసి, ఊరి చివర్లో ఉన్న కాలువలో లేదా..నదులలో నిమజ్జనం చేసేవారు. పట్టణాల్లో.ముఖ్యంగా హైదరాబాద్ లో బతుకమ్మ అంటే గుర్తొచ్చేది ట్యాంక్ బండ్. ఎక్కడెక్కడినుంచో ఆడపడుచులంతా ఇక్కడికి వచ్చి బతుకమ్మలను పేర్చి అర్థరాత్రి వరకూ ఆడి పాడతారు. తర్వాత బతుకమ్మలను హుస్సేన్ సాగర్ లో వెళ్లిరావమ్మా..! బతుకమ్మా..! అంటూ బతుకమ్మను సాగనంపుతారు.

కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే ట్యాంక్ బండ్ వద్ద కాదు కదా..కనీసం సాంప్రదాయ పండుగలకు నెలవైన పల్లెల్లో కూడా బతుకమ్మ పండుగ సందడి కనిపించేలా లేదు. కారణం కరోనా.. పైగా ఆర్థిక సంక్షోభం కూడా బతుకుమ్మ సంబురాలు ఘనంగా జరగపోవడానికి ఒక కారణమయ్యే అవకాశం ఉంది. ఉగాది, శ్రీరామనవమి, వరలక్ష్మివ్రతం, వినాయకచవితి ఉత్సవాల్లాగే ఈ బతుకమ్మ సంబురాలు కూడా వెలవెలబోతాయన్న సంకేతాలు వస్తున్నాయి.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   an hour ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle