newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

తెలంగాణలో పౌర స్పందన కరువైందా?

21-11-201921-11-2019 08:27:16 IST
2019-11-21T02:57:16.288Z21-11-2019 2019-11-21T02:57:07.342Z - - 24-02-2020

తెలంగాణలో పౌర స్పందన కరువైందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం

ఆర్టీసీ కార్మికుల ఎడతెగని సమ్మె...

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్మలు, గుండెపోట్లు

కాంట్రాక్టు కార్మికులతో ఆర్టీసీ అధికారుల కుస్తీ

రెవిన్యూ అధికారుల అలసత్వం

జనంలో స్పందించే గుణం తగ్గిపోయిందా?

...ఇలా ఎన్నో సమస్యలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. అయితే వీటిపై ఏవో కొన్ని రాజకీయపార్టీలు స్పందిస్తున్నాయి. కానీ వీటిని జనం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు పౌరసమాజం ప్రశ్నించడమే మానేసింది. ప్రభుత్వంలో చలనం తెచ్చి వివిధ సమస్యలను పరిష్కరించే తెగువ, చలాకీతనం పౌర సమాజంలో ఇసుమంతైనా కనిపించడంలేదు. పౌరసమాజాన్ని తట్టిలేపే మీడియా కూడా అంత క్రియాశీలకంగా వ్యవహరించడంలేదు. 

ప్రధాన మీడియా ఈ వార్తలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. చిన్న పత్రికలు, సోషల్ మీడియా మాత్రమే వీటిని పట్టించుకుంటోంది. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 46 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు తొలుత పట్టుబట్టారు. ఆర్టీసీ కార్మికుల సెల్ఫ్ డిస్మిస్ పేరుతో కేసీఆర్ చేసిన ప్రకటనలు, జీతాలు రాక 25 మందికి పైగా కార్మికులు గుండెపోట్లు, ఆత్మహత్యలకు గురయ్యారు. వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. అయినా తెలంగాణలో వీటిపై పెద్దగా చర్చ జరగడంలేదు. ప్రధాన పార్టీలు మాత్రమే ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించాయి,

హైదరాబాద్ లో ప్రధానంగా కనిపించే బీజేపీ, వామపక్షాలు, టీటీడీపీ, టీజెఎస్ వంటి పార్టీలు ఆర్టీసీ కార్మికుల వెంట నడిచాయి. ఇవి వత్తిడి తెచ్చినా కేసీఆర్‌లో మాత్రం చలనం లేదు. వారానికి ఒకసారి అఖిలపక్ష నేతలు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ని కలిసినా ప్రయోజనం కనిపించడంలేదు. తాజాగా గవర్నర్ తో ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని మొరపెట్టుకున్నాయి అఖిలపక్షాలు. మరి ఫలితం ఎలా వుంటుందో చూడాలి. 

ఆర్టీసీ కార్మికుల సమస్య చిన్నదేం కాదు. 50 వేలమంది కార్మికులు .. వారిపై ప్రత్యక్షంగా ఆధారపడ్డ 2లక్షలమందికి పైగా కుటుంబాలు. వారిని నమ్ముకుని చిన్నచిన్న వ్యాపారాలు చేసే లక్షలాదిమంది చిరు వర్తకులు.

ఇవి చాలవన్నట్టు ప్రజారవాణాను నిత్యం ఉపయోగించే కోట్లాదిమంది ప్రయాణికులు... వెరశి ఇది పెద్ద సమస్యే. కానీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు, వారి ఆవేదనకు అంతగా పత్రికల్లో ప్రాధాన్యత లభించడం లేదనే చెప్పాలి. ఏదో ఒకటి రెండు రోజులు హడావిడి చేశాయి. 

సరూర్ నగర్లో సకల జనుల సమరభేరి జరిగింది. ఈ సభకు వేలాదిమంది తరలి వచ్చారు. కానీ వారి వాయిస్ అంతగా మీడియాలో ప్రతిఫలించలేదు. కొన్ని మీడియా సంస్థలు కవరేజ్ కి వెళ్లినా అంతగా ప్రజెంట్ చేయలేదు.

మరికొంతమంది మీడియా ప్రతినిధులు స్టేడియం బయటే వుండిపోవాల్సి వచ్చింది. మీడియాపై ఆంక్షలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సీఎం అడుగుజాడల్లో నడిచే మీడియా ఎలాగూ ఉంది. అవి సమ్మెను అంతగా ప్రజల్లోకి తీసుకువెళ్లే సాహసం చేయదు, చేయలేదు కూడా. 

దీనికంటే ముందు ప్రజల్లోనే వివిధ సమస్యలపై స్పందించే గుణం తగ్గిందనే చెప్పాలి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ పడుతుందని అంతా భావించారు.

విపక్షాలు కూడా అదే ఆశించాయి. కానీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ కంచుకోట కూలిపోయింది. అసలు జనం ఆర్టీసీ సమ్మె గురించే పట్టించుకోలేదు. టీవీల్లో జరిగే చర్చలను జనం అంతగా చూడడంలేదు. తమ చుట్టూ జరిగే అంశాలను వారు లైట్ తీసుకుంటున్నారు. 

రెవిన్యూ వ్యవస్థ మీద ప్రజలకే కాదు, సీఎం కేసీయార్ కి కూడా అంత మంచి అభిప్రాయం లేదు. అందుకే వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు కానీ అది జరగడంలేదు. రంగారెడ్డిజిల్లాలో అబ్దుల్లాపూర్ మెట్ తాహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసు వెలుగులోకి వచ్చాక కాస్త స్పందన కనిపిస్తోంది. రెవిన్యూ అధికారుల రెడ్ టేపిజం విపరీతంగా పెరిగిపోతోందనడానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనం. అయినా శాశ్వత పరిష్కారం ఆలోచించడంలేదు. 

ఓయూ విద్యార్ధులు కూడా గతంలోలా స్పందించడంలేదు. ఆర్టీసీ విషయంలో ఓయూ విద్యార్ధులు బాగానే స్పందించారు. ప్రధాన సమస్యలపై మేధావులు మౌనం దాల్చారు.

ఆర్టీసీ సమ్మెపై అందరిదీ ఒక దారి అయితే లోక్ సత్తా వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్ భిన్నంగా వ్యవహరించారు. కేసీఆర్ తో ఆయన ఏకీభవించారు. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అదే దారి పట్టారు. 

విపక్షాలతో ఆయన కలవలేదు. మొదటినుంచీ ఆయనది కేసీఆర్ మిత్రపక్షం. అదే రుజువు చేశారు. తెలంగాణ ఉద్యమం తర్వాత పౌరసమాజం స్తబ్ధంగా ఉందనే చెప్పాలి. కీలక అంశాల్లో స్పందించడం లేదు. చర్చించడం లేదు. ఈ సమాజానికి ఏం అయింది? వాట్సాప్ మెసేజ్ లు, టిక్ టాక్ లు, ఫేస్ బుక్ లతో కుస్తీపట్టడానికే జనానికి సమయం సరిపోతోంది.

అంతవరకే వారు పరిమితం అవుతున్నారు. వైరల్ వీడియోలతో కాలం గడిపేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లతో స్పందన కరువవుతోంది. ప్రధాన సమస్యలు పక్కదారి పడుతున్నాయి. 2014 నాటి పౌరసమాజానికి, 2019 సమాజానికి మధ్య చాలా అంతరం కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన వాతావరణం ఇప్పుడేమైంది. తెలంగాణ ఏర్పడ్డాక అదంతా కనుమరుగైపోయిందా? 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle