newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్ కేసులతో టెన్షన్

03-04-202003-04-2020 08:53:25 IST
Updated On 03-04-2020 12:24:57 ISTUpdated On 03-04-20202020-04-03T03:23:25.504Z03-04-2020 2020-04-03T03:23:21.324Z - 2020-04-03T06:54:57.928Z - 03-04-2020

తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్ కేసులతో టెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం మరో 27 మందికి ఈ వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 154కి చేరింది. ఈ మొత్తం కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు, వారి బంధువులే 86 మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది చనిపోయారు. బుధవారంనాటికి 14 మంది డిశ్చార్జి కాగా, గురువారం మరో ముగ్గురు డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 128 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

సంగారెడ్డిలో తొలిసారిగా కరోనా పాజిటివ్ కలకలం రేపింది.  సంగారెడ్డిలో ఒకేసారి ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని  అధికారికంగా ప్రకటించారు మంత్రి హరీష్ రావు.  పాజిటివ్ వచ్చిన ఆరుగురు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారేనని,  ఆరుగురి కుటుంబ సభ్యులను ఐసోలేషన్ కు తరలించామన్నారు. అయితే ఇప్పటివరకు నమోదైన కేసుల్లో సంగారెడ్డి జిల్లా వినా మిగిలినవి ఏ జిల్లాలనుంచి ఎన్ని వచ్చాయన్న దానిపై స్పష్టత లేదు. ములుగు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయని అక్కడి జిల్లా అధికారులు ప్రకటించినట్టు సమాచారం. 

ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతినిధులు, వారి బంధువులు, స్నేహితులను తీసుకొచ్చి పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు కాకుండా, ఇంకా 600 శాంపిళ్ల ఫలితాల కోసం వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఆ ఫలితాల ద్వారా ఇంకెన్ని కేసులు నమోదవుతాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితులను బట్టి అంచనా వేస్తే భారీగానే కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీలో ప్రార్థనలు చేసుకొని వచ్చినవారిలో 1030 మంది ఉన్నారు. వారు వేలాది మందిని కాంటాక్ట్‌ అయినట్లు అంచనా వేశారు. అన్ని జిల్లాల నుంచి వెళ్లడంతో ఇప్పుడు రాష్ట్రమంతా రెడ్‌ జోన్‌లోనే ఉన్నట్లుగా భా విస్తున్నామని ఒక అధికారి వ్యాఖ్యానించారు. 

కరోనావ్యాప్తి పెరిగిన వేళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ప్రాంతం, ప్రతీ గ్రామం, ప్రతీ జిల్లా కూడా లాక్‌డౌన్‌ను సీరియస్‌గా పాటించాల్సి ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 70 శాతం మంది సాధారణ భక్తులు కాగా, మిగిలిన 30 శాతం మంది ప్రచారకులు అని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారి తెలిపారు. లాక్ డౌన్ లో విచ్చలవిడిగా తిరిగేవారి వాహనాలు సీజ్ చేయనున్నారు. నిబంధనలను కఠినతరం చేయాలని ప్రధాని మోడీ తెలంగాణ సీఎం కేసీయార్ కు సూచించారు. 

ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ ఉన్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై, తప్పుడు ప్రకటనలు చేసేవారిపై రాష్ట్రాలు భారతీయ శిక్షాస్మృతి, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ల కింద కేసులు పెట్టవచ్చునని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఒక లేఖ రాశారు. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు మార్చి 24న జారీ అయ్యాయన్నారు.

వీటిని ఉల్లంఘించిన వారిపై 2005 నాటి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టంలోని 51వ సెక్షన్‌ నుంచి 60 సెక్షన్‌ వరకూ అన్నీ వర్తిస్తాయని స్పష్టంగా ఉందని హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఐపీసీలోని సెక్షన్‌ 188 కింద కూడా ఉల్లంఘనకారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు. ఈ రెండు చట్టాలకు సంబంధించిన శిక్షల గురించి ప్రజల్లో  అవగాహన కల్పించాలని చెప్పారు. లాక్‌డౌన్‌ను అమలు చేసే ప్రయత్నాలను అడ్డుకునే వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశముందని, తప్పుడు ప్రకటనలు చేసేవారికి కూడా రెండేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించవచ్చునని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో నిధులు, వస్తు సామగ్రి దుర్వినియోగం చేస్తే కూడా రెండేళ్ల జైలు, జరిమానా ఉంటుందని హెచ్చరించారు. ఈ నిబంధనలు తెలంగాణలో ఏప్రిల్ 15 వరకూ అమలవుతాయి. 

 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   2 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   7 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   10 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   10 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   11 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   13 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   13 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   13 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   14 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle