తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్‌లు ఒక్కరోజులో 66 కొత్త కేసుల నమోదు..
18-04-202018-04-2020 08:21:27 IST
Updated On 18-04-2020 09:18:41 ISTUpdated On 18-04-20202020-04-18T02:51:27.615Z18-04-2020 2020-04-18T02:51:25.052Z - 2020-04-18T03:48:41.721Z - 18-04-2020

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు తెలంగాణలో కొత్తగా మరో 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 46 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, జీహెచ్ఎంసీ పరిధిలోనే మొత్తం 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 18 మంది చనిపోయారు. శుక్రవారం సాయంత్రానికి తెలంగాణలో మొత్తం 766 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో 286 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. 131 మంది డిశ్చార్జ్, తెలంగాణలో ఇప్పటి వరకు 186 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు. కరోనా వల్ల 18 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం పేర్కొంది. కొత్త కేసుల నమోదు విషయంలో సూర్యాపేట రికార్డు సృష్టిస్తూనే ఉంది. ఈ జిల్లాలో శుక్రవారం నాడే 15 కొత్త కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గురువారం 50 మందికి పాజిటివ్ రాగా, శుక్రవారం ఏకంగా 66 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 766కి చేరుకుంది. ఇప్పటివరకు 18 మంది మరణించగా.. కరోనా నుంచి కోలుకుని 186 మంది ఇంటికి వెళ్లినట్టు శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఆ తర్వాత నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మార్కెట్ బజార్లో 12, బీబీగూడెంలో 3 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 54 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రజారోగ్య సంచాలకుడు విడుదల చేసిన బులెటిన్‌లో సూర్యాపేటలో ఇప్పటివరకు 44 కేసులు మాత్రమే నమోదైనట్టు పేర్కొన్నారు. మరోవైపు పాజిటివ్ కేసులు పెరగడంతో సూర్యాపేట పట్టణంలోని 48 వార్డులను రెడ్‌జోన్ పరిధిలోకి తెచ్చినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. వైరస్ అధికంగా ప్రబలుతున్న ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్మెంట్ ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 28 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి చెందగా, శుక్రవారం నాటికి 13 జిల్లాల్లో 209 కంటైన్మెంట్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఇందులో తాజాగా 1,09,975 ఇళ్లకు వెళ్లి, 4,39,900 మందిని వైద్య బృందాలు కలిసి వారి వివరాలు సేకరించాయి. కరోనా పాజిటివ్ లక్షణాలు ఏవైనా ఉన్నాయా మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారి సెకండరీ కాంటాక్ట్‌లను ట్రేస్ చేసి పరీక్షలు చేస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి నోటిఫైడ్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా ఘంటికలు మోగుతుండటంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు చెందిన బృందం హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడ కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు సేకరించింది. ఆ బృందం సభ్యులు గాంధీ, ఛాతీ ఆస్పత్రులకు వెళ్లి కరోనా బాధితులకు అందుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్రంలోని ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా మరణం సంభవించింది. చెన్నూరు మండలం ముత్తరావుపేట చెందిన మహిళ (46) అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమె కొడుకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్యులు కరోనాగా అనుమానించారు. మంగళవారం కింగ్ కోఠి ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మహిళ అంబులెన్సులోనే తుదిశ్వాస వదిలింది. అయితే వైద్యులు మృతురాలి నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు. శుక్రవారం ఫలితాల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. జిల్లాలో ఇదే తొలి కరోనా పాజిటివ్ కేసు. కాగా మృతురాలి నివాసానికి 3 కిలోమీటర్ల పరిధిలో అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. గురువారం నాటికే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 700పైగా దాటేసింది. ఈ 700ల కేసుల్లో 640 కేసులు ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ సదస్సు నుంచి వచ్చినవారికి చెందినవే అని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
13 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
3 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
13 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
11 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
13 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
14 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
8 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
16 hours ago
ఇంకా