తెలంగాణలో పెరుగుతున్న కరోనా మరణాలు.. మీడియాకు సోకిన పాజిటివ్స్
04-06-202004-06-2020 15:29:31 IST
Updated On 04-06-2020 15:41:45 ISTUpdated On 04-06-20202020-06-04T09:59:31.149Z04-06-2020 2020-06-04T09:59:28.857Z - 2020-06-04T10:11:45.884Z - 04-06-2020

తెలంగాణలో ఇవాళ కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనాతో ఇవాళ ఏడుగురు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 3,020కి చేరింది. ఇవాళ జీహెచ్ఎంసీలో 108, రంగారెడ్డి, అసిఫాబాద్ 6, సిరిసిల్ల, మేడ్చల్ 2, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఒక్కో కేసు నమోదయినట్లు హెల్త్ బులిటెన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ కొత్తగా ఇద్దరు వలస కూలీలకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్‌పై కొవిడ్-19 పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్ కరోనా కేసుల రాజధానిగా మారిపోతోంది. లాక్డౌన్ ఆంక్షలను కట్టడి ప్రాంతాలకే పరిమితం చేసి సడలింపులు ఇస్తుండడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాలకూ వైరస్ విస్తరిస్తోంది. ముఖ్యంగా మే 15 నుంచి ఆంక్షలను సడలించడంతో జనం రాకపోకలు పెరిగాయి. హైదరాబాద్‌లో మే నెల మొదటి పదిహేను రోజుల్లో 363 కేసులు నమోదైతే.. 16 నుంచి 31వ తేదీ వరకు 652 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే.. 15 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. తెలంగాణలో ఒక్క మేలోనే ఇప్పటిదాకా 1660 మందికి పాజిటివ్ వచ్చింది. వాస్తవానికి రాష్ట్రంలో మే 31 వరకూ చనిపోయిన 82 మందిలో ఓ 20 మంది ఇతర దీర్ఘకాలిక వ్యాధులేవీ లేకుండా, కేవలం కరోనా వల్ల కన్నుమూశారు. తెలంగాణలో మొదటిసారిగా కొన్ని ప్రముఖ ప్రాంతీయ మీడియా సంస్థల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం సంచలనం కలిగిస్తోంది. కానీ ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా మీడియా సంస్థలు జాగ్రత్త పడటంతో ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకోవడానికి వీలులేకపోయింది. ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ కీలక ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ ప్రాంతీయ మీడియా సంస్థల్లో కనీసం పది మందికిపైగా కరోనా వైరస్ సోకినట్లుగా గత రెండురోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవి పుకార్లు కాదని, నిజమేనని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏపీలో కరోనా టెస్టులు 4,03,747.. పరీక్షల నిర్వహణలో దేశంలో నెంబర్ వన్ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగు లక్షల మార్కును అధిగమించింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 8,066 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 4,03,747కు చేరింది. ప్రతి పది లక్షల జనాభాలో 7,561 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా అన్ని రాష్ట్రాల కంటే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. కొత్తగా 180 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మొత్తం కేసుల సంఖ్య 3,971కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 94 వలస కూలీలకు చెందినవి కాగా, మరో 7 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివి. మొత్తం కేసుల్లో 573 వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు, 119 విదేశాల నుంచి వచ్చినవారివి. 55 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,456కు చేరింది. కరోనాతో మరో నలుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 68కు చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,447గా ఉంది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా