newssting
Radio
BITING NEWS :
భారీ విధ్వంసం సృష్టిస్తూ బుధవారం అర్థరాత్రి పుదుచ్చేరి వద్ద తీరం దాటిన నివర్ తుఫాన్. తీరందాటే సమయంలో భీకర గాలుల ధాటికి నేలకూలిన భారీ వృక్షాలు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత. * నివర్ తుఫాన్ ప్రభావంతో చిగురుటాకులా వణికిపోతున్న తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. గత అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వాలు. ఇళ్లు సురక్షితం కాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచన. * తుఫాను సమయంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు. నెల్లూరు జిల్లా , తమిళనాడుకు చెందిన మత్స్యకారులు సేఫ్. శ్రీహరికోట తీరంలో తలదాచుకున్న మత్స్యకారులు. * ఎన్టీఆర్ ఘాట్ కూల్చాలన్న ఎంఐఎం వ్యాఖ్యల్ని ఖండించిన టీడీపీ నేతలు. ఎన్టీఆర్ పై అభిమానముంటే భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ నేతలు. * అక్బరుద్దీన్ కు గట్టి కౌంటరిచ్చిన బీజేపీ నేత బండి సంజయ్. దమ్ముంటే పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చాలని సవాల్. వారి ఘాట్లను కూల్చిన వెంటనే దారుస్సలాంను కూల్చివేస్తామన్న బండి సంజయ్. * తెలంగాణలో కొత్తగా మరో 862 కరోనా కేసులు, ముగ్గురు మృతి. * సమ్మె చెేపట్టిన సింగరేణి కార్మికులు. కేంద్రం చేపట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె. సమ్మెలో పాల్గొన్న నాలుగు కార్మిక సంఘాలు. * 26/11 ముంబై ఉగ్రదాడులకు నేటితో 12 ఏళ్లు పూర్తి. ఉగ్రదాడుల్లో అమరులైన వారికి నివాళులర్పించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్.

తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు.. కొత్త రేట్లు ఇవే

06-05-202006-05-2020 09:37:06 IST
Updated On 06-05-2020 09:44:30 ISTUpdated On 06-05-20202020-05-06T04:07:06.966Z06-05-2020 2020-05-06T04:07:03.263Z - 2020-05-06T04:14:30.407Z - 06-05-2020

తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు.. కొత్త రేట్లు ఇవే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంతా భావించినట్టే మద్యం ప్రియులకు తెలంగాణ సీఎం కేసీయార్ తీపికబురు అందించారు. కంటైన్మెంట్ ఏరియాస్ మినహాయించి మిగతా జోన్లలలో మద్యం షాపులు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇక బార్లు, పబ్‌లను తెరిచే ప్రసక్తి లేదని కేసీయార్ అన్నారు. చీప్ లిక్కర్‌పై 11 శాతం, మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. పెంచిన ధరలు ఈ విధంగా ఉన్నాయి.

https://www.photojoiner.net/image/oEe9hYyZhttps://www.photojoiner.net/image/jkHjCh2x

* ఆర్డినరీ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.10, 375 

* ఎంఎల్‌పై రూ.20, 750 ఎంఎల్‌పై రూ.40 అదనం

* మీడియం లిక్కర్‌కు సంబంధించి 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.20, 375 ఎంఎల్‌పై రూ.40

* 750 ఎంఎల్‌పై రూ.80 

* ప్రీమియం లిక్కర్‌ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.30, 375 ఎంఎల్‌పై రూ.60

*750 ఎంఎల్‌పై రూ.120 అదనం

*స్కాచ్ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.40,

* స్కాచ్ 375 ఎంఎల్‌పై రూ.80, 750 ఎంఎల్‌పై రూ.160 అదనం

* అన్ని సైజుల బీర్‌పై ఫ్లాట్ రూ.30 పెరిగింది.

తెలంగాణకు పక్కనే ఉన్న నాలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరిచారు. రాష్ట్రంలో గుడుంబా పురుడుపోసుకుంది. మద్యం దుకాణాలను ఇక్కడ కూడా తెరవాల్సిన పరిస్థితి నెలకొంది. పక్క రాష్ట్రంలోలాగా భారీగా పెంచబోమన్నారు. లాక్ డౌన్ తర్వాత కూడా పెంచిన రేట్లు అమలులో వుంటాయన్నారు. లిక్కర్ షాప్ యజమానులు జాగ్రత్తగా తీసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించాలి . ఇది నా హెచ్చరిక. లేనిపక్షంలో గంటలోపే మద్యం దుకాణం మూసేస్తాం. మీడియా కూడా మద్యం దుకాణాల పరిస్థితిని ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయండి. మీ సహకారం కోరుతున్నానన్నారు. మాస్కు లేకుంటే మద్యం బాటిళ్లు ఇవ్వద్దన్నారు సీఎం కేసీయార్. షాపుల ముందు బారికేడ్లు ఏర్పాట్లుచేసుకోవాలన్నారు. నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని. సాయంత్రం వరకూ మందు దొరుకుతుంది కాబట్టి క్యూలైన్లలో నిలబడి హడావిడి చేయవద్దన్నారు కేసీయార్. 

 

మహిళా ఖైదీలకు శుభ‌వార్త చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్‌

మహిళా ఖైదీలకు శుభ‌వార్త చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్‌

   9 hours ago


ప్ర‌చారం చివ‌రి రోజున భాగ్య‌న‌గ‌రానికి వ‌స్తున్న మోదీ.. మ‌త‌ల‌బేంటీ..?

ప్ర‌చారం చివ‌రి రోజున భాగ్య‌న‌గ‌రానికి వ‌స్తున్న మోదీ.. మ‌త‌ల‌బేంటీ..?

   9 hours ago


అమూల్ చేతికి సహకార డైరీలు.. అసలు రహస్యం ఇదే?! (పార్ట్-1)

అమూల్ చేతికి సహకార డైరీలు.. అసలు రహస్యం ఇదే?! (పార్ట్-1)

   9 hours ago


బండ్ల గ‌ణేశ్ కు ఇంట్లో బ్యాండుమేళం..!

బండ్ల గ‌ణేశ్ కు ఇంట్లో బ్యాండుమేళం..!

   10 hours ago


అబ్బో.. బీజేపీ మేనిఫెస్టో బందోబ‌స్తుగ‌నే ఉంది..!

అబ్బో.. బీజేపీ మేనిఫెస్టో బందోబ‌స్తుగ‌నే ఉంది..!

   11 hours ago


'కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె' కేటీఆర్ సెటైర్లు

'కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె' కేటీఆర్ సెటైర్లు

   12 hours ago


మొన్న స‌ర్జిక‌ల్, నిన్న కూల్చివేతలు, రేపేంటి..?

మొన్న స‌ర్జిక‌ల్, నిన్న కూల్చివేతలు, రేపేంటి..?

   12 hours ago


పంప‌కాల్లో తేడాలు.. వైసీపీలో గొడ‌వలు

పంప‌కాల్లో తేడాలు.. వైసీపీలో గొడ‌వలు

   13 hours ago


పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.. ఇదీ ఏపీలో ఉద్యోగుల పరిస్థితి!

పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.. ఇదీ ఏపీలో ఉద్యోగుల పరిస్థితి!

   13 hours ago


తెలంగాణ‌లో ఎంత మంది మంత్రి ప‌ద‌వులు ఊడ‌తాయో..!

తెలంగాణ‌లో ఎంత మంది మంత్రి ప‌ద‌వులు ఊడ‌తాయో..!

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle