newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో పెరిగిన కరోనా వేగం .. మేడ్చల్ జిల్లాలో పంజా

01-08-202001-08-2020 10:33:21 IST
Updated On 01-08-2020 14:00:14 ISTUpdated On 01-08-20202020-08-01T05:03:21.983Z01-08-2020 2020-08-01T05:03:11.873Z - 2020-08-01T08:30:14.844Z - 01-08-2020

తెలంగాణలో పెరిగిన కరోనా వేగం .. మేడ్చల్ జిల్లాలో పంజా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. జులై 31న కొత్తగా 2083 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  64,786 కు చేరింది. మృతుల సంఖ్య 530కు చేరింది. వీరిలో 46,502 మంది డిశ్చార్జ్ అవ్వగా ఇంకా 17,754 మంది చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 1114 మంది కోలుకున్నారు. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీ లో 578 కేసులు, రంగారెడ్డిలో 228, కరీంనగర్‌లో 108, సంగారెడ్డిలో 101, వరంగల్‌ అర్బన్‌ 134, మేడ్చల్‌ 197, నిజామాబాద్ 73  న‌మోదు అయ్యాయి.

ఇటు శివారు ప్రాంతాల్లో కరోనా వ్యాపిస్తోంది. గతంలో కరోనా లేని ప్రాంతాల్లో ఇప్పుడు కొత్తగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జీహెచ్ ఎంసీ తర్వాత మేడ్చల్ జిల్లాలో  కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొద్దిరోజుల కిందటి వరకూ పది. ఇరవై కేసులు రాగా, ఇప్పుడు రోజూ సెంచరీ దాటిపోతున్నాయి. మొదటి నుంచి టెస్టులు, ట్రేసింగ్లో నిర్లక్ష్యంగా ఉండడం, హోం క్వారంటెయిన్లపై పర్యవేక్షణ లేకపోవడంతోనే తీవ్రత పెరుగుతోంది. 

లక్షణాలున్నా టెస్టులు చేసేలోపు ప్రైమరీ కాంటాక్టులు పెరిగిపోతున్నాయి. జనాభా, విస్తీర్ణంలో పెద్దదైన మేడ్చల్ జిల్లా కరోనా కేసుల్లో దూసుకుపోతోంది. మేడ్చల్ జిల్లాలో మొత్తం 32 వేల 700 టెస్ట్​లు చేయగా, 11,336 మందికి పా జిటివ్ వచ్చింది.

వైరస్ వ్యాప్తి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లావాసులను టెన్షన్ పెట్టిస్తోంది. కేసులను కంట్రోల్ చేయడంలో అధికారుల తీరుపై విమర్శలొస్తున్నాయి. హైకోర్టు పర్యవేక్షిస్తున్నా, తరచూ మందలిస్తున్నా పరిస్థితుల్లో అంతగా మార్పులు రావడం లేదు. 

కరోనా టెస్టుల గురించి ఎవరైనా వచ్చినా జీహెచ్ఎంసీ పరిధి అంటూ జిల్లా యంత్రాంగం నిరక్ష్ల్యంగా ఉంది. లాక్ డౌన్ లో నామ మాత్రంగా కంటెయిన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసిన అధికారులు కట్టడిపై ఫోకస్ చేయలేదు.

ర్యాపిడ్ టెస్టులు అందుబాటులోకి వచ్చాక పాజిటివ్ వచ్చిన వాళ్లు హోం క్వారంటెయిన్ లో ఉంటున్నా పర్యవేక్షించడం లేదు. ఇంట్లోనే ఉంటున్నామని బయటకు వచ్చేవారు ఎక్కువయ్యారు. కరోనా టెస్టులు లేకపోయినా కరోనా పాజిటివ్ లక్షణాలున్నవారు స్వచ్ఛంధంగా నిర్బంధం విధించుకోవాలి. వారి రాకపోకలపై ఫోకస్ చేస్తేనే తీవ్రత తగ్గుతుంది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle