newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో పూర్తిగా తగ్గిన కరోనా కేసులు.. సగం తగ్గిన కంటైన్మెంట్ జోన్లు: కేసీఆర్ హర్షం

28-04-202028-04-2020 09:00:46 IST
Updated On 28-04-2020 09:42:22 ISTUpdated On 28-04-20202020-04-28T03:30:46.297Z28-04-2020 2020-04-28T03:30:43.453Z - 2020-04-28T04:12:22.225Z - 28-04-2020

తెలంగాణలో పూర్తిగా తగ్గిన కరోనా కేసులు.. సగం తగ్గిన కంటైన్మెంట్ జోన్లు: కేసీఆర్ హర్షం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌పై రాష్ట్రప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని 21 జిల్లాలు మంగళవారం నాటికి కరోనా నుంచి విముక్తి పొందుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పైగా ఇంతవరకు నమోదైన పాజిటివ్ కేసులలో 97 శాతం రోగులు వైరస్ నుంచి బయటపడి ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ కావడం తెలంగాణ మొత్తానికి శుభసూచకమని తెలిపారు.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతున్న ధోరణిని చూస్తే మరి కొద్దిరోజుల్లోనే తెలంగాణ పూర్తిగా కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడుతుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తపరిచారు. ఇది నిజంగా సానుకూల అంశం. ప్రజలు ఏమాత్రం భయపడొద్దు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కొత్తగా పుట్టుకొచ్చే కేసులను కూడా సునాయాసంగా ఎదుర్కొనడానికి పూర్తి సన్నద్ధతతో ఉందని సీఎం కేసీఅర్ భరోసా ఇచ్చారు.

కరోనా వైరస్ వ్యాప్తి కూడా వేగంగా తగ్గుముఖం పడుతున్నందువల్ల రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు కూడా గణనీయంగా తగ్గిపోయాయని కేసీఆర్ చెప్పారు. సోమవారం ప్రధాని నరేంద్రమోదీతో వీడియా కాన్ఫరెన్స్‌లో పాలుపంచుకున్న తర్వాత రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిపై కేసీఆర్ ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ అత్యంత కఠినంగా అమలు చేసినందువల్లే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలిగామని, ఇతర దేశాలనుంచి వచ్చినవారు, మర్కజ్ ఆధ్యాత్మిక సదస్సుకు హాజరైన వారి నుంచి  ప్రధానంగా వైరస్ వ్యాప్తి చెందిందని, వీరి జాడను పసిగట్టడంలో పోలీసు, ఆరోగ్య శాఖలు ప్రదర్సించిన నిబద్ధత వల్లే కరోనా కట్టడిలో మంచి ఫలితాలను సాధించగలిగామని కేసీఆర్ వివరించారు.

కాగా, తెలంగాణలో కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సోమవారం కేవలం రెండు పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. అవీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,003కి చేరింది. ఒక్కరోజే 16 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. ఇప్పటివరకు 25 మంది చనిపోగా, మొత్తం 332 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 646మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 556 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సూర్యాపేటలో 83 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 18,859మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్యను వైద్య, ఆరోగ్యశాఖ తగ్గించింది. సమగ్ర ఇంటింటి సర్వే ముగియడం, లక్షణాలున్న వారిని గుర్తించడం వంటివి పూర్తికావడంతో కంటైన్మెంట్‌ ప్రాంతాలను కుదించారు. మొదట్లో దాదాపు 243 వరకు కంటైన్మెంట్‌ ప్రాంతాలను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం వాటి సంఖ్య దాదాపు సగం మేరకు తగ్గించారు. వివిధ జిల్లాల్లో 62, హైదరాబాద్‌లో 70 వరకు ప్రస్తుతం కంటైన్మెంట్‌ జోన్లు నడుస్తున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కంటైన్మెంట్‌ జోన్లలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఏఎన్‌ఎంలు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇందులో పాల్గొని లక్షలాది మందిని సర్వే చేశారు. ఎవరికైనా జ్వరం, కరోనా అనుమానిత లక్షణాలుంటే వారిని గుర్తించారు. కొన్నిచోట్ల ఆ సర్వేపై వ్యతిరేకత వచ్చినా చాలావరకు సమాచారం సేకరించినట్లు అధికారులు తెలిపారు. 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉంది. దీంతోపాటు రాత్రి వేళల్లో కర్ఫ్యూను కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో ఏదైనా అత్యవసరమైతేనే బయటకు రావడానికి అనుమతి ఉంది. నిత్యావసరాలను కొనుగోలు చేసుకోవడానికి అవకాశముంది. అయితే కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం పూర్తి నిర్బంధంలోనే ప్రజలు ఉంటారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన చోట దాని తీవ్రతను బట్టి రెండుమూడు కిలోమీటర్ల వరకు కంటైన్మెంట్లు ఏర్పాటు చేశారు.

తీవ్రత తక్కువ ఉన్నచోట 100 ఇళ్లున్నా కంటైన్మెంట్లను ఏర్పాటు చేశారు. ఈ జోన్లలోని ప్రజలు బయటకు రావడానికి వీలులేదు. బయటివారు ఇక్కడకు వెళ్లడానికి అవకాశంలేదు. మొత్తం 3,500 వైద్య బృందాలు ఈ జోన్లలో ప్రజల ఆరోగ్య స్థితిగతులను అంచనా వేశాయి. పోలీసులు గట్టి నిఘా పెట్టారు. కొన్నిచోట్ల డ్రోన్లతోనూ నిఘా నిర్వహించారు. అంతేకాదు ఆయా కంటైన్మెంట్‌ ఏరియాల్లోని హోంక్వారంటైన్‌లో ఉన్న వారి కదలికలను ప్రత్యేక యాప్‌ ద్వారా పరిశీలించారు. 

రాష్ట్రంలో గత 5 రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. ఈ నెల 22న 15 కేసులు నమోదుకాగా, 23న 27, 24న 13, 25న 7, 26న 11 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఈ నెల 21న 56 కేసులు నమోదయ్యాయి. 19న 49 కేసులు రికార్డయ్యాయి. ఈ నెల 3న ఏకంగా 75 కేసులు నమోదయ్యాయి. వరుసగా ఐదు రోజులు కేసులు తగ్గుతుండటంతో ప్రభుత్వం కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్యను కుదిస్తూ పోతోందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. పైగా జిల్లాల్లోనూ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 26న నమోదైన 11 కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి నుంచే నమోదయ్యాయి. 

గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే అధికంగా 540 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే రెండో కాంటాక్టులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయొద్దన్న సర్కారు నిర్ణయంతో ఒక్కసారిగా కేసుల సంఖ్య తగ్గింది. విదేశీ కాంటాక్టులు, మర్కజ్‌ కాంటాక్టులు అన్నీ పూర్తయ్యాయి. వారి రెండో కాంటాక్టులకు ఇప్పుడు పరీక్షలను నిలిపివేశారు. కేవలం లక్షణాలుంటేనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చే వారు, ఇతరత్రా కరోనా అనుమానిత లక్షణాలున్న వారికే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందువల్ల కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయని అధికారులు చెబుతున్నారు. ఎటువంటి లక్షణాలు లేని విదేశీ, మర్కజ్‌ రెండో కాంటాక్టులకు నిర్ధారణ పరీక్షలు చేయడం వృథా ప్రయాసని వారు పేర్కొంటున్నారు.

 

 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   17 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle