newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో పులుల స్వేచ్చా విహారం.. రైతులకు భారీ పరిహారం

25-06-202025-06-2020 10:25:47 IST
Updated On 25-06-2020 11:18:33 ISTUpdated On 25-06-20202020-06-25T04:55:47.025Z25-06-2020 2020-06-25T04:55:32.610Z - 2020-06-25T05:48:33.048Z - 25-06-2020

 తెలంగాణలో పులుల స్వేచ్చా విహారం.. రైతులకు భారీ పరిహారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ లాక్ డౌన్, ఇతర నిబంధనల కారణంగా జన సంచారం బాగా తగ్గిపోయింది. స్టేహోం.. స్టే సేఫ్ అనే నినాదం కారణంగా జనం బయట తిరగడం బాగా తగ్గిపోయింది. దీంతో వన్యప్రాణులు ముఖ్యంగా పులులు, ఎలుగుబంట్లు స్వేచ్ఛా విహారం చేస్తుండడంతో జనం కంటిమీద కునుకు కరువైంది. పులులు రోడ్లమీదకు రావడంతో జనం వణికిపోతున్నారు. తెలంగాణలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో పులులు పశువులపై పడి ఆకలి తీర్చుకుంటున్నాయి. దీంతో అటవీ శాఖ రైతులకు భారీగా పరిహారం చెల్లించాల్సి వస్తోంది. 

మేత కోసం అడవికి వెళ్లిన రైతుల పశువులను హతమారుస్తూ పులి తన ఆకలి తీర్చుకుంటోంది. దీంతో సదరు రైతులకు పరిహారం రూపంలో అటవీశాఖ లక్షలాది రూపాయలు ఇవ్వాల్సి వస్తోంది. ఇలా ప్రతి నెలా పులి ఆకలి ఖర్చు పెరిగిపోతోందని అధికారులు అంటున్నారు.  ఉమ్మడి ఆదిలాబాద్‌ జి ల్లా పరిధిలో విస్తరించిన కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లో ఇటీవల పశులవులపై పులుల దాడులు పెరిగాయి. గతంలో కంటే పులుల సంఖ్య పెరగడంతో దాడుల సంఖ్య పెరిగింది. దీంతో  నష్టపరిహారం పెరుగుతూ వస్తోంది.

గతేడాది ఒక్క కాగజ్‌నగర్‌ డివిజన్‌లోనే 77 పశువులు పులికి ఆహారం మారాయి. ఇందుకు రూ. 9.62 లక్షలు పరిహారంగా పశువుల యజమానులకు చెల్లించారు. తాజాగా ఈ ఏడాది ఇప్పటివరకు మరో 5 పశువులపై దాడిచేయగా.. రూ.38 వేలు చెల్లించారు. చెన్నూరు డివిజన్‌లో 50కిపైగా పశువులు పులి దాడిలో చనిపోగా రూ.6 లక్షలు, బెల్లంపల్లి డివిజన్‌ పరిధిలో 32 పశువులకు గాను రూ.5 లక్షల వరకు చెల్లించారు.మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేం ద్రంలో పులుల సంతతి పెరిగి.. అవి ప్రాణహిత నది దాటి కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లోకి వస్తున్నాయి. ప్రస్తుతం కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లో 6 పులులు సంచరిస్తున్నట్లు అంచనా. 

ఈ పులులకు సరైన ఆహారం లేదు. దీంతో అవి మేతకు వచ్చినవాటిని చంపి తినేస్తున్నాయి. అటవీ అధికారులు గడ్డిక్షేత్రాలు పెంచి శాకాహార జంతువుల సంతతిని వృద్ధి చే స్తున్నారు. ఫలితంగా కొన్నాళ్లకు శాకాహార జంతువులు పెరిగే అవకాశాలున్నా.. ఇప్పటికిప్పు డు పులుల సంఖ్యకు అనుగుణంగా ఆహారం అందడం లేదు.  గతంలో విచ్చలవిడిగా వన్యప్రాణుల వేట, కలప అక్రమ రవా ణాతో శాకాహార జంతువుల సమతుల్యత దెబ్బ తింది. అదీగాక పంది, జింక, దుప్పి, నీల్గాయి లాంటివి వేటాడటం కంటే మేతకు వెళ్లిన పశువులను వేటాడటం పులికి సులభంగా మారింది. అవి ఎక్కువదూరం వేటాడి అలసిపోయే అవకాశం లేదు. అవి సులువుగా పులులకు చిక్కుతున్నాయి. 

పులుల సంచారం అధికంగా ఉన్న కాగజ్‌నగర్, చెన్నూరు, ఆసిఫాబాద్‌ ఫారెస్టు డివిజన్లతో పా టు పెంచికల్‌పేట, బెజ్జూరు, చెన్నూరు, కోటపల్లి, నీల్వాయి ప్రాంతాల్లో పరిహారం చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల బెల్లంపల్లి, మంచిర్యాల డివిజన్లలోనూ పులుల సంచారం పెరగటంతో పశువులపై దాడులు మొదలయ్యా యి. అటవీ సమీప గ్రామాల శివార్లలో మేతకు వెళ్లిన పశువులపై పులులు పంజా విసురుతున్నాయి. గేదెలు, ఆవులు, ఎద్దులు, గొర్రెలు ఎక్కువగా పులికి ఆహారమవుతున్నాయి. మేతకు పశువులను తీసుకువెళ్లిన వారిపై కూడా పులులు దాడి చేస్తున్నాయి. ఇటీవల ఒక పశువుల కాపరి పులి చేతిలో గాయపడి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. 

పశువులను చంపి తినడం వల్ల యజమానుల జీవనోపాధి దెబ్బతింటుంది. అందుకే ఆయా పశువులను బట్టి రేటు కట్టి పరిహారం ఇస్తుంటారు.  గేదె, ఆవు, ఎద్దు, గొర్రె, మేకకు ఓ రేటు ప్రకారం ఇస్తున్నారు. పాలిచ్చేవి, పశువుల వయసు తదితర అంశాలను బట్టి విలువ కడుతున్నారు. ఇందుకు స్థానిక పశువైద్యులతో పులి దాడిలోనే చనిపోయిందనే ధ్రువీకరణతోపాటు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో అటవీ అధికారులు విచారణ చేపట్టి నష్టపరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తే చెక్కురూపంలో పశువు యజమానికి డబ్బులు అందిస్తారు. దాదాపు రెండు వారాల్లోపే నష్టపరిహారం చెల్లించడంతో పశువుల యజమానులకు లభిస్తోంది. పరిహారం చెల్లింపుల కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా నిధులు కేటాయించ వలసి వస్తోంది. 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle