newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!

10-12-201910-12-2019 13:46:31 IST
Updated On 10-12-2019 15:25:03 ISTUpdated On 10-12-20192019-12-10T08:16:31.239Z10-12-2019 2019-12-10T08:15:50.139Z - 2019-12-10T09:55:03.447Z - 10-12-2019

 తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా ఉల్లిపాయల కొరత తీవ్రంగా వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఉల్లిని ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది ప్రభుత్వం. దీంతో త్వరలో ధరలు తగ్గే అవకాశం ఉంది.

ఏపీలో ప్రభుత్వం కిలో రూ.25 కే రైతు బజార్ల ద్వారా సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా మరో తెలుగు రాష్ట్రం ఈ బాటలో నడవనుంది. దీంతో తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ధర రూ. 100 దాటిపోయింది కిలో ఉల్లి. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్వర ఉపశమనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఉల్లి దిగుమతి చేసుకుంటోంది. రైతు బజార్ల ద్వారా ప్రతి వ్యక్తికి కిలో చొప్పున అందించనుంది. అయితే ఏపీ ప్రభుత్వంలా కాకుండా కిలో రూ.40కి అందించేవిధంగా చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కి భారీగా ఉల్లిగడ్డలు దిగుమతి కానున్నాయి.

అందులో భాగంగా ఈ వారంలో  5 వందల మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయలను తెప్పించుకుంటోంది మార్కెటింగ్ శాఖ. సెంచరీ దాటిన ఉల్లి ఘాటు సామాన్యులకు తగలకుండా.. ఉపశమన చర్యలకింద సబ్సీడీ ద్వారా తో ఉల్లి సరఫరా చేయాలని యోచిస్తోంది.

రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఉల్లి కౌంటర్లు ఏర్పాటు చేసి.. కిలో ఉల్లి ధర రూ.40కి అందించాలని సీఎం కేసీయార్ అధికారులకు సూచించారని తెలుస్తోంది. దిగుమతి చేసుకునే ఉల్లిని మలక్‌పేట మార్కెట్‌కు తరలిస్తారు.

అక్కడి నుంచి ఒకట్రెండు రోజుల్లో ఇతర మార్కెట్లకు చేరవేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారు. అయితే దిగుమతి అయ్యే ఉల్లిపాయలపై దిగుమతి సుంకం లేకుండా చేసేందుకు కేంద్రంతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. దిగుమతి సుంకం పడితే ప్రభుత్వంపై భారం పడుతుంది.

15వ తేదీ వరకు ఈ ఉల్లి నగరానికి చేరనుంది. రైతు బజార్లతో పాటు వివిధ మార్కెట్ల ద్వారా.. కిలో రూ.50 నుంచి రూ.60 లోపు విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle