తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
26-04-202026-04-2020 09:04:26 IST
Updated On 26-04-2020 09:25:34 ISTUpdated On 26-04-20202020-04-26T03:34:26.751Z26-04-2020 2020-04-26T03:34:12.503Z - 2020-04-26T03:55:34.562Z - 26-04-2020

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 2 లక్షలు దాటింది. కరోనా కేసుల సంఖ్య 2,920,877కు చేరుకుంది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 2, 03, 272కు పెరిగింది. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 54, 256కు పెరిగింది. ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,60, 651కిపెరిగింది. భారతదేశంలో 26,496 కరోనా కేసులు నమోదు. కాగా .. కరోనాతో 824 మంది మృతి చెందారు. మొత్తం 5803 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకూ 779 మంది మరణించారు. తెలంగాణలో 990 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 26 మంది మరణించారు. కొత్తగా ఏడుకేసులు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 16 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే.. తెలంగాణలో తగ్గుముఖం పట్టడం విశేషం. కరోనా రోజురోజుకీ విస్తరిస్తున్నా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధుల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొవిడ్ ఉనికి కనిపించలేదు. మూడు పోలీసు కమిషనరేట్లలోని 57 పోలీసు స్టేషన్ల పరిధిలోకి వచ్చే కాలనీలు, బస్తీల్లో ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు. లాక్డౌన్ ప్రకటించి నెలరోజులు పూర్తైన నేపథ్యంలో కమిషరేట్ల పరిధుల్లో వైరస్ ప్రభావం, కేసులపై పోలీసు ఉన్నతాధికారులు వేర్వేరుగా సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, తబ్లిగీ జమాతే ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి ద్వారానే 80శాతం కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. ఇటు పాతబస్తీలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదైనా... చార్మినార్ పోలీసు ఠాణాలో ఒక్క కేసు నమోదు కాలేదు. రాచకొండ కమిషనరేట్‌లో అత్యధికంగా 27 ఠాణాల పరిధుల్లో వైరస్ అడుగు పెట్టలేదు. హైదరాబాద్‌లో 15, సైబరాబాద్‌లో 15 ఠాణాల ప్రాంతాల్లో కేసులు లేవు. రాబోయే 13రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులున్న ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. అబిడ్స్, అఫ్జల్‌గంజ్, సుల్తాన్‌బజార్, కాచిగూడ, షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్, గోపాలపురం, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి, చార్మినార్.శంషాబాద్ ఎయిర్‌పోర్టు, శంషాబాద్ రూరల్, మొయినాబాద్, కొత్తూర్, కేశంపేట, కొందుర్గ్, చౌదరిగూడ, అమన్‌గల్, తలకొండపల్లి, కడ్తాల్, శంకర్పల్లి, షాబాద్, చేవెళ్ల, పేట్‌బషీరాబాద్, మేడ్చల్.ఎల్బీనగర్, మీర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, మాడ్గుల, ఉప్పల్, ఘట్కేసర్, పూర్వ నల్గొండ జిల్లాలోని మరో 17 ఠాణాల పరిధి ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. కరోనా కేసులు తగ్గుతుండడంతో కంటైన్మెంట్ జోన్లను తగ్గిస్తున్నారు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ హాస్టల్ భవనం పేరు మార్చింది. టిమ్స్ గా పేరు మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
13 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
13 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా