newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో తగ్గిన పాజిటివ్ కేసులు.. వైరస్ నియంత్రణే లక్ష్యం

16-04-202016-04-2020 08:11:14 IST
Updated On 16-04-2020 09:02:20 ISTUpdated On 16-04-20202020-04-16T02:41:14.586Z16-04-2020 2020-04-16T02:41:12.387Z - 2020-04-16T03:32:20.519Z - 16-04-2020

తెలంగాణలో తగ్గిన పాజిటివ్ కేసులు.. వైరస్ నియంత్రణే లక్ష్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా పాజిటవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బుధవారం కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 650కు చేరుకుందని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 

ఇప్పటివరకు తెలంగాణలో కరోనా నుంచి కోలుకొని118 మంది డిశ్చార్జ్‌ కాగా, 18 మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 259 కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. బుధవారం ఒక్కరోజు 94,514 గృహాల్లో 1,13,192 మందిని వైద్యసిబ్బంది పరిశీలించారు.

రాష్ట్రం మొత్తంమీద హైదరాబాద్ మహానగర పరిధిలో వైరస్ కేసులు ఎక్కువ కావడంతో వైరస్ వ్యాప్తి నిరోధానికి క్లస్టర్ల వారీగా విభజించి ఒక్కో క్లస్టర్‌కు ప్రత్యేక వైద్యాధికారులతో కూడిన బృందాన్ని ప్రభుత్వం నియమించింది. తద్వారా క్షేత్ర స్థాయిలో మరింత మెరుగ్గా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని పాజిటివ్ వ్యక్తులతో సంబంధం ఉన్నవారిని గుర్తించడం సత్వరమే వారిని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించండం, పరీక్షలు నిర్వహించడం వంటివి అవుతాయని ప్రభుత్వం బావిస్తోంది.

తాజాగా గుర్తించిన ఇతర రెడ్ జోన్ జిల్లాల్లోనూ ప్రత్యేక బృందాలను నియమించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. లాక్ డౌన్ అమలుకు మరో 18 రోజుల గడువు ఉండటంతో ఈలాగో ఎక్కడివారినక్కడే నిర్బంధించడం ద్వారా వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత మేరకు కట్టడి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం విధించుకుంది.

ప్రస్తుతం రాష్టంలో సామాజిక వ్యాప్తి జరగకపోయినా కేసుల సంఖ్య 650 దాటడంతో అప్రమత్తత కొనసాగించాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ అమలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాపై యుద్ధానికి తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని.. ఎంతమంది రోగులకైనా చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తామన్నారు. 

ఎంతమందికైనా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైరస్‌ నిర్దారిత పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్‌ కిట్స్‌, చికిత్సకు కావాల్సిన సదుపాయాలన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు.

259 కంటైన్మెంట్‌ జోన్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయనున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   an hour ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   an hour ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   5 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   7 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   9 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   2 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   3 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   10 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle