newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో తగ్గని కేసుల తీవ్రత.. మళ్ళీ 2479 కేసులు

09-09-202009-09-2020 08:35:45 IST
Updated On 09-09-2020 09:27:59 ISTUpdated On 09-09-20202020-09-09T03:05:45.520Z09-09-2020 2020-09-09T03:05:23.633Z - 2020-09-09T03:57:59.608Z - 09-09-2020

తెలంగాణలో తగ్గని కేసుల తీవ్రత.. మళ్ళీ 2479 కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల కరోనా తీవ్రత కొనసాగుతూనే వుంది. తెలంగాణలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటిన్ ప్రకారం కొత్తగా 2,479 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా పది మంది మృత్యవాత పడ్డారు. కాగా, తాజాగా నమోదైన కరోనా కేసుల సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,47,642కు చేరుకుంది. 

ఇదే సమయంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 916 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుండి కోలుకుని 2,485 మంది ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు 1,15,072 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 31,654 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ంసీ పరిధిలో 322 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

రంగారెడ్డి జిల్లాలో 188, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 183, వరంగల్‌ అర్బన్‌లో 124, కరీంనగర్‌లో 120, నల్గొండలో 108, నిజామాబాద్‌లో 101 అత్యధికంగా కరోనా కేసులు వచ్చాయి. ఒకే రోజు 62,649 శాంపిల్స్‌ పరీక్షించగా.. ఇప్పటి వరకు 18,90,554 నమూనాలను పరిశీలించినట్లు తెలిపింది. ఇంకా 2,430 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 50,922 మందికి టెస్టులు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు అందరికీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ తీవ్రత ఉన్నంత కాలం ఈ పరీక్షలను నిర్వహిస్తునే ఉంటామని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ పరీక్షలు చేస్తున్నారు. ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రి, ప్రకృతి చికిత్సాలయం, సరోజనీదేవి కంటి ఆస్పత్రి, నిజామియా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు మలక్‌పేట, నాంపల్లి, గోల్కొండ, కింగ్‌కోఠి ఆస్పత్రి, ఫీవర్‌ ఆస్పత్రుల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ గతంలో 200 నుంచి 250 వరకు పరీక్షలు నిర్వహించారు. కొద్ది రోజులుగా జనం తాకిడి తగ్గడంతో 150 నుంచి 200 లోపు మాత్రమే పరీక్షలు చేస్తున్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle