newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

తెలంగాణలో డేంజర్ బెల్స్.. మరింత అప్రమత్తత అవసరం!

13-04-202013-04-2020 14:17:23 IST
Updated On 13-04-2020 14:35:25 ISTUpdated On 13-04-20202020-04-13T08:47:23.262Z13-04-2020 2020-04-13T08:47:20.418Z - 2020-04-13T09:05:25.319Z - 13-04-2020

తెలంగాణలో డేంజర్ బెల్స్.. మరింత అప్రమత్తత అవసరం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది. లాక్ డౌన్ మొదలై మూడు వారాలు గడుస్తున్నా కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఢిల్లీ నిజాముద్దీన్ నుండి వచ్చిన కేసులతోనే ఈ విజృభన జరిగినట్లుగా ప్రభుత్వం ఇప్పటికే తేల్చేసింది. ఢిల్లీ నుండి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్ చేసిన ప్రభుత్వం వారితో కాంటాక్ట్ అయిన వారిని పూర్తిస్థాయిలో ట్రేస్ చేసింది.

అయితే, వారి ద్వారా సోకిన కేసులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. దీనికి ఉదాహరణగా ఒక్క సూర్యాపేట ఉదంతాన్ని తీసుకోవచ్చు. సూర్యాపేటలో ఢిల్లీ నుండి వచ్చిన వ్యక్తి వలన ఓ మెడికల్ షాప్ యజమానికి.. మార్కెట్ లో మరొకరికి కూడా స్ప్రెడ్ అయింది. తాజాగా ఈ ప్రాంతంలో ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనిబట్టి చూస్తే రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తూ ఉంది.

అందుకే ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ పొడిగించింది. కాగా ఇప్పటికే మూడు రోజుల క్రితమే హాట్ స్పాట్లను గుర్తించిన ప్రభుత్వం దాదాపుగా వందకు పైగా ప్రాంతాలలో అలర్ట్ పెంచింది. కాగా తాజాగా మరో వంద ప్రాంతాలను గురించిన ప్రభుత్వం మొత్తం రెండు వందలకు పైగా ప్రాంతాలలో పూర్తస్థాయి భద్రతా, వైద్య సదుపాయాలను పెంచింది. ఈ ప్రాంతాలలో ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లకుండా చూస్తున్నారు.

ఆదివారం సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షా సమావేశంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం కూడా తెలంగాణలో 28 కొత్త కేసులు నమోదయ్యాయని .. అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ లాక్ డౌన్ తో పాటు వైరస్ వ్యాప్తి చర్యలను సమర్ధవంతంగా నిర్వర్తించాలని కోరారు. సరిహద్దు మహారాష్ట్రలో వైరస్ విజృంభణ విషయాన్ని కూడా కేసీఆర్ ఈ సమీక్ష సమావేశంలో ప్రస్తావించారు.

తెలంగాణలో ఇప్పటివరకు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మాత్రం లేదని, కరోనా వైరస్ సోకినా ప్రతి ఒక్కరికి ఎక్కడి నుండి ఎలా సంక్రమించిందో పూర్తిగా ప్రభుత్వం ట్రేస్ చేయగలుగుతున్నట్టుగా సీఎం చెప్పకొచ్చారు. అయితే, ఇదే సమయంలో ఢిల్లీ నుండి వచ్చిన వారితో ఎంతమందికి స్ప్రెడ్ అయిందో మరోసారి ఖచ్చితమైన విచారణ చేయాలని అధికారులకు సూచించారు.

ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారున్న ప్రాంతాలతో ప్రజల నిరంతర అప్రమత్తతోనే, ఇళ్లకే పరిమితవడంతోనే కరోనా వ్యాప్తి నివారణ సాధ్యం అవుతుందని సీఎం పేర్కొన్నారు. హాట్ స్పాట్లను గుర్తించి ప్రభుత్వం వైద్య, పారిశుధ్య, రక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటుండగా ప్రజలు వారికి సహకరిస్తేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని చెప్పారు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు కొనసాగుతుండగానే తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ ఇప్పటికే లాక్ డౌన్ నెలాఖరుకి పొడగించేశారు. లాక్ డౌన్ అమలు.. మరింత అప్రమత్తతతో ఉంటేనే ఈనెలాఖరుకు వైరస్ వ్యాప్తిని వందకు వంద శాతం అదుపు చేయగలిగే పరిస్థితి ఉంటుందని ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అర్ధమవుతుంది. ఏదైనా ప్రజల చేతుల్లోనే ఉంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle