తెలంగాణలో జూన్ 8 నుంచి పదవతరగతి పరీక్షలు.. షెడ్యూల్ ఇదే
22-05-202022-05-2020 17:07:32 IST
Updated On 22-05-2020 17:27:19 ISTUpdated On 22-05-20202020-05-22T11:37:32.193Z22-05-2020 2020-05-22T11:36:13.555Z - 2020-05-22T11:57:19.348Z - 22-05-2020

తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా మార్చిలో ఆగిపోయిన పదవతరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలయింది. పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 8న ఇంగ్లీష్ పేపర్-1, జూన్ 11న ఇంగ్లీష్ పేపర్-2, 14న గణితం పేపర్-1, 17న గణితం పేపర్-2, 20న సైన్స్ పేపర్-1, 23న సైన్స్ పేపర్-2, 26న సోషల్ స్టడీస్ పేపర్-1, 29న సోషల్ స్టడీస్ పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
గత మార్చి 19న 10వ తరగతి పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటికి 3 పరీక్షలు మాత్రమే అయ్యాయి. తెలుగు, హిందీ పరీక్షలు పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో, మిగిలిన 8 పరీక్షలకు రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
పరీక్షల నిర్వహణకు ఇప్పటికే హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. పరీక్షల నిర్వహణకు, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు అన్ని చర్యలు చేపడతామంది ప్రభుత్వం. పదవ తరగతి పరీక్షలకోసం తెలంగాణలో 5 లక్షలమందికి పైగా విద్యార్ధులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 3 న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని ప్రభుత్వం హైకోర్టు అదేశించింది. జూన్ 4 న కోవిడ్ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు అదేశించడంతో ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేస్తోంది. జూన్ 8 న పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం కు సూచించడంతో ఏర్పాట్లు చేసింది. పదవతరగతి పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని, కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటే పరీక్షలు నిలిపివేయాలని కోర్టు సూచించింది.



వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా